ఆర్థిక సంఘం
ప్రపంచ బ్యాంక్, హెచ్ఎల్‌జీ సభ్యులతో 15వ ఆర్థిక సంఘం సమావేశం
15వ ఫైనాన్స్ కమిషన్ మొదటిసారిగా ఆరోగ్య రంగం ఫైనాన్సింగ్ విషయమై మొత్తం అధ్యాయాన్ని కేటాయిస్తోందని వెల్లడి
Posted On:
07 JUL 2020 5:37PM by PIB Hyderabad
భారతదేశపు ఆరోగ్య రంగం గురించి సవివరంగా అర్థం చేసుకోవడానికి మరియు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యయానికి తగు ప్రాధాన్యత, తగిన ఆవశ్యకత కల్పించే ఉద్దేశ్యంతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, నీతీ ఆయోగ్, ఆరోగ్య రంగంపై ఏర్పాటు చేసిన కమిషన్ హై లెవల్ గ్రూప్ (హెచ్‌ఎల్‌జీ) సభ్యులతో 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) ఒక వివరణాత్మక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి 15వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ ఎన్.కె.సింగ్‌తో పాటుగా కమిషన్ సభ్యులు, సీనియర్ స్థాయి అధికారులూ పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి కంట్రీ డైరెక్టర్ డాక్టర్ జునైద్ అహ్మద్, గ్లోబల్ డైరెక్టర్ శ్రీ మహమ్మద్ అలీ పేట్‌తో పాటుగా ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్, ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందూ భూషణ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చాలా కాలంగా ప్రపంచ బ్యాంకు భారతదేశపు ఆరోగ్య రంగంతో నిమగ్నమై ఉందని డాక్టర్ జునైద్ అహ్మద్ పేర్కొనడంతో ఈ విస్తృత సమావేశం ప్రారంభమైంది. ఇటీవల దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వానికి ఒక బిలియన్ డాలర్ల రుణం అందించింది. జిల్లా ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడంలోనూ తాము నిమగ్నమై ఉన్నట్టుగా తెలిపారు. భారత్‌లో హెచ్ఐవీ పై పోరు చేసే విషయంలో ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వంతో దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘమైన భాగస్వామ్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు విషయంలో భారత దేశంలోని రాష్ట్రాలు యాంకర్లుగా నిలవబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలు ఒకదానికి మరొకటి చాలా భిన్నంగా ఉన్నందున, పరిష్కారాలను కూడా వాటికి తగ్గట్టుగా రూపొందించడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యం అనేది కేవలం ఒక సామాజిక వ్యయం మాత్రమే కాదని దేశ ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి కూడా ఇది ముఖ్యమని ఆయన అన్నారు.
ఆరోగ్య విషయంలో స్థానిక సంస్థలది కీలక పాత్ర ఈ నేపథ్యంలో ఆర్థిక కమిషన్ ఆరోగ్యాన్ని మూడు విధాలుగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు: దేశ తలసరి వ్యయాన్ని పెంచడానికి నిధులు, సామర్థ్యం పెంపొందించడానికి బ్లాక్ గ్రాంట్ మరియు కొన్ని ఆరోగ్య ఫలితాల కోసం పనితీరు ప్రోత్సాహకాల దిశగా దృష్టి సారించాలన్నారు. అదే విధంగా ఆరోగ్య విషయంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించవచ్చని అన్నారు. భారతదేశంలో ఆరోగ్యపు రంగ డిమాండ్‌లో 60 శాతం కంటే కూడా ఎక్కువగా ప్రైవేటు రంగమే తీరుస్తోందని ఆయన అన్నారు. డీబీటీతో పాటు ప్రైవేటు క్లినిక్‌లను పెంచడం వల్ల ఈ తరహా క్లినిక్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చన్నారు. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించని వ్యాధుల ప్రాముఖ్యతనూ తక్కువ చేసి చూడలేము. క్షయ వంటి అంటు వ్యాధి నియంత్రణ కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాల అమలు కోసం భారత ప్రభుత్వంతో చేపట్టే కేంద్ర ప్రాయోజిత పథకాలతో ప్రపంచ బ్యాంక్ నిమగ్నమవ్వాల్సిన ప్రాముఖ్యతను గురించి డాక్టర్ జునైద్ అహ్మద్ నొక్కి చెప్పారు.
