ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం


ప్రతి పది లక్షల్లో చికిత్సలో ఉన్నవారికంటే

గణనీయంగా పెరిగిన కోలుకున్నవారి సంఖ్య

Posted On: 07 JUL 2020 6:53PM by PIB Hyderabad

 

పరీక్షలు, గుర్తింపు, చికిత్స అనే త్రిముఖ వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్ని రాష్ట్రాలు తగిన విధంగా వ్యవహరిస్తూ కోవిడ్ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కుంటున్నాయి.

Screenshot (2).png


భారత్ లో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు  త్వరగా కేసులను గుర్తించటంమీద, పాజిటివ్ కేసులకు తగిన చికిత్స అందించటం మీద దృష్టి సారిస్తున్నాయి. దీనివలన ప్రతి పది లక్షలమందిలో కోలుకుంటున్నవారి శాతం చెప్పుకోదగినంతగా ఉంటోంది. అందువలన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నప్పటికీ. కోలుకుంటున్నవారు కూడా వేగంగానే పెరుగుతున్నారు. ఫలితంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గిపొతూ వస్తోంది. ఆరోగ్య సదుపాయాల కొరత రాకుండా ఉండటానికి ఇది దోహదపడుతోంది.

భారత్ లో ప్రస్తుతం ప్రతి పది లక్షలకూ 315.8 కేసులు పాజిటివ్ లు కాగా వాటిలో చికిత్స పొందుతున్న కేసులు బాగా తక్కువగా 186.3 దగ్గర నిలిచాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇస్తున్న మార్గదర్శాకల్ను రాష్ట్రాలు పాటించటం, పరీక్షల సంఖ్య పెంచటం తగిన ఫలితాలనిస్తోంది. ఆర్టి- పిసిఆర్ పరీక్షలు, రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు పెంచటంతో బాటుగా రాష్ట్రాలలో ఆరోగ్య సంబంధమైన మౌలిక సదుపాయాలను పెంచటం వలన కోవిడ్ కేసులు బాగా తగ్గాయి. పైగా కరోనా బాధితులను ప్రత్యేక ఆస్పత్రులతోబాటు స్థానిక వైద్య కేంద్రాలకు కూడా పంచటం వలన  త్వరగా చికిత్స అందించటం సాధ్యమైంది. సమర్థమైన చికిత్స కూడా మరణాలను బాగా తగ్గించగలిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కోవిడ్ చికిత్సకు వసతులు కల్పించటం, సకాలంలొ చికిత్స అందించటం వలన తగిన ఫలితాలు వచ్చాయి. 
పరీక్షలు జరపటంతోబాటు వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించటానికి ఇంటింటి సర్వే చేపట్టటం, ముఖ్యంగా కంటెయిన్మెంట్ జోన్లలో విస్తృతంగా గాలించటం వల్ల ఎక్కువ కేసులు సకాలంలో బైటపడ్దాయి. దానివలన సోకే అవకాశమున్న 80%  కేసులను కేవలం 72 గంటల్లోనే గుర్తించి క్వారంటైన్ కు పంపగలిగారు.  రాష్ట్రాలు కూడా మొబైల్ యాప్స్ ద్వారా అధిక రిస్క్ ఉన్న వారిని గుర్తించటానికి, ముఖ్యంగా వృద్ధులను, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారిని గుర్తించి వారిని ఓ కంట కనిపెట్టి ఉండటానికి కృషి చేశాయి. అదే సమయంలో గర్భిణులకు, పిల్లలకు అవసరమైన వైద్య సేవలు కూడా కొనసాగించటానికి కృషి చేశాయి. ఈ పనిలో ఆశా కార్యకర్తలను, ఎ ఎన్ ఎం ల సేవలను సమర్థంగా వాడుకొని స్థానికంగా వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించగలిగారు.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 


****

 



(Release ID: 1637096) Visitor Counter : 260