మంత్రిమండలి

పిఎంజికేవై/ఆత్మనిర్భర భారత్ కింద 2020 జూన్ నుండి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్ 24% (12% ఉద్యోగుల వాటా, 12% యజమానుల వాటా) పొడిగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం


Posted On: 08 JUL 2020 4:29PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్,  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద 12% ఉద్యోగుల వాటా, 12% యజమానుల వాటా రెండింటినీ పొడిగించడానికి ఆమోదం తెలిపింది. మొత్తం జూన్ నుండి ఆగస్టు వరకు మరో 3 నెలలకు మొత్తం 24% ఈపిఎఫ్ ని పొడిగించడం, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) / ఆత్మనీర్భర్ భారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో భాగం.

ఇది 2020 ఏప్రిల్ 15న ఆమోదించిన 2020 మార్చి నుండి మే వరకు వేతన నెలలకు ప్రస్తుతం ఉన్న పథకానికి అదనం. మొత్తం అంచనా వ్యయం రూ .4,860 కోట్లు. దీనివల్ల 3.67 లక్షల సంస్థల్లో 72 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

ఈ ప్రతిపాదనలో ప్రధాన అంశాలు :

i. 2020 జూన్, జూలై, ఆగస్టు వేతన నెలలకు, ఈ పథకం 100 మంది వరకు ఉద్యోగులను కలిగి ఉన్న అన్ని సంస్థలకు వర్తిస్తుంది. అయితే వారిలో 90% ఉద్యోగులకు నెలసరి వేతనం రూ. 15,000 లోపు ఉండాలి. 
ii. 3.67 లక్షల సంస్థలలో పనిచేస్తున్న సుమారు 72.22 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుంది, అంతరాయాలు ఉన్నప్పటికీ వారి పేరోల్‌లో కొనసాగే అవకాశం ఉంది.
iii. ఇందుకోసం ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి రూ .4800 కోట్ల బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది.
iv. లబ్ది ఒక దానిపై ఒకటి వచ్చి చేరకుండా, 2020 జూన్ నుండి ఆగస్టు వరకు 12% యాజమాన్యాల వాటా ని ప్రధాన్ మంత్రి రోజ్ గార్ ప్రోత్సాహాన్ యోజన (పిఎంఆర్పివై) కింద మినహాయించి లబ్ధిదారుడు ప్రయోజనం పొందుతారు. .
v. దీర్ఘకాలిక లాక్డౌన్ కారణంగా, వ్యాపారాలు తిరిగి గాడిన పడే వరకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని భావించారు. అందువల్ల, ఆత్మనీర్‌భర్ భారత్‌లో భాగంగా గౌరవనీయ ఆర్ధిక మంత్రి 13.5.2020 న వ్యాపారం, కార్మికులకు ఇపిఎఫ్ మద్దతును మరో 3 నెలలు అంటే  2020 జూన్, జూలై, ఆగస్టు వేతన నెలలకు పొడిగించనున్నట్లు ప్రకటించారు.   

తక్కువ వేతనంతో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వాటాదారులకు ఆమోద యోగ్యంగా ఉన్నాయి.

 ****************

 


(Release ID: 1637337)