మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో "సాంస్కృతిక సద్భావ్ మండపం" నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన - కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ



వివిధ సామాజిక-ఆర్థిక-సాంస్కృతిక, క్రీడా, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, కోచింగ్ వంటి కార్యకలాపాలతో పాటు, కరోనా వంటి విపత్తు సమయంలో సహాయక చర్యలకు ఈ కమ్యూనిటీ సెంటర్ ఉపయోగించబడుతుంది.


"స్వావలంబన భారత్" అనేది "ఏక్ భారత్, శ్రేష్ట భారత్" యొక్క హామీ : ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

Posted On: 29 JUN 2020 3:03PM by PIB Hyderabad

 

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో మాట్లాడుతూ, "స్వావలంబన భారత్" అనేది "ఏక్ భారత్, శ్రేష్ట భారత్" యొక్క హామీ అని అన్నారు.   ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని నుమాయిష్ మైదానంలో "సాంస్కృతిక సద్భావ్ మండపం" నిర్మాణానికి శ్రీ నఖ్వీ ఈ రోజు శంఖుస్థాపన చేశారు.  ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పి.ఎం.జె.వి.కె) క్రింద కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా 92 కోట్ల రూపాయల వ్యయంతో ఈ  సాంస్కృతిక సద్భావ్ మండపం" నిర్మిస్తున్నారు.  వివిధ సామాజిక-ఆర్థిక-సాంస్కృతిక, క్రీడా, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, కోచింగ్ వంటి కార్యకలాపాలతో పాటు, కరోనా వంటి విపత్తు సమయంలో సహాయక చర్యలకు ఈ కమ్యూనిటీ సెంటర్ ఉపయోగించబడుతుంది.

Description: C:\Users\PIB\Desktop\2906-2.jpg

Description: C:\Users\PIB\Desktop\2906-5.jpg

 

ఈ సందర్భంగా శ్రీ నఖ్వీ మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పి.ఎం.జె.వి.కె) కింద దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక-విద్యా మరియు ఉపాధి ఆధారిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టులలో -  1, 512 నూతన పాఠశాల భవనాలు; 22, 514 అదనపు తరగతి గదులు; 630 వసతి గృహాలు; 152 ఆశ్రమ పాఠశాలలు; 8, 820 స్మార్ట్ తరగతి గదులు (కేంద్రీయ విద్యాలయాలలో కలుపుకుని) 32 కళాశాలలు; 94 ఐ.టి.ఐ. లు; 13 పాలిటెక్నిక్ లు; 2 నవోదయ విద్యాలయాలు; 403 బహుళ-ప్రయోజన కమ్యూనిటీ కేంద్రాలు "సద్భావ్ మండపం"; 598 మార్కెట్ షెడ్లు; 2,842 మరుగు దొడ్లు, నీటి సరఫరా సదుపాయాలు; 135 సాధారణ సేవా కేంద్రాలు; 22 మహిళా ఉద్యోగుల వసతి గృహాలు; 1,717 ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు5 ఆసుపత్రులు; 8 హునార్ హబ్ లు; 10 వివిధ క్రీడా సదుపాయాలు; 5,956 అంగన్ వాడీ కేంద్రాలు మొదలైనవి ఉన్నాయి. 

 

అదేవిధంగా, ఉత్తర ప్రదేశ్‌లో, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమ్మిళిత అభివృద్ధిపట్ల నిబద్ధతతో గత 3 సంవత్సరాలలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని, శ్రీ నఖ్వీ చెప్పారు.  ఉత్తరప్రదేశ్ లో, పి.ఎం.జె.వి.కె. కింద మొత్తం 3,000 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 1,84,980 ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది.  వీటిలో భాగంగా - 282 అదనపు తరగతి గదులు; 285 అదనపు తరగతి గదుల బ్లాకులు; 707 అంగన్ వాడీ కేంద్రాలు; 25  సాధారణ సేవా కేంద్రాలు (సి.ఎస్.సి); 31 సద్భవ్ మండపాలు (1  సాంస్కృతిక సద్భావ్ మండపం); 1,73,143 సైబర్ గ్రామాలు; 3,865 త్రాగు నీరు, మురుగు నీటి పారుదల ప్రాజెక్టులు; 27  ఆరోగ్య పరిరక్షణ ప్రాజెక్టులు (1 యునానీ ఆసుపత్రి, 4 హోమియోపతి ఆసుపత్రులు, 3 ఆయుర్వేద ఆసుపత్రులు); 20 డిగ్రీ కళాశాలలు; 15 వసతి గృహాలు (11 బాలికల వసతి గృహాలు); 39 ఐ.టి.ఐ.లు; 2 ఐ.టి.ఐ.లలో అదనపు పనులు; 4 పాలిటెక్నిక్ లు; 226 నైపుణ్య కేంద్రాలు; 340 పాఠశాల భవనాలు; 2 మహిళా ఉద్యోగుల వసతి గృహాలు; 666 మరుగు దొడ్లు మొదలైనవి నిర్మించడం జరిగింది.

