హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ మీద పోరులో యావద్దేశం ప్రధాని వెంట నడుస్తోంది: కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


ఢిల్లీలో కొన్ని ఘటనలు భయోత్పాతం కలిగించాయి, మా కృషితో పరిస్థితి మెరుగవుతుంది.

జులై ఆఖరుకల్లా 5.5 లక్షలను దాటనివ్వం

ఢిల్లీ ఇంకా సామూహిక వ్యాప్తి దశ చేరలేదు, జూన్ మొదటితో పోల్చుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంది.

జనం కంగారు పడనక్కర్లేదు

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులకు అనుగుణంగా

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చికిత్స ఖర్చులు ఢిల్లీలో మూడింట రెండొంతులకు తగ్గించింది

పరీక్షలు నాలుగు రెట్లు పెరిగాయి. పడకల అందుబాటు జూన్14న 9,500 ఉంటే నెలాఖరుకు 30,000 కు చేరుకుంటోంది.

ఢిల్లీకి 10,000 పల్స్ ఆక్సీమీటర్లు, 440వెంటిలేటర్లు, 500 ఆక్సిజెన్ సిలిండర్లు అందించాం.

మరిన్ని ఆంబులెన్స్ లు ఇవ్వాలని ఆదేశించాం

ఢిల్లీ రాజధాని ప్రాంతానికి ఉమ్మడి కరోనా పరిష్కార వ్యూహం త్వరలో అమలు చేస్తాం

Posted On: 28 JUN 2020 9:57PM by PIB Hyderabad

కోవిడ్ సంక్షోభాన్ని మోదీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటూన్నదని, ఢిల్లీ లో పరిస్థితి అదుపులో ఉందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  ఢిల్లీలో కరోనా సామూహిక వ్యాప్తి జరగటం లేదని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

 

ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, జులై ఆఖరుకల్లా కోవిడ్ కేసులు 5.5 లక్షలకు పెరుగుతాయని ప్రజలను కలవరపరచే విధంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి శ్రీ మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి ప్రస్తావించారు. నిజానికి తగిన చర్యలు తీసుకొని కోవిడ్ ను అరికట్టాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రభుత్వానిదే అయినప్పటికీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలదృష్ట్యా భారత ప్రభుత్వం సమన్వయ చర్యలు మరింత పెంచిందని చెప్పారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జూన్ 14న తాను ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి  ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం మరింత తోడుగా ఉండే ఏర్పాట్లు చేశానన్నారు. ఇప్పుడు పరీక్షల సంఖ్య పెంచటం వలన వైరస్ బారిన పడినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోందని, అయితే దీనివలన పాజిటివ్ గా గుర్తించినవారందరికీ ఐసొలేషన్ కు తరలించే అవకాశం ఏర్పడిందన్నారు. దీనివలన వ్యాధి వ్యాపించకుండా చూడగలుగుతున్నామన్నారు. 

నిర్ణయాలు

అప్పుడు

ఇప్పుడు

పరీక్షలు భారీగా పెంపు

మొత్తం పరీక్షలు: 4.15 లక్షలు

మార్చి 25 నుంచి జూన్ 14 వరకు జరిపిన పరీక్షలు 2,41,000

అంటే 82 రోజుల్లో జరిపిన మొత్తం పరీక్షలు 2.41 లక్షలు

 జూన్ 15 నుంచి 25 వరకు జరిపిన పరీక్షలు =1,75,141

అంటే జూన్ లో కేవలం 11 రోజుల్లో జరిపిన పరీక్షలు 1,75,141

·                   సగటున రోజుకు16,000 పరీక్షలు

కరోనా పరీక్ష ఖర్చు

సుమారుగా రూ..5000

·                   ఒక్కో పరీక్షకు రూ. 2400

·                   మరో 200 రాపిడ్ యాంటిజెన్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు

 

ఆరోగ్య సిబ్బందిలో ఆత్మ స్థైర్యం నింపేందుకు, ప్రజలలో నమ్మకం కలిగించేందుకు తాని ఎల్ ఎన్ జె పి ఆస్పత్రిని సందర్శించానని హోం మంత్రి చెప్పారు. ప్రతి వార్డులోనూ సిసిటివి కెమెరాల ఏర్పాటు, నిరాటంకంగా ఆహారం అందేలా రెండో కాంటీన్ ఏర్పాటు, ఆరోగ్య సిబ్బందికి మానసిక సామాజిక కౌన్సిలింగ్ , ఎప్పటికప్పుడు పదకల సమాచారం అందే ఏర్పాటు లాంటివి చేశామన్నారు.  డాక్టర్లతో సంభాషించటం వలన వారి ఇబ్బందులు తెలిశాయని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహానికి అవి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు.

