వ్యవసాయ మంత్రిత్వ శాఖ
"వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి" కింద ఆర్ధిక ఋణ సౌకర్యం కోసం ఒక ప్రభుత్వ పథకాన్ని ఆమోదించిన - కేంద్ర మంత్రి మండలి
Posted On:
08 JUL 2020 4:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఈ రోజు కొత్త పాన్ ఇండియా కేంద్ర ప్రభుత్వ పధకం - వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి అనుమతి ఇచ్చింది. ఈ పధకం, పంట అనంతర నిర్వహణ కోసం ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి మధ్యస్థ-దీర్ఘకాలిక ఆర్ధిక రుణ సదుపాయాన్ని అందిస్తుంది.
ఈ పధకం కింద, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పి.ఎ.సి.ఎస్), మార్కెటింగ్ సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్.పి.ఓ.లు), స్వయం సహాయక బృందాలు (ఎస్.హెచ్.జి), రైతులు, సంయుక్త లయబిలిటీ బృందాలు (జె.ఎల్.జి), బహుళ ప్రయోజన సహకార సంఘాలు, వ్యవసాయ వ్యవస్థాపకులు, అంకుర సంస్థలు, సమూహ మౌలిక సదుపాయాలు కల్పించేవారు, కేంద్ర / రాష్ట్ర ఏజెన్సీలు, స్థానిక సంస్థలు ఆర్ధిక సహాయం చేసిన ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య ప్రాజెక్టులకు ఒక లక్ష కోట్ల రూపాయల మేర బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఋణాలు అందజేస్తాయి.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయల మేర, ఆ తర్వాత మూడు ఆర్ధిక సంవత్సరాలలో ఏడాదికి 30,000 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేసి, నాలుగు సంవత్సరాల పాటు ఋణాలు పంపిణీ చేయబడతాయి.
ఈ ఫైనాన్సింగ్ సదుపాయం కింద ఉన్న అన్ని రుణాలకు సంవత్సరానికి 3 శాతం మేర రెండు కోట్ల రూపాయల పరిమితి వరకు వడ్డీ రాయితీ ఉంటుంది. ఈ రాయితీ గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, సూక్ష్మ, చిన్న సంస్థలకు ఋణ హామీ నిధి ట్రస్టు (సి.జి.టి.ఎమ్.ఎస్.ఈ) పధకం కింద రెండు కోట్ల రూపాయల ఋణం వరకు ఈ ఆర్ధిక ఋణ సౌకర్యం నుండి అర్హత కలిగిన రుణగ్రహీతలకు ఋణ హామీ అందుబాటులో ఉంది. ఈ పధకం కవరేజ్ కోసం రుసుమును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎఫ్.పి.ఓ.ల విషయానికి వస్తే, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ (డి.ఎ.సి.ఎఫ్.డబ్ల్యు) యొక్క ఎఫ్.పి.ఓ. అభివృద్ధి పధకం కింద సృష్టించబడిన సౌకర్యం నుండి క్రెడిట్ హామీ పొందవచ్చు.
భారత ప్రభుత్వం (జి.ఓ.ఐ) నుండి బడ్జెట్ మద్దతుగా మొత్తం అవుట్ ఫ్లో 10,736 కోట్ల రూపాయలు :
ఈ ఆర్ధిక ఋణ సౌకర్యం కింద తిరిగి చెల్లించటానికి తాత్కాలిక నిషేధం కనీసం 6 నెలలు మరియు గరిష్టంగా 2 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది.
వ్యవసాయ మరియు వ్యవసాయ ప్రాసెసింగ్-ఆధారిత కార్యకలాపాలకు సాధారణ రుణాలను అందించడం ద్వారా ఈ ప్రాజెక్టు గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.
ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎం.ఐ.ఎస్) ప్లాట్‌ఫాం ద్వారా ఈ అగ్రి ఇన్ ఫ్రా నిధి నిర్వహించబడుతుంది మరియు పర్యవేక్షించబడుతుంది. ఈ ఫండ్ కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అన్ని సంస్థలకు, ఇది వీలు కల్పిస్తుంది. బహుళ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల పారదర్శకత, వడ్డీ సబ్‌వెన్షన్ మరియు క్రెడిట్ గ్యారెంటీతో సహా పథకం వివరాలు, కనీస డాక్యుమెంటేషన్, వేగవంతమైన ఆమోదం ప్రక్రియ మరియు ఇతర పథకం ప్రయోజనాలతో అనుసంధానం వంటి ప్రయోజనాలను కూడా ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ అందిస్తుంది.
వాస్తవ సమయ పర్యవేక్షణ మరియు సమర్థవంతమైన ప్రతిస్పందన ఉండేలా జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తారు.
ఈ పథకం యొక్క వ్యవధి ఆర్ధిక సంవత్సరం 2020 నుండి ఆర్ధిక సంవత్సరం 2029 వరకు (10 సంవత్సరాలు).
*****
(Release ID: 1637383)
Visitor Counter : 271