ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ అనంతర భారత ఆర్థిక వ్యవస్థలో వెదురు ఒక కీలక అంశం: డాక్టర్ జితేంద్ర సింగ్

ఈశాన్య ప్రాంతంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కు చోదక శక్తి వెదురు రంగం

Posted On: 10 JUL 2020 5:36PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ  సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) , ప్రధానమంత్రి కార్యాలయంలో  సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణువిద్యుత్, అంతరిక్ష విభాగాల బాధ్యుడ్ఉ డాక్టర్ జితేంద్ర సింగ్ భారత్ ఆర్థిక వ్యవస్థలో కోవిడ్ అనంతరం వెదురు రంగం చాలా కీలక రంగాల్లో ఒకటి కాబోతున్నదని  అన్నారు.  కేన్, వెదురు సాంకేతిక కేంద్రం క్లస్టర్లు వెదురు వ్యాపారానికి  సంబంధించిన వ్యక్తులతోఆయన వెబినార్ లో  ఆయన ప్రసంగించారు. భారత్ లోను, భారత్ ఉపఖండంలోను ఈశాన్య ప్రాంతంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ను వెదురు వ్యాపారం ముందుకు నడుపుతుందని అన్నారు. స్థానికతకే పెద్ద పీట వెయ్యాలన్న ప్రధాని పిలుపుకు కూడా  ఇది ఊతమిస్తున్నదన్నారు.

 

 



సృష్టించండి, మెరుగు పరచండి, సమన్వయం చేయండి అనే మంత్రాన్ని వెదురు రంగానికి వినియోగించి పూర్తి స్థాయిలో వాడుకోవాలని స్వదేశంలోను, విదేశాల్లోను బ్రాండింగ్, పాకేజింగ్, మార్కెటింగ్ చేయాలని పిలుపునిచ్చారు.

గత 70  ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రంగం అనూహ్యంగా పుంజుకున్నదని ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడి సామర్థ్యాన్ని గుర్తించిందని అన్నారు. దేశంలో 40 శాతం వెదురు వనరులు ఈశాన్య ప్రాంతంనుంచే వస్తున్నాయని గుర్తుచేశారు. ప్రపంచంలో భారతదేశం వెదురు ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో 5 శాతం మాత్రమే ఉండటం శోచనీయమన్నారు.

ప్రాధాన్యాన్ని గుర్తించే మోదీ ప్రభుత్వం వల్లనే వెదురుకు మంచి అవకాశం లభించిందని, పైగా శతాబ్ద కాలంనాటి అటవీచట్టాన్ని సవరించి మరీ  స్వదేశీ వెదురుకు తగిన ప్రాధాన్యం కల్పించిందని మంత్రి వివరించారు. దానివల్లనే వెదురు ద్వారా ఉపాధి అవకాశాలు బాగా మెరుగు పడ్దాయన్నారు.


 


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ ఈశాన్య ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యమిస్తారని అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే దేశంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దీటుగా ఈశాన్య ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారని గుర్తు చేశారు. గడిచిన ఆరేళ్లలో విజయవంతంగా ఖాళీలు పూరించటమే కాకుండా అన్ని విధాలుగా ఈశాన్యప్రాంతానికి అండగా నిలిచారన్నారు.

 యువజన వ్యవహారాలు, మైనారిటీలు, క్రీడలశాఖ సహాయమంత్రి .శ్రీ కిరెన్ రెజిజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంత వ్యవహారాల శాఖామంత్రి వెదురు రంగాన్ని అభివృద్ధి చేయటానికి ఎంతగానో కృషి చేశారని కితాబునిచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తానికీ ఈ విజయాన్ని వ్యాపింపజేయాల్సిన బాధ్యత 8  ఈశాన్య రాష్ట్రాలమీద ఉన్నదన్నారు. కేంద్రం చేయిపట్టి నడిపించి పూర్తి స్థాయి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించటానికి అండగా ఉండాలని కోరారు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, విస్తృతమైన ఉపాధి అవకాశాలతోబాటు  భారత్ లో పర్యావరణ, వైద్య, కాగితపు, నిర్మాణ రంగాలకు కూడా వెదురు రంగం అండగా నిలిచిందన్నారు. సరైన విధానాల రూపకల్పన ద్వారా భారతదేశం వెదురు రంగాన్ని ఆసియా మార్కెట్లలో ఘనమైన స్థానంలో నిలిపే అవకాశం ఉందన్నారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఇందర్ జిత్ సింగ్, స్పెషల్ సెక్రటరీ శ్రీ ఇందీవర్ పాండే, ఈసాన్య ప్రాంతాల కార్యదర్శి శ్రీ మోజెస్ కె చలాయ్, సిబిటిసి ఎండీ శ్రీ శైలెండ్ర చౌధురి, ఇతర సీనియర్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.



(Release ID: 1637814) Visitor Counter : 211