జూన్ 14న 9,937 పడకలు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 30,000 కు చేరిందన్నారు. దీనివలన జూన్ ఆరంభంలో కంటే ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నామన్నారు. ఢిల్లీలోని అన్ని కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటి సర్వే జూన్ ఆఖరుకల్లా పూర్తవుతుందని చెప్పారు. దీమ్తోబాటే ఇప్పుడు సీరమ్ పరీక్షలు కూడా మొదలయ్యాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో , అక్కడి పురపాలక సంఘంతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన చర్యల ద్వారా కరోనాను ముందుగానే కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నట్టు హోం మంత్రి వివరించారు. ఢిల్లీ ఇంకా సామూహిక వ్యాప్తి దశకు చేరుకోలేదని శ్రీ అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల సంఖ్య పెంచుతున్నామని చెబుతూ కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ వెలుపలి రోగులకు చికిత్స చేయటం మీద నిషేధం ప్రకటించటాన్ని మంత్రి ప్రస్తావించారు. ఢిల్లీ దేశ రాజధాని అయినందువల్ల వివిధ రాష్ట్రాల ప్రజలు ఢిల్లీకి రావటం సహజమని అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తిప్పికొట్టి ప్రతి ఒక్కరికీ అవసరమైన చికిత్స అందించేందుకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటున్నదని హోం మంత్రి అమిత్ షా అన్నారు.

 

 

 

అప్పుడు

ఇప్పుడు

పడకల అందుబాటు

జూన్ 14న  9,937 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

·                   జూన్ 30  నాటికి 30000 పడకల అందుబాటు

·                   503 రైలు బోగీల ద్వారా  మరో 8000 పడకల అందుబాటు

·                   250 ఐసియు వెంటిలేటర్లతో డి ఆర్ డి ఓ వారి 1000 పదకల ఆస్పత్రిని ఆర్మీ, ఐఎపిఎఫ్ వైద్య సిబ్బంది నిర్వహిస్తారు (జులై 2 నుంచి అందుబాటు)

·                   ఐటిబిపి నిర్వహణలో 10000 పడకల కోవిద్ ఆస్పత్రిని రాధా స్వామి ఆశ్రమం దగ్గర ఏర్పాటవుతుంది.

 

  ఇంతకు ముందు అంత్యక్రియలు సరైన పద్ధతిలో జరిగేవి కావని, అందుకే ఢిల్లీ ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో ఈ పరిస్థితిని సమీక్షించి ఆస్పత్రిలో చనిపోయినవారికి వారికి వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా రెండు రోజుల్లోనే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఎలాంటి పెండింగ్ లేదన్నారు. ప్రైవేట్ అస్పత్రులలో అత్యధికంగా కోవిడ్ చికిత్సలు జరుగుతుండటం ఢిల్లీ ప్రజలను కలవరపరుస్తోందని శ్రీ అమిత్ షా అన్నారు. అందుకే పడకలకు, చికిత్సకు వసూలు చేస్తున్న మొత్తాన్ని గణనీయంగా తగ్గించటంతో ప్రజలకు ఊరట కలిగిందన్నారు. కోవిడ్ సంక్షోభానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్, స్కౌట్స్, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేస్తున్నట్టు చెప్పారు.

