ఆర్థిక సంఘం

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో 15వ ఆర్థిక కమిషన్ స‌మావేశం

Posted On: 29 JUN 2020 6:09PM by PIB Hyderabad

 

శ్రీ ఎన్. కె. సింగ్ నేతృత్వంలోని ఆర్థిక కమిషన్ మంగ‌ళ‌వారం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) అధికారుల‌తో సవివర‌ సమావేశాన్ని  నిర్వహించింది. ఈ స‌మావేశంలో కేంద్ర ఎంహెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఎంహెచ్‌ఆర్‌డీ శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు త‌దిత‌రులు హాజరయ్యారు. పెద్ద‌ల బోధ‌న విధానంలో (పెడ‌గాగీ) కొత్త సాధనాల ప్రభావం గురించి ఇందులో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ప్ర‌స్తుతం కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో విద్య నిమిత్తం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు మ‌రియు ఇతర‌‌ సాంకేతిక పరిజ్ఞానాల‌ను ఉపయోగించడం వంటి వివిధ కొత్త త‌ర‌హా బోధనా సాధనాల ప్రభావం గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రంగంలో ఇటీవలి పరిణామాల నేప‌థ్యంలో మంత్రిత్వ శాఖ ఆర్థిక కమిషన్‌కు సవరించిన మెమోరాండం సమర్పించాల్సిన ఆవశ్యకతపై పాఠశాల విద్య, అక్షరాస్యత మరియు ఉన్నత విద్యా శాఖల‌తో వివరణాత్మక చర్చలు జరిపింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో విద్య అనే అంశంపై 2020-21 మరియు 2025-26 సంవత్సరాల్లో తన నివేదికలో త‌గిన సిఫారసులను చేసేందుకు గాను ఆర్థిక కమిషన్ ప్ర‌త్యేకంగా ఈ సమావేశానికి  పిలుపునిచ్చింది.
ఈ విషయమై కమిషన్ ఈ కింది అంశాల‌పై మరింత స్పష్టత అవ‌స‌ర‌మైంది. 


- ముసాయిదా జాతీయ విద్యా విధానంలో ప్రీ-ప్రైయిమ‌రీ విద్యా వ్య‌వ‌స్థ‌ నందు గ‌ణించ‌గ‌ల ఫలితాలు మరియు అవ‌స‌ర‌మైన జోక్యాలతో పాటుగా.. జాతీయ విద్యా విధానం అమలు యొక్క కాలపరిమితి.

- రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించడానికి కమిషన్ ఇచ్చిన 7 ప‌ర్య‌వేక్ష‌క సూచిక యొక్క అమ‌లు పర్యవేక్షణ. 

 

15వ ఆర్ధిక క‌మిష‌న్ అవార్డు కాలానికి గాను విద్యలో పనితీరు పర్యవేక్షణ కోసం నాణ్యత ఫలితాలకు‌ పారామితులు.

 

క్ర‌మ‌సంఖ్య‌

సూచిక‌

విలువ (%)

1

ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు- 3వ తరగతిలో సగటు భాషా స్కోరు

10

2

ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు-3 వ తరగతిలో సగటు గణిత స్కోరు

10

3

ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు -5 వ తరగతిలో సగటు భాషా స్కోరు

10

4

ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు- 5 వ తరగతిలో సగటు గణిత స్కోరు

10

5

ప్రభుత్వ మరియు సహాయక పాఠశాలలు- 8 వ తరగతిలో సగటు భాషా స్కోరు

10

6

ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు- 8 వ తరగతిలో సగటు గణిత స్కోరు

10

7

ఎగువ ప్రాథ‌మిక నుండి సెకండ‌రీ విద్య స్థాయికి బాలురు మరియు బాలికల పరివర్తన రేటు మధ్య వ్యత్యాసం

40

           

విద్యలో ఈ ఏడు సూచికలపై మంత్రిత్వ శాఖ తయారు చేసిన రాష్ట్రాల వారీ లక్ష్యాలు 2020-22 నుండి త‌గిన ప్రోత్సాహకాలను పొందటానికి రాష్ట్రాల కోసం మంత్రిత్వ శాఖ తయారు చేసిన సన్నాహక చర్యలు.