భారత్‌లోని అయిదు రాష్ట్రాలలో సమగ్రా శిక్షా అభియాన్ అమలులో ప్రపంచ బ్యాంకు నిమగ్నమైన తీరును ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అదేవిధంగా, ఆరోగ్య రంగంలో జిల్లా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటుగా సేవలందిస్తున్న వారు, మునిసిపాలిటీలు, సామాజిక రంగ వ్యవస్థ వంటి సంస్థలను కూడా ప్రభావితంగా మలచుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి సంస్థలతో కలిసి పని చేసేటప్పుడు కార్యక్రమాల రూపకల్పన మరియు అమలులో ప్రపంచ బ్యాంక్ మేటి పాత్ర పోషిస్తుందని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఫైనాన్స్ కమిషన్ సిఫారసులతో పాటు ప్రపంచ బ్యాంకు ఉమ్మడి లక్ష్యం దిశగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
సమావేశంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ చేసిన ప్రజంటేషన్‌లో ప్రధానంగా పేర్కొన్న అంశాలు:
-
ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం పెంచడం, సంస్థాగతంగా బలోపేతం, సమన్వయం మరియు రాష్ట్రాల సాధికారతలతో సేవాలను అందించే విషయంలో సంస్కరణలకు అవకాశం ఉంది.
-
అనారోగ్యం మరియు మరణాలపై కరోనా వైరస్ యొక్క ప్రత్యక్ష ప్రభావం కంటే ప్రతికూల ఆర్థిక ప్రభావం దామాషా ప్రకారం పెద్దదిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉదాహరణకు ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం తలసరి జీడీపీ 6 శాతం తగ్గుతుందని అంచనా వేయబడింది, ఇది దేశం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద తలసరి జీడీపీ సంకోచాలలో ఒకటి. భారత ఆరోగ్య వ్యవస్థలో మేటి సంరక్షణ నాణ్యత కీలకమైన అంశంగా మారింది. దీనికి తోడు రాష్ట్రాలు మరియు సంరక్షణ ప్రదాతలలో భారీ వైవిధ్యం ఉంది.
-
మహమ్మారి(ఎన్‌సీడీసీ) విషయమై తాము సమర్థవంతంగా సిద్ధం చేయడానికి జాతీయ మరియు రాష్ట్ర సంస్థలను బలోపేతం చేయండి మరియు వైద్య పరిశోధనలో రాణించడానికి గ్లోబల్ సెంటర్‌గా ఐసీఎంఆర్‌ను అభివృద్ధి చేయాలి.
-
వ్యాధి సంసిద్ధత మరియు ప్రతిస్పందన కోసం ఇంటర్ ఏజెన్సీ సమన్వయాన్ని బలోపేతం చేయండి.
-
వ్యాధి సంసిద్ధత, విశ్లేషణలు, దర్యాప్తు, ప్రతిస్పందన మరియు జనాభా ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ, ఎన్‌డీఎంఏ వంటి సంస్థల్ని బలోపేతం చేయాలి.
-
టీబీ, హెచ్ఐబీ, వీబీడీ వంటి వ్యాధి నియంత్రణ కార్యక్రమాలలో సంస్థాగత సంస్కరణలు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.
-
వనరులు మరియు సామర్థ్యాన్ని పెంపొందించే పరంగా మునిసిపాలిటీలు వంటి స్థానిక సంస్థలు కూడా బలోపేతం చేయాలి తద్వారా అవి ఆరోగ్య సంరక్షణ పంపిణీలో మెరుగైన పాత్రను పోషిస్తాయి. ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే విషయంలో స్థానిక సంస్థల ప్రాముఖ్యతను నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ పాల్ నొక్కిచెప్పారు.
-
ఖర్చులో మెరుగైన నాణ్యతను నిర్ధారించడానికి, బడ్జెట్ అమలును మెరుగు పరిచేందుకు గాను ఫీఎఫ్ఎమ్ సంస్కరణల అవసరం ఉంది. రాష్ట్రాల నుండి జిల్లాలకు వనరుల కేటాయింపు సూత్రాలు చారిత్రక నిబంధనల కంటే జనాభా అవసరాన్ని (మరణాలు / అనారోగ్యం / ఈక్విటీ) ప్రతిబింబించాలి, ఆరోగ్య రక్షణ పథకాల విచ్ఛిన్నతను తగ్గించాలి మరియు డిమాండ్-వైపు ఫైనాన్సింగ్ పద్ధతుల దిశగా ఇది మారాలి.