 

 

 

 

ఢిల్లీలో ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా చికిత్స ఖర్చు మూడింట రెండొంతులకు తగ్గింపు

అంశం

అప్పుడు
(మందులు, పిపిఇ కిట్స్ కాకుండా)

ఇప్పుడు
 (మందులు, పిపిఇ కిట్స్ సహా )

ఐసొలేషన్ పడక

రూ.24000-25000

రూ. 8000-10000

వెంటిలేటర్ లేని ఐసియు

రూ.34000-43000

రూ.13000-15000

వెంటిలేటర్ తో కూడిన ఐసియు

రూ.44000-54000

రూ.15000-18000

 

 కోవిడ్ సంక్షోభం మీద పోరులో భారత ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి శ్రీ అమిత్ షా అభిప్రాయపడ్దారు.  ప్రపంచ సంఖ్యలతో పోల్చుకున్నప్పుడు మన సంఖ్యలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర  మోదీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు, 130 కోట్ల మంది ప్రజల   భాగస్వామ్యంతో ఈ పోరులో విజయం సాధిస్తున్నామన్నారు. ఈ విషయంలో జాతి యావత్తూ ఒక్కటై నిలబడిందని, కరోనా యోధులకు అండగా నిలిచి ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10లక్షల మందిలో 1,250 మంది వ్యాధి బారిన పడగా భారత్ లో 357మందికి మాత్రమే సోకిందన్నారు. నేడు భారత్ లో కోలుకుంటునవారిశాతం 57కు చేరటాన్ని గుర్తు చేశారు. మార్చి చివరికి అది 7.1 శాతమేనన్నారు.

ప్రతి పది లక్షల మందిలో కోవిడ్ బాధితులు

భారత్: 357 మంది

ప్రపంచ సగటు: 1250 మంది

అమెరికా: 7,569 మంది

బ్రిటన్: 4,537 మంది

బ్రెజిల: 5,802 మంది

రష్యా: 4,254 మంది

 

ప్రతి 10 లక్షల మందిలో మరణాలు

భారత్: 11

ప్రపంచ సగటు: 63.2

అమెరికా: 383

బ్రిటన: 637

బ్రెజిల్: 259

రష్యా: 60

 

ఆ విధంగా చూసినప్పుడు అనేక అభివృద్ధి చెందినదేశాలకంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ఏ కొద్దిపాటి లక్షణం కనిపించినా  వాళ్లకు పరీక్ష జరుపుతుండగా తీవ్ర లక్షణాలున్నవారిని వెంటనే వారి కుటుంబాల ప్రయోజనం దృష్ట్యా వెంటనే ఐసొలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. దీనివలన వైరస్ వ్యాప్తిని సకాలంలో అడ్డుకోగలుగుతామని మంత్రి శ్రీ అమిత్ షా అభిప్రాయపడ్దారు.

లాక్ డౌన్ ప్రకటించినప్పటినుంచీ కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్చించుకుంటున్నాయని హోం మంత్రి చెప్పారు. దాదాపు అన్ని రాష్ట్రాలో దాదాపు 2.5 కోట్ల వలస కార్మికులకు ఆహారం అందించాయన్నారు. ఆస్పత్రులకు, క్వారంటైన్ సౌకర్యాలకు ఏర్పాట్లు జరిగాయన్నారు. దాదాపు 63 లక్షల మంది వలస కార్మికులు 4,594 రైళ్లలో వారి స్వస్థలాలకు చేరారన్నారు. ఇతర రవాణా మార్గాల ద్వారా 42 లక్షల మంది ప్రయాణించగా మొత్తంగా దాదాపు కోటీ ఇరవై లక్షలమంది వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోగలిగారన్నారు. ఇతీవలే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వలస కార్మికుల ఉపాధి కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించటాన్ని శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలు పెంచటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కరోనా సంక్షోభం మొదలైన తరువాత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంస్కరణలు ప్రకటించారన్నారు. ఈ సంస్కరణల వలన అనేక దీర్ఘ కాల ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వలన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినగా, ఆ ప్రభావం భారత్ మీద కనీస స్థాయిలోనే ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు.  మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా మెరుగైన స్థితిలోనే ఉందన్నారు

ఏ మాత్రం లక్షణాలు కనబడినా దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని ఢిల్లీ ప్రజలకు శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. ఒకవేళ పాజిటివ్ అని నిర్థారణ అయితే సంస్థాగత క్వారంటైన్ కు ఎంతమాత్రమూ భయపడనక్కర్లేదని అన్నారు. వాళ్ళ కుటుంబాల క్షేమం దృష్ట్యా ఇన్ఫెక్షన్ సోకకుండా ఆపటానికి ఇది కీలపాత్ర పోషిస్తుందన్నారు. 

*****

 


(Release ID: 1635224) Visitor Counter : 264