ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ తో పాటు రాష్ట్ర భద్రత మరియు ప్రజా క్రమం గురించి ప్రతికూలంగా వ్యవహరించే 59 మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించింది

Posted On: 29 JUN 2020 8:47PM by PIB Hyderabad

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఎ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ప్రజలకు సమాచార అందుబాటులో లేకుండా నిరోధించే విధానం మరియు భద్రతలు) నిబంధనలు 2009 తో పాటు బెదిరింపుల ద్వారా ఉద్భవిస్తున్న స్వభావం వల్ల ఎదురౌతున్న సమస్యలపై అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా, భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణతో పాటు రాష్ట్ర భద్రత మరియు ప్రజా క్రమం పట్ల పక్షపాతంతో కూడిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న, 59 యాప్ లను (అనుబంధాన్ని చూడండి) నిషేధించాలని నిర్ణయించడం జరిగింది. 

గత కొన్ని సంవత్సరాలుగా, సాంకేతిక పురోగతి మరియు డిజిటల్ రంగంలో ప్రాధమిక మార్కెట్ విషయానికి వస్తే భారతదేశం ఒక ప్రముఖ ఆవిష్కర్తగా అవతరించింది.

అదే సమయంలో, డేటా భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు 130 కోట్ల మంది భారతీయుల గోప్యతను కాపాడటం వంటి అంశాలపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయి.  ఇలాంటి ఆందోళనలు మన దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని ఇటీవల గుర్తించడం జరిగింది.   భారతదేశం వెలుపల ఉన్న ప్రదేశాల్లో ఉన్న సర్వర్లకు వినియోగదారుల డేటాను అనధికారికంగా దొంగిలించడం మరియు రహస్యంగా ప్రసారం చేయడం కోసం ఆండ్రాయిడ్ మరియు ఐ.ఓ.ఎస్. వేదికలపై అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్ లను దుర్వినియోగం చేయడం గురించి పలు నివేదికలతో సహా వివిధ వర్గాల నుండి అనేక ఫిర్యాదులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు వచ్చాయి.  ఈ డేటాలోని సమాచారాన్ని ఉపయోగించి, భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత మరియు రక్షణకు సంబంధించిన అంశాలు ప్రభావితమయ్యే విధంగా వాటిని మైనింగ్ మరియు ప్రొఫైలింగ్ చేయడం, చాలా లోతైన విషయం మరియు తక్షణం  ఆందోళన కలిగించే విషయం. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవడం చాలా  అవసరం.

ఈ హానికరమైన యాప్ లను నిరోధించడానికి కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం కూడా ఒక సమగ్ర సిఫార్సును పంపింది.  కొన్ని యాప్ ల ను ఉపయోగించడం వల్ల డేటా యొక్క భద్రత మరియు గోప్యతకు సంబంధించిన ప్రమాదం గురించి పౌరులు తమ ఆందోళనలను ఈ మంత్రిత్వ శాఖకు తెలియజేయడం జరిగింది. కంప్యూటర్ అత్యవసర ప్రతిస్పందన బృందం (సి.ఈ.ఆర్.టి-ఇన్) కూడా డేటా భద్రత మరియు పబ్లిక్ ఆర్డర్ సమస్యలపై ప్రభావం చూపే గోప్యతా ఉల్లంఘన గురించి పౌరుల నుండి అనేక సూచనలు, సలహాలను స్వీకరించింది.  అదేవిధంగా, భారత పార్లమెంటు వెలుపల మరియు లోపల వివిధ ప్రజా ప్రతినిధులు ఇలాంటి ద్వైపాక్షిక ఆందోళనలను లేవనెత్తారు.  భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి మరియు మన పౌరుల గోప్యతకు హాని కలిగించే యాప్ లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు. 

వీటి ప్రాతిపదికన మరియు భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి, సమగ్రతకు అటువంటి యాప్ లు ముప్పు కలిగిస్తున్నాయని విశ్వసనీయమైన సమాచారాన్ని స్వీకరించిన అనంతరం, మొబైల్ మరియు మొబైల్ కాని ఇంటర్నెట్ తో అనుసంధానమైన పరికరాలలో ఉపయోగించే కొన్ని యాప్ ల వాడకాన్ని అనుమతించకూడదని  ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ యాప్ ల జాబితాను ఇక్కడ  జత చేసిన అనుబంధంలో పేర్కొనడం జరిగింది. 