-
వైద్య రంగంలో అవసరం మరియు సమానత్వంపై కొత్తగా దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకు, ఎన్‌హెచ్ఎం ఆరోగ్యంపై తలసరి ఖర్చుతో సంబంధం కలిగి ఉండాలి, అదే విధంగా, ఒక్కోక్క లబ్ధిదారునిపై వ్యయం పేద రాష్ట్రాల్లో మరింతగా పెరగాల్సి ఉంది. ఆరోగ్యం కోసం అవసరాల ఆరోగ్య ఆధారిత బదిలీ సూత్రాలను జాగ్రత్తగా రూపొందించాల్సి ఉంది. అలాగే, దేశంలో ప్రత్యేక ఆరోగ్య ఈక్వలైజేషన్ అవసరం. ఆరోగ్య రంగంలో లక్షిత ఫలితాలు సహా స్పష్టమైన జవాబుదారీతనం ఫ్రేమ్‌వర్క్‌లను సైతం అన్వేషించాల్సిన అవసరం ఉంది.
-
రాష్ట్రాలలో వనరుల కేటాయింపులపై ఎక్కువగా శ్రద్ధ అవసరం. సర్వీస్ డెలివరీ బలమైన ప్రభుత్వ / ప్రైవేట్ మిశ్రమంపై ఆధారపడాలి. సేవాలను అందించే విషయంలో సంస్కరణలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ‘ఓపెన్ సోర్స్’ విధానాన్ని సశక్తపరచవచ్చని పేర్కొంది. ఉదాహరణకు.. కేంద్ర-ప్రాయోజితపు పథకాల గుండా అమలు చేయడం వల్ల కార్యక్రమాల అమలులో వెసులుబాటు, కోర్సు-దిద్దుబాటుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించబడిన రాష్ట్రాలలో జవాబుదారీ విధానం ఏర్పరచడంతో పాటుగా జ్ఞాన బదిలీ వేదికల్ని ప్రోత్సహించడం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. వైద్య సేవలను అందించే విషయంలో ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.. పట్టణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కాంట్రాక్ట్ చేసిన ప్రైవేట్ ప్రొవైడర్ల ద్వారా నిర్వహించవచ్చు. డిజిటల్ టెక్నాలజీ, డేటా సైన్స్, పిరమిడ్ దిగువ మోడల్ మరియు బహుళ - రంగ చర్యలు మరియు సమాజ సమీకరణ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చని తెలిపింది.
-
కీలకమైన ప్రజారోగ్య విధులను బలోపేతం చేయాలి. కొత్త టీకాలు, మందులు మరియు డయాగ్నస్టిక్స్ వంటి ప్రపంచ ప్రజా వస్తువుల ఉత్పత్తిని మరింతగా మెరుగుపరచాలి. టీబీ వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స కోసం ప్రైవేటు రంగం వినియోగించుకోవడంతో పాటుగా టీబీ పనితీరు సూచిక ద్వారా రాష్ట్రాలు మరియు జిల్లాలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను అందించవచ్చు. భవిష్యత్తులో అంటు వ్యాధులను గుర్తించి వాటికి ప్రతిస్పందించడానికి.. నిఘా మరియు జిల్లా స్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి.
ఆరోగ్య రంగంలో కింది చర్యలు చేపట్టవచ్చు:
-
సామర్థ్యాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో సమీకృత ప్రజారోగ్యపు లాబొరేటరీ మౌలిక సదుపాయాలు మరియు విధులను పెంచడానికి లక్ష్యంగా పెట్టుబడులు పెట్టడం. ముందస్తు మరియు తగిన ప్రతిస్పందన (ఎపిడెమిక్ ఇంటెలిజెన్స్ సర్వీస్) కోసం విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంచడానికి వివిధ రాష్ట్రాలలో మరియు కేంద్ర స్థాయిలో సమగ్ర వ్యాధి పర్యవేక్షణలో ప్రధాన సామర్థ్యాలతో జిల్లా నిఘా బృందాలను అభివృద్ధి చేయండి మరియు అమలు చేయాలి.
-
మానవ మరియు జంతువుల ఆరోగ్య విషయాల నిఘా నిమిత్తం రియల్ టైమ్ నిఘా మరియు రిపోర్టింగ్ విధానంలో అభివృద్ధి చేయాలి మరియు అమలులోకి తీసుకురావాలి, భవిష్యత్తులో జూనోటిక్ విభాగంలో వ్యాప్తి చాలా అధికంగానే ఉండనుంది.
