గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
రేపు (29వ తేదీన) గణాంకాల దినోత్సవం వేడుకలు
ఇతివృత్తం: ఎస్‌డీజీ- 3 (ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించండి మరియు అన్ని వయసుల వారి శ్రేయస్సును ప్రోత్సహించడం) & ఎస్‌డీజీ- 5 (లింగ సమానత్వాన్ని సాధించండి మరియు అందరు మహిళలు మరియు బాలికలను శక్తివంతం చేయండి)
Posted On:
28 JUN 2020 12:09PM by PIB Hyderabad
రోజువారీ జీవితంలో గణాంకాల వాడకాన్ని ప్రాచుర్యం కల్పించడానికి మరియు విధానాలను రూపొందించడంలో వాటి ప్రాధాన్యతను గురించి వివరించడంతో పాటు.. గణాంకాల ఉపయోగం విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ప్రభుత్వం ప్రతియేటా గణాంకాల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం జాతీయ స్థాయిలో జరుపుకోవలసిన ప్రత్యేక రోజులలో ఒకటిగా దీనిని గుర్తించింది.
జూన్ 29వ తేదీన ప్రొఫెసర్ పి.సి. మహాలనోబిస్ జన్మదినం పురస్కరించుకొని జాతీయ స్థాయిలో గణాంకాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశంలో కీలక గణాంక వ్యవస్థను స్థాపించడంలో ప్రొఫెసర్ పి.సి. మహాలనోబిస్ చేసిన అమూల్యమైన కృషికి గుర్తింపుగా గణాంకాల దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ - 19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్రయాణ మరియు భద్రతా సూచనల మేరకు 2020 గణాంకాల దినోత్సవాన్ని వర్చువల్ విధానంలో జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక మంత్రిత్వ శాఖ, కేంద్ర గణాంకాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ రావు ఇందర్‌జిత్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ చెందిన ప్రధాన మంత్రి మరియు రాష్ట్రపతికి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ డాక్టర్ బిబేక్ డెబ్రాయ్, భారత ప్రధాన గణాంకవేత్త, కేంద్ర గణాంకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ప్రవీణ్ శ్రీవాస్తవతో పాటుగా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు మరియు ఇతర భాగస్వామ్య పక్షాల వారు హాజరవుతారు.
జాతీయ గణాంక కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ బిమల్ రాయ్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ప్రీతి సుదాన్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంఘమిత్ర బంధోయోపాధ్యాయతో పాటుగా ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, యుఎన్ ఎస్కాప్ సంస్థల నుంచి అంతర్జాతీయంగా వాటాదారులు కూడా ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు కానున్నారు. అవార్డుల ప్రదానం 2019 లో గణాంక మంత్రిత్వ శాఖ ప్రొఫెసర్ పి.సి. మహాలనోబిస్ జాతీయ అవార్డును ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంస్థలలో అధికారిక గణాంకవేత్తల అత్యుత్తమ విజయాన్ని గుర్తించి వారికి ఈ అవార్డును అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ పి.సి. మహాలనోబిస్ జాతీయ అవార్డు గ్రహీతను సత్కరించనున్నారు. అధికారిక గణాంక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేందుకు అనువర్తిత మరియు సైద్ధాంతిక గణాంకాల రంగంలో అధిక నాణ్యత పరిశోధన, అత్యుత్తమ కృషి చేసిన వారికి తగిన గుర్తింపుగా మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ సంవత్సరాలలో ప్రొఫెసర్ సి.ఆర్.రావు, ప్రొఫెసర్ పి.వి.సుఖత్మే అవార్డులను మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తూ వస్తోంది. 2020 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ పి.వి.సుఖత్మే అవార్డు విజేతను ఈ కార్యక్రమంలో ప్రకటించనున్నారు. అఖిల భారత స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నిమిత్తం గణాంకాల అంశంపైన నిర్వహించిన ‘ఆన్ ది స్పాట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, 2020’ విజేతలను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించనున్నారు.
ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో ప్రతి సంవత్సరం, గణాంక దినోత్సవాన్ని ప్రస్తుత జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం ఇతివృత్తంగా జరుపుకుంటారు. ఎంపిక చేసిన విభాగంలో మెరుగుదల తీసుకువచ్చే లక్ష్యంతో ఏడాది పొడుగునా అనేక వర్క్‌షాప్‌లు మరియు సదస్సులను నిర్వహిస్తారు. “సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ)” అనే థీమ్‌తో గణాంక దినోత్సవం 2019ని నిర్వహించారు. దీనికి కొనసాగింపుగానే ఈ ఏడాది ఇతివృత్తాన్ని ఎస్‌డీజీ- 3 (ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించండి మరియు అన్ని వయసుల వారి శ్రేయస్సును ప్రోత్సహించడం) & ఎస్‌డీజీ- 5 (లింగ సమానత్వాన్ని సాధించండి మరియు మహిళలు మరియు బాలికలందరినీ శక్తివంతం చేయండి) సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్-నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఎఫ్) ప్రోగ్రెస్ రిపోర్ట్ 2020 (వెర్షన్ 2.1) నవీకరించిన నివేదికను ఈ కార్యక్రమంలో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ నివేదికతో పాటు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ కేడర్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌ను రేపు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలు సామాజిక - ఆర్థిక ప్రణాళిక మరియు విధాన రూపకల్పనలో గణాంకాల యొక్క పాత్రను గురించి ప్రజలలో, ముఖ్యంగా యువతరంలో తగిన అవగాహన పెంచుతాయని భావిస్తున్నారు.
****
(Release ID: 1635001)
Visitor Counter : 483