 

కోవిడ్ -19 యొక్క ఆర్థిక ప్రభావంపై పోరాడటానికి రూపొందించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా విద్యకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది:

 

కోవిడ్‌-19 సమయంలో టెక్నాలజీ ఆధారిత విధానాల్లో ఆన్‌లైన్ ద్వారా విద్య

ఇంటర్నెట్ అందుబాటులో లేని వారికి త‌గిన మద్దతు ఇవ్వడానికి మరియు చేరుకోవడానికి స్వయం ప్రభ డిటిహెచ్ ఛానెల్స్. పాఠశాల విద్య కోసం ఇప్ప‌టికే 3 ఛానెల్స్ కేటాయించబడ్డాయి; ఇప్పుడు దీనికి అద‌నంగా మరో 12 ఛానెళ్ల‌ను జోడించనున్నారు. స్కైప్ ద్వారా ఇంటి వ‌ద్ద నుండే నిపుణులు ఈ ఛానెల్‌లలో ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సెషన్ల ప్రసారానికి ఏర్పాట్లు చేయబడినాయి. దీనికి తోడుగా ఈ ఛానెళ్ల వ్యాప్తి విస్త‌ర‌ణ‌ను మెరుగుప‌రిచేందుకు గాను టాటా స్కై, ఎయిర్‌టెల్ వంటి ఇత‌ర ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లతో ఒప్పందం.

- దేశంలోని రాష్ట్రాల సమన్వయంతో విద్యకు సంబంధించిన  విషయాలను ప్రసారం చేయడానికి స్వయం ప్రభ ఛానెళ్లలో ప్రసార సమయాన్ని (రోజుకు 4 గంటలు) పంచుకోవడం.

- దీక్షా వేదిక‌పై మార్చి 24 నుండి ఇప్పటి వరకు 61 కోట్ల హిట్స్ సాధించింది.
- ఈ-పాఠ‌శాల‌కు కొత్త‌గా 200 పాఠ్య పుస్తకాలు జోడించబడ్డాయి.

- కోవిడ్‌ అనంతర టెక్నాల‌జీ అధారితంగా సామాన‌త్వపు విద్య‌

 

పీఎం ఈ-విద్యః డిజిటల్ / ఆన్‌లైన్ విద్యకు మల్టీ-మోడ్ యాక్సెస్ అందించేలా పీఎం ఈ-విద్య అనే ఒక ప్రోగ్రామ్ వెంటనే ప్రారంభించబడుతుంది; ఇందులో: రాష్ట్రాలు / ‌కేంద్ర పాలిత పాఠశాల విద్య కోసం దీక్షా: అన్ని గ్రేడుల వారికి ఈ-కంటెంట్, క్యూఆర్- కోడ్‌తో శ‌క్తిమంతం చేసిన పాఠ్య‌పుస్త‌కాలు (ఒక దేశం, ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం), 1 నుండి 12వ త‌ర‌గ‌తి వారి కోసం (ఒక తరగతి, ఒక ఛానెల్) ఒక ప్ర‌త్యేక టీవీ ఛానెల్‌, రేడియో మ‌రియు కమ్యూనిటీ రేడియోల యొక్క విస్తృత ఉపయోగం మ‌రియు దృష్టి మరియు వినికిడి లోపం ఉన్నవారికి పోడ్‌కాస్ట్‌లకు ప్ర‌త్యేక‌మైన ఈ-కంటెంట్. దేశంలో వంద‌ విశ్వవిద్యాలయాలు స్వయంచాలకంగా ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించడానికి అనుమతించబడతాయి.


