ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

డిజిటల్ ఇండియా - ఆత్మనిర్భర భారత్ యాప్ చాలెంజికి శ్రీకారం చుట్టిన ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నీతీ ఆయోగ్, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ పై ప్రధాని కన్న కలల సాకారానికి సృజనాత్మక యత్నం



ప్రస్తుత యాప్ లను ట్రాక్ వన్ లో ప్రోత్సాహించే యోచన

ట్రాక్ టూలో కొత్త యాప్ ల రూపకల్పనపై దృష్టి

Posted On: 04 JUL 2020 4:04PM by PIB Hyderabad

భారతీయ యాప్ ల కోసం బలమైన ఒక అనుసంధాన వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో డిజిటల్ ఇండియా-ఆత్మనిర్భర భారత్ యాప్ కు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ఎలక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నీతీ ఆయోగ్ ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ యాప్ ను రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞాన రంగంలోని భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్న సవాలును ఎదుర్కొనేందుకు సృజనాత్మక రీతిలో ఈ యాప్ కు రూపకల్పన చేశారు. డిజిటల్ ఇండియా నిర్మించాలని, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించాలని ప్రధానమంత్రి కన్న కలలను సాకారం చేసేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుంది.

రెండు ట్రాక్ ల ద్వారా కార్యకలాపాల నిర్వహణ:

ప్రస్తుత యాప్ లకు ప్రోత్సాహం, కొత్త యాప్ ల రూపకల్పన, మొదటి ట్రాక్ (ట్రాక్-వన్)లో యూప్ ల సృజనాత్మకత తీరుపై దృష్టిని కేంద్రీకకరిస్తారు. ఇప్పటికే దేశ పౌరుల వినియోగంలో ఉన్న ఉత్తమమైన యాప్ లను గుర్తించడం, తమ తమ విభాగాల్లో ప్రపంచ స్థాయి యాప్ లుగా ఎదిగేందుకు వాటికి ఉన్న సామర్థ్యాలను అంచనా వేయడం. ఈ రెండు అంశాలపై ఈ రోజు ప్రారంభించిన యాప్ దృష్టిని కేంద్రీకరిస్తుంది. వినియోగంలో ఉన్న వివిద రకాల యాప్ ల సృజనాత్మకతకు గుర్తింపుగా అవార్డులు, ప్రోత్సాహకాలను అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తారు. సాంకేతిక పరిజ్ఞాన రంగంలోని భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ కంపెనీలు వివిధ సాంకేతిక సమస్యలకు క్రియాశీలకమైన పరిష్కారాలను రూపొందించి, అభివృద్ధి చేసేలా తగిన ప్రోత్సాహం అందించే అనుసంధాన వ్యవస్థను ట్రాక్ వన్ లో రూపొందిస్తారు. దేశంలోని పౌరులకేకాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి కూడా సేవలందించేలా ఈ వ్యవస్థను రూపొందిస్తారు. భారతదేశంకోసం, ప్రపంచంకోసం భారతదేశంలో తయారీ అన్నది ఇక్కడ ప్రధాన నినాదం. ఈ మొత్తం కార్యక్రమాన్ని నెలరోజుల్లో పూర్తి చేస్తారు.

సృజనాత్మక యాప్ రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం, ఆత్మనిర్భర భారత్ యాప్ కృషిలో రెండవ ట్రాక్ (ట్రాక్-టూ)ను కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ దశలో కూడా నైపుణ్యం కలిగిన భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, స్టార్టప్ కంపెనీలను గుర్తించి, అవసరమైన సృజనాత్మక భావనలు, యాప్ ల ప్రొటోటైప్ లను అందించడం ద్వారా వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం ట్రాక్-టూ లక్ష్యం. ఈ ట్రాక్ లో మరింత సుదీర్ఘకాలం కార్యకలాపాలు సాగుతాయి. ట్రాక్-టూలో జరిగే కార్యకలాపపై విడిగా మరోసారి వివరాలను వెల్లడిస్తారు.

ఆత్మనిర్భర భారత్ యాప్ కు సంబంధించి, ట్రాక్ వన్ లో ఈ 8 కేటగిరీల్లో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

  • కార్యాలయ ఉత్పాదన, ఇంటి వద్దనుంచే విధుల నిర్వహణ (వర్క్ ఫ్రమ్ హోమ్)
  • సామాజిక నెట్వర్కింగ్ వ్యవస్థ
  • ఎలక్ట్రానిక్ లెర్నింగ్ (ఈ లెర్నింగ్)
  • వినోదం
  • ఆరోగ్యం, సంక్షేమం
  • వ్యవసాయ సాంకేతిక, ఆర్థిక సాంకేతిక కార్యకలాపాలు
  • వార్తలు
  • ఆటలు (గేమ్స్)

ఇక ఈ ఎనిమిందింటిలోని ప్రతి కేటగిరీలోను సబ్ కేటగిరీలు ఉండవచ్చు.

ఈ యాప్ ఇన్నవేటివ్ చాలెంజ్ పోటీ innovate.mygov.in/app-challenge అనే పోర్టల్లో 2020 జూలై 4నుంచి అందుబాటులో ఉంటుంది. యాప్ లకు సంబంధించి, ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు 2020 జూలై 18లోగా ఆన్ లైన్ ద్వారా తమ ఎంట్రీలను పంపించుకోవలసి ఉంటుంది. www.mygov.in అనే MyGov పోర్టల్లో లాగిన్ కావడం ద్వారా వారు పేర్లు నమోదు చేసుకోవాలి. పోర్టల్ ద్వారా అందిన ఎంట్రీలను ప్రతి ట్రాక్ లోనూ ఉన్న నిపుణల జ్యూరీ పరిశీలించి వాటి అర్హతను నిర్ణయిస్తుంది.

ప్రైవేటు రంగం, విద్యారంగ నిపుణులతో ఈ జ్యూరీ ఏర్పాటై ఉంటుంది. ఎంపికైన యాప్ లకు అవార్డులు ప్రదానం చేస్తారు. అంతేగాక, సదరు యాప్ ల వివరాలను పౌర సమాచారం కోసం లీడర్ బోర్డులలో పొందుపరుస్తారు. ప్రభుత్వం కూడా తగిన యాప్ లను చేపట్టడంతోపాటుగా, ప్రభుత్వానికి చెందిన e-Marketplace వేదికల్లో వాటికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తుంది. అవార్డులకు యాప్ లను ఎంపిక చేసే ప్రక్రియలోసదరు యాప్ లు ఎంత సౌలభ్యంగా, బలంగా, సురక్షితంగా ఉన్నాయనే అంశాలను, సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

*************

 



(Release ID: 1636573) Visitor Counter : 272