మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మత్స పరిశ్రమ, ఆక్వాకల్చర్ వార్తాపత్రిక "మత్స్య సంపద" తొలి ప్రతిని విడుదల చేసిన 'మత్స్య పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ శాఖ' మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కార్యాచరణ మార్గదర్శకాలు విడుదల
మత్స్య పరిశ్రమ వాల్యూ చైన్‌తోపాటు విభిన్న కార్యక్రమాలతో కూడిన పీఎంఎంఎస్‌వై, మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని కేంద్ర మంత్రి ఆశాభావం
Posted On:
30 JUN 2020 5:20PM by PIB Hyderabad
మత్స పరిశ్రమ, ఆక్వాకల్చర్ వార్తాపత్రిక "మత్స్య సంపద" తొలి ప్రతిని 'మత్స్య పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ శాఖ' మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ విడుదల చేశారు. మత్య విభాగం దీనిని రూపొందించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కార్యాచరణ మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి, మత్స్య విభాగం కార్యదర్శి డా.రాజీవ్ రంజన్, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మత్స్య విభాగం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాల సమాచారాన్ని సంబంధింత వర్గాలకు, ముఖ్యంగా మత్స్యకారులు, చేపల రైతులకు చేర్చేందుకు “మత్స్య సంపద” వార్తాపత్రికను తీసుకొచ్చారు. మత్స్య, ఆక్వా కల్చర్‌లో నూతన ఒరవడుల గురించి వారికి తెలియజెప్పడమే ఈ పత్రిక ఉద్దేశం. 2020-21 తొలి త్రైమాసికం నుంచి ప్రతి మూడు నెలలకు దీనిని ప్రచురిస్తారు.
సరైన సమయంలో ఈ వార్తాపత్రికను తీసుకొచ్చారని; మత్స్యరంగంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో జరిగిన మంచి పనుల గురించి తెలియజెప్పడానికి ఈ పత్రిక చాలా అవసరమని మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు, చేపల రైతులు, యువత, పారిశ్రామికవేత్తలు, ఇతర సంబంధిత వర్గాలకు సమాచారాన్ని చేరవేయడానికి ఈ పత్రిక ముఖ్య మాధ్యమంలా పనిచేస్తుందని, సలభతర వ్యాపారం చేసేలా వారికి సాయపడుతుందని మంత్రి వెల్లడించారు. సమాచార వ్యాప్తిలో ఈ పత్రిక అద్భుతమైన మాధ్యమమని రుజువవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మత్స్య, ఆక్వా కల్చర్ వృద్ధిలో పీఎంఎంఎస్‌వై ప్రారంభం ముఖ్యమైన ఘటనగా మంత్రి అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ వాల్యూ చైన్‌తోపాటు విభిన్న కార్యక్రమాలతో కూడిన పీఎంఎంఎస్‌వై.., మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, తర్వాతి దశకు తీసుకెళ్తుందని గిరిరాజ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ సమయంలోనే వేగంగా పనిచేసి కార్యాచరణ మార్గదర్శకాలు రూపొందించిన అధికారులను మంత్రి అభినందించారు. పథకాన్ని వేగంగా అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మార్గదర్శకాలు సాయం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మత్స్య పరిశ్రమ సుస్థిర అభివృద్ధి కోసం, రూ.20050 కోట్లతో, మే నెలలో పీఎంఎంఎస్‌వై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 100 విభిన్న కార్యక్రమాలతో కూడిన పీఎంఎంఎస్‌వై, ఇప్పటివరకు మత్స్య రంగంలో వచ్చిన అతి పెద్ద పథకం. వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి, రూ.లక్ష కోట్ల ఎగుమతులు, 55 లక్షల ఉద్యోగాల కల్పన ఈ పథకం లక్ష్యాలు.
ఈ లక్ష్యాలను చేరుకునేందుకు, పీఎంఎంఎస్‌వై కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమర్థవంతమైన సాధనంలా, వేదికలా వార్తాపత్రిక “మత్స్య సంపద” ఉపయోగపడుతుంది. మత్స్యకారులు, చేపల రైతులు, పారిశ్రామికవేత్తలు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు, తాజా సమాచారం, విజయగాథలను తెలియజెప్పడానికి దోహదపడుతుంది.
*****
(Release ID: 1635461)
Visitor Counter : 284