మ‌నోద‌ర్ప‌ణ్‌- విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు కుటుంబాల వారి మానసిక ఆరోగ్యం మరియు మానసిక క్షేమం కోసం మానసిక సామాజిక మద్దతు నిమిత్తం మ‌నోద‌ర్ప‌ణ్ అనే చొరవ వెంటనే ప్రారంభించబడుతుంది. పాఠశాల, బాల్యం మరియు ఉపాధ్యాయుల కోసం కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక మరియు పెద్ద‌ల బోధనా చట్రం ప్రారంభించబడుతుంది. ఇది ప్రపంచ మరియు 21 వ శతాబ్దపు నైపుణ్య అవసరాలతో అనుసంధానించబడి ఉంటుంది. 2025 నాటికి ప్రతి బిడ్డ 5 వ తరగతి నేర్చుకునే స్థాయిలు మరియు ఫలితాలను సాధించేలా చూడటానికి నేషనల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్ డిసెంబర్, 2020 నాటికి ప్రారంభించబడుతుంది.

 

కోవిడ్‌-19 మహమ్మారి దేశంలో అనూహ్య‌మైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కలిగించిందని ఇది పాఠశాల విద్యను కూడా ప్రభావితం చేస్తోందని పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్ ఈ స‌మావేశంలో
తెలిపారు. పాఠశాల మూసివేత కాలంలో నేర్చుకోవడం కొనసాగించడానికి ఈ విభాగం ఈ క్రింది అంశాల‌ను ప్రారంభించింది:


 

  • పీఎం ఈ-విద్య‌- పాఠ‌శాల‌ విద్య‌
  • స్వ‌యం ప్ర‌భ టీవీ ఛానెళ్ల ద్వారా డిజిట‌ల్ లెర్నింగ్‌
  • నియోస్ (నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌)
  • డిజిట‌ల్ పుస్తక‌లు మ‌రియు ఈ- కంటెంట్స్ నిమిత్తం ఈ-పాఠ‌శాల‌
  • స్వ‌యం పోర్ట‌ల్‌
  • ఆప‌రేష‌న్ డిజిట‌ల్ బోర్డ్‌
  • ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క నేషనల్ రిపోజిటరీ (ఎన్ఆర్ఓఈఆర్‌)
  • డిజిటల్ విద్యను దీర్ఘకాలిక అభ్యాస వ్యూహంగా ఊహించ‌డం మరియు త‌గిన విధంగా రూపొందించడం
  • సౌకర్యాలు లేని ఉన్నత, మాధ్యమిక మరియు సీనియర్ మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలలలో ఐసీడీ సౌకర్యాల‌ను కల్పించడం.
  • మేటి పనితీరు కనబర్చడానికి రాష్ట్రాలకు ప్రోత్సహ‌కాలనివ్వ‌డం.
  • పనితీరును అంచనా వేయడానికి ఎంహెచ్ఆర్డీ ద్వారా అభివృద్ధి చేయబడిన పీజీఐ ఒక‌ సాధనంగా ఉండ‌నుంది.
  • పీజీఐ లోని ఫలిత సూచికలు అభ్యాస ఫలితాలను (6 సూచికలు) మరియు బాలికలు సెకండ‌రీ స్థాయికి ప‌రివ‌ర్త‌న స్థితి (1 సూచిక) కొలిచేందుకు గాను  ఉపయోగ‌పడుతుంది.
  • అత్యధిక గ్రేడ్‌ను సాధించిన‌ రాష్ట్రానికి ప్రోత్సాహక ఆధారిత గ్రాంట్ల‌ను అత్య‌ధిక‌
  • ప‌ర్సెంటేజీ వృద్ధిని సాధించిన మూడు రాష్ట్రాలకు ప్రోత్సాహ‌కాల అంద‌జేత‌.
  • గ్రేడింగ్ కోసం, అభ్యాస ఫలితాలను పాఠశాల స్థాయిలో మూడవ పార్టీ వారితో గ‌ణ‌న చేయిస్తారు.
  • అసెస్‌మెంట్ యొక్క విధివిధానాల‌ను రూపొందించ‌డానికి గాను నీతీ ఆయోగ్ సేవ‌ల‌ను వినియోగించుకోనున్నారు.  

పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ మొత్తం అంచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

క్ర‌మ సంఖ్య‌

వివ‌రాలు

అవ‌స‌ర‌మైన నిధులు

1

ఆర్‌టీఈ ఇన్ట‌ర్‌వెన్ష‌న్స్‌ ప్రకారం ఐదేళ్లపాటు (2021-22 నుండి 2025-26 వరకు) మొత్తం సవరించిన అంచ‌నా

4,62,827.39

2

ఎన్ఈపీ 2020 అమలు నిమిత్తం అదనపు నిధులు

1,13,684.51

3

ఆయా రంగాల‌కు నిర్దిష్ట గ్రాంట్లు (పీజీఐ ఎస్ఈటీసీ)

5,000.00

4

3.10 లక్షల ప్రభుత్వం పాఠ‌శాల‌ల్లో ఐసీటీ సౌకర్యాల‌ను కల్పించడం

55,840.00

మొత్తం

అవసరమైన నిధుల మొత్తం

6,37,351.90

 

ఉన్నత విద్య విభాగం కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే కూడా కమిషన్ ముందు ఒక  స‌వివ‌ర‌ణ ప్రజెంటేష‌న్ క‌మిష‌న్ ముందు ఉంచారు. దేశ ఉన్నత విద్యలో ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాలను అందుకొనే విష‌య‌మై భారతదేశపు మారుతున్న జనాభా ప‌రిణామాలు మరియు సంసిద్ధతల‌ను వివరించారు. ఉన్న‌త విద్య‌లో స‌వాళ్లు మ‌రియు సంస్క‌ర‌ణ‌ల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఏక‌రువు పెట్టారు. 2035 నాటికి జీఈఆర్ వృద్ధి విష‌యం కూడా ఇందులో ఉంటుంద‌ని తెలిపారు. స్వయంప్రతిపత్తి విధానంతో గ్రేడెడ్ అక్రిడిటేష‌న్ ద్వారా మేటిక‌ ఎక్సలెన్స్‌ను సాధించడం.. టెక్నాలజీ ఆధారిత విద్యలో ఆన్‌లైన్డిజిటల్బ్లెండెడ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ త‌దిత‌రాలు.. ఆన్‌లైన్ విద్య కోసం విద్యా శాఖ అనేక ర‌కాల ‌నియంత్రణ సంస్కరణలను ప్రతిపాదించింది. 2021-22 నుండి 2025-26 వరకు అవార్డు కాలానికి ఈ విభాగం ఆర్థిక కమిషన్‌కు అంచ‌నాల‌ను చేసింది. ఉన్నత విద్యా శాఖ వారి ఆర్థిక అవసరాల అంచనాలను కమిషన్ స‌వివ‌రంగా  అందించింది. డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్గ్రేడేషన్ అండ్ ఇంక్లూజన్ ప్రోగ్రాం (ఇక్విప్‌) కోసం ఐదు సంవత్సరాల కాలంలో రూ.1,32,559.9 కోట్ల మేర అంచనా వేయ‌డ‌మైంది. రానున్న ఐదేండ్ల కాలంలో ఆన్‌లైన్ కోర్సులు / కార్యక్రమాల అభివృద్ధికి గాను రూ. 2306.4 కోట్ల నిధుల‌ను అంచ‌నా వేసింది. ల్యాప్‌టాప్టాబ్లెట్లుమొబైల్స్టెలివిజన్లు వంటి పరికరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి రానున్న 5 సంవత్సరాలలో రూ.60,900 కోట్ల మేర అంచనా వేయబడింది. ఇక్విప్ విధానం (2020-21 - 2025-26) అమలున‌కు గాను ఉన్నత విద్యా శాఖ రానున్న 5 సంవత్సరాల‌కు రూ.4,00,576.25 కోట్ల నిధుల‌ను అంచ‌నా వేసింది. కమిషన్ మంత్రిత్వ శాఖ వారు లేవనెత్తిన అన్ని విషయాలపై సవివరమైన చర్చలు జరిపింది. ప్రభుత్వానికి తాము తుది సిఫారసు చేసేటప్పుడు వాటిలో వీటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 

 

****



(Release ID: 1635515) Visitor Counter : 489