 

రాంపూర్‌లో మొత్తం 350 కోట్ల రూపాయల వ్యయంతో, 13,276 ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. వీటిలో భాగంగా - 2 కంప్యూటర్ ప్రయోగశాలలు; 2 సద్భావ్ మండపాలు (1 సాంస్కృతిక సద్భావన మండపం); 6 సాధారణ సేవా కేంద్రాలు (సి.ఎస్.సి); 12,974 సైబర్ గ్రామాలు; 49 త్రాగునీరు, మురుగు నీటి పారుదల ప్రాజెక్టులు (వాటర్ ట్యాంకులతో సహా); 1 డిగ్రీ కళాశాల; 1 బాలికల వసతి గృహం; 119 పాఠశాల భవనాలు మొదలైనవి నిర్మించడం జరిగింది.

 

శ్రీ నఖ్వీ మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ, దేశ సరిహద్దుల భద్రత, జాతీయ భద్రత వంటి విషయాలతో, మోడీ ప్రభుత్వం అభివృద్ధికి కొత్త రికార్డును సృష్టించిందని చెప్పారు.  "గౌరవంతో సాధికారత" నిబద్ధతను మోడీ ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన అన్నారు.

 

కరోనా మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, శ్రీ నఖ్వీ తెలియజేశారు. గత 3 నెలల్లో 80 కోట్ల మందికి 25 కిలోల గోధుమ బియ్యం, 5 కిలోల పప్పులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి 1500 రూపాయల చొప్పున బదిలీ చేశారు. వివిధ పథకాల కోసం 44 కోట్ల మంది బ్యాంకు ఖాతాల్లోకి డి.బి.టి. ద్వారా  60,000 కోట్ల రూపాయలను బదిలీ చేయడం జరిగింది. 8 కోట్ల మంది పైగా రైతులకు 17,000 కోట్ల రూపాయల విలువైన కిసాన్ సమ్మన్ నిధిని పంపిణీ చేయడం జరిగింది. 20 లక్షల కోట్ల రూపాయలతో " ఆత్మ నిర్భర్ భారత్"  ప్యాకేజీ ప్రకటన ఒక చారిత్రాత్మక నిర్ణయం. 

 

మైనారిటీలతో సహా ప్రతి పేదవారి కళ్ళలో ఆనందం, జీవితంలో శ్రేయస్సుఉండేలా మోడీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసిందని శ్రీ నఖ్వీ అన్నారు.  మన ప్రభుత్వం పేదలకు అందజేసిన 2 కోట్ల ఇళ్లల్లో, 31 శాతం మంది లబ్ధిదారులు మైనారిటీ వర్గానికి చెందినవారు ఉన్నారు.  దశాబ్దాలుగా విద్యుత్తు సౌకర్యం నోచుకోని దేశంలోని సుమారు 6 లక్షల గ్రామాలకు మన ప్రభుత్వం విద్యుత్తును అందించింది.  ఈ గ్రామాలలో మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న దాదాపు 39 శాతం గ్రామాల్లో ఇంతవరకు విద్యుత్ సౌకర్యం లేదు. వీటికి ఇప్పుడు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది.  కిసాన్ సమ్మన్ నిధికింద 22 కోట్ల మంది రైతులకు మన ప్రభుత్వం ప్రయోజనాలను అందించింది. వీరిలో, 33 శాతం మంది మైనారిటీ వర్గాలకు చెందిన రైతులు ఉన్నారు.  ఉజ్జ్వాల యోజనపధకం కింద 8 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించగా అందులో 37 శాతం మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు.  చిన్న మరియు మధ్యతరహా వ్యాపారం మరియు ఇతర ఉపాధి ఆధారిత ఆర్థిక కార్యకలాపాల కోసం ముద్ర యోజనకింద 24 కోట్ల మందికి మన ప్రభుత్వం సులువుగా రుణాలు ఇచ్చింది.  వీరిలో 36 శాతం మంది లబ్ధిదారులు మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు.

 

దాదాపు గత 6 సంవత్సరాలలో హునార్ హాత్”, గారిబ్ నవాజ్ స్వయం ఉపాధి పథకం ”,“ సీఖో అవుర్ కమావోవంటి పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన దాదాపు 10 లక్షల మందికి పైగా ఉపాధి, ఉపాధి అవకాశాలు కల్పించామని శ్రీ నఖ్వీ చెప్పారు.  50 శాతం మంది బాలికలతో సహా మైనారిటీ వర్గాలకు చెందిన 3 కోట్ల 50 లక్షల మందికి పైగా  విద్యార్థులకు వివిధ స్కాలర్‌షిప్‌లు అందజేయడం జరిగింది.

 

ఉత్తరప్రదేశ్, రాంపూర్ లోని నుమాయిష్ మైదానంలో  సాంస్కృతిక సద్భావ్ మండపం” (బహుళ ప్రయోజన కమ్యూనిటీ సెంటర్) కోసం శంకుస్థాపన చేసిన అనంతరం శ్రీ నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ భద్రత, గౌరవం, శ్రేయస్సు కోసం అంకితమైందని అన్నారు. అన్నిటికంటే, "దేశం ముందు" అనేది మోడీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.

 

*****


(Release ID: 1635209) Visitor Counter : 305