ఆరోగ్యం కోసం ప్రభుత్వ వ్యయంలో 65 శాతం రాష్ట్ర ప్రభుత్వాల నుండి, 35 శాతం కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ఆరోగ్య రంగానికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని తగు విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజా ఆరోగ్య రంగంలో ప్రజా మరియు ప్రైవేటు భాగస్వామ్యం ప్రోత్సహించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా ఉద్ఘాటించారు. ఆరోగ్య పరిశోధనాత్మక మౌలిక సదుపాయాలపై మెరుగైన దృష్టి పెట్టాలని కోరారు. పీఎం -జేఏవైలో ‘మిస్సింగ్ మిడిల్’ జనాభాను కవర్ చేయవలసిన అవసరాన్ని డాక్టర్ ఇందూ భూషణ్ నొక్కి చెప్పారు.
ఆదాయాలు తగ్గడం మరియు పెరుగుతున్న వ్యయంతో ఒత్తిడికి గురవుతున్నందున ప్రైవేటు ఆసుపత్రులకు సహాయం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యం ఏకకాలిక విషయంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బడ్జెట్ వ్యయాన్ని పెంచే విషయమై ఆర్థిక మంత్రి ఉద్దేశాన్ని ఛైర్మన్ ఎన్.కె. సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపరేడ్‌నెస్ ప్యాకేజీ (ఈఆర్ & హెచ్‌ఎస్‌పీ)ను కేబినెట్ ఏప్రిల్ 22న రూ.15వేల కోట్లతో ఆమోదించిన విషయం ఇక్కడ గమనార్హం.
ఈ ప్యాకేజీలో ఆరోగ్య నిపుణులకు శిక్షణ, పరీక్షా సామర్థ్యాన్ని పెంచడం, పీపీఈల సేకరణ, ఎన్-95 ముసుగులు, వెంటిలేటర్లు పరీక్షా వస్తు సామగ్రి, మందులు, ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలతో కూడిన ప్రత్యేక కోవిడ్ సౌకర్యాల అభివృద్ధి మరియు కార్యకలాపాలు వంటి అత్యవసర ప్రతిస్పందన భాగాలు ఇందులో ఉన్నాయి. రైల్వే కోచ్లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చడం, నిఘా విభాగాలను బలోపేతం చేయడం, అత్యవసర ప్రతిస్పందన కోసం జిల్లాలకు అన్‌టైడ్ ఫండ్స్ మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.
క్రమ సంఖ్య
|
విభాగం
|
కేటాయింపు మొత్తం కోట్లలో
|
1
|
అత్యవసర COVID-19 ప్రతిస్పందన
|
7500
|
2
|
నివారణ మరియు సంసిద్ధతకు మద్దతుగా జాతీయ మరియు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం
|
4150
|
3.
|
మహమ్మారిపై పరిశోధన మరియు బహుళ రంగాలను బలోపేతం చేయడం,
'నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ప్లాట్‌ఫామ్స్ ఫర్ వన్ హెల్త్'
|
1400
|
4.
|
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు రిస్క్ కమ్యూనికేషన్
|
1050
|
5.
|
అమలు, నిర్వహణ, సామర్థ్యం పెంపు, పర్యవేక్షణ మరియు మూల్యాంకనం
|
900
|
|
మొత్తం
|
15000
|
15 వ ఫైనాన్స్ కమిషన్, మొదటిసారిగా ఆరోగ్య రంగం ఫైనాన్సింగ్ విషయమై మొత్తం అధ్యాయాన్ని కేటాయిస్తోందన్న విషయాన్ని ఛైర్మన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆరోగ్య రంగానికి సంబంధించి తగిన సిఫారసుల కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ మరియు ప్రపంచ బ్యాంక్ ఆరోగ్య రంగంపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ వారి అధ్యయనం మరియు విశ్లేషణలను ఆర్థిక సంఘానికి అందిస్తాయని ఆయన అన్నారు. వారు అందించే నివేదిక ఆధారంగానే తాము సిఫారసులు చేస్తామని తెలిపారు. భారత ప్రభుత్వం ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల ద్వారా ఖర్చు చేయడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసే ముందు కమిషన్ వివరంగా అధ్యయనం చేస్తుందని తెలిపారు.
*****
(Release ID: 1637124)
Visitor Counter : 345