ఈ చర్య మొబైల్ మరియు ఇంటర్నెట్ వినియోగించే కోట్లాది మంది భారతీయుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది.  భారత సైబర్‌స్పేస్ భద్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

 

అనుబంధం 

 

 

1.    టిక్ టాక్ (TikTok)

2.    షేర్ ఇట్ (Shareit)

3.    క్వాయ్ (Kwai)

4.    యు.సి.బ్రౌసర్ (UC Browser)

5.    బైడు మ్యాప్ (Baidu map)

6.    షెయిన్ (Shein)

7.    (క్లాష్ అఫ్ కింగ్స్ Clash of Kings)

8.    డి.యు.బాటరీ సేవర్ (DU battery saver)

9.    హలో (Helo)

10. లైకీ (Likee)

11. యూకేమ్ మేకప్ (YouCam makeup)

12. మై కమ్యూనిటీ (Mi Community)

13. సి.ఎమ్. బ్రౌజర్స్ (CM Browers)

14. వైరస్ క్లీనర్ (Virus Cleaner)

15. ఏ.పి.యు.ఎస్. బ్రౌజర్ (APUS Browser)

16. రోంవే (ROMWE)

17. క్లబ్ ఫ్యాక్టరీ (Club Factory)

18. న్యూస్ డాగ్ (Newsdog)

19. బ్యూటరీ ప్లస్ (Beutry Plus)

20. వుయ్ చాట్ (WeChat)

21. యు.సి.న్యూస్ (UC News)

22. క్యూ.క్యూ. మెయిల్ (QQ Mail)

23. వెయిబో (Weibo)

24. జెండర్ (Xender)

25. క్యూ.క్యూ.మ్యూజిక్ (QQ Music)

26. క్యూ.క్యూ.న్యూస్ ఫీడ్ (QQ Newsfeed)

27. బిగో లైవ్ (Bigo Live)

28. సెల్ఫీ సిటీ (SelfieCity)

29. మెయిల్ మాస్టర్ (Mail Master)

30. పేరలల్ స్పేస్ (Parallel Space)

 

31. మి వీడియో కాల్ - గ్జియోమి (Mi Video Call – Xiaomi)

32. వుయ్ సింక్ (WeSync)

33. ఈ.ఎస్.ఫైల్ ఎక్స్ ప్లోరర్ (ES File Explorer)

34. వివా వీడియో - క్యూ.యు.వీడియో ఇంక్ (Viva Video – QU Video Inc)

35. మెయితు (Meitu)

36. విగో వీడియో (Vigo Video)

37. న్యూ వీడియో స్టేటస్ (New Video Status)

38. డి.యు.రికార్డర్ (DU Recorder)

39. వాల్ట్-హైడ్ (Vault- Hide)

40. కాచే క్లీనర్ డి.యు.యాప్ స్టూడియో (Cache Cleaner DU App studio)

41. డి.యు.క్లీనర్ (DU Cleaner)

42. డి.యు.బ్రౌజర్ (DU Browser)

43. హగో ప్లే విత్ న్యూ ఫ్రెండ్స్ (Hago Play With New Friends)

44. కామ్ స్కానర్ (Cam Scanner)

45. క్లీన్ మాస్టర్ -చీతా మొబైల్ (Clean Master – Cheetah Mobile)

46. వండర్ కెమెరా (Wonder Camera)

47. ఫోటో వండర్ (Photo Wonder)

48. క్యూ.క్యూ.ప్లేయర్ (QQ Player)

49. వుయ్ మీట్ (We Meet)

50. స్వీట్ సెల్ఫీ (Sweet Selfie)

51. బైడు ట్రాన్స్ లేట్ (Baidu Translate)

52. విమేట్ (Vmate)

53. క్యూ.క్యూ. ఇంటర్నేషనల్ (QQ International)

54. క్యూ.క్యూ. సెక్యూరిటీ సెంటర్ (QQ Security Center)

55. క్యూ.క్యూ.లాంచర్ (QQ Launcher)

56. యు వీడియో (U Video)

57. వి.ఫ్లై. స్టేటస్ వీడియో (V fly Status Video)

58. మొబైల్ లెజెండ్స్ (Mobile Legends)

59. డి.యు. ప్రైవసీ (DU Privacy)

 

 

 

*****(Release ID: 1635425) Visitor Counter : 368