శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నవరాక్షక్ పీపీఈల తయారీకి ఎన్‌ఆర్‌డీసీ లైసెన్స్ చేజిక్కించుకున్న‌ ఆగ్రా సంస్థ



Posted On: 27 JUN 2020 6:41PM by PIB Hyderabad

 

నవరాక్షక్ అనే పీపీఈ సూట్ల తయారీకి ఆగ్రా కేంద్రంగా ప‌ని చేస్తున్న దుస్తుల తయారీ సంస్థ ఇండియన్ గార్మెంట్ కంపెనీ, 'నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కో-ఆపరేషన్' (ఎన్‌ఆర్‌డీసీ‌) సంస్థ‌తో టెక్నాలజీ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి సంబంధించి రెండు సంస్థ‌ల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) చట్టం ప్రకారం రిజిస్టరు కాబ‌డిన మైక్రో ఎంటర్‌ప్రైజస్ సంస్థ‌. ఈ సంస్థ ఇప్పటికే ఆగ్రా మరియు చుట్టుపక్కల పీపీఈ కిట్లను తయారు చేసి వివిధ ఆసుపత్రుల వారికి సరఫరా చేస్తోంది.

 

ఏడాదికి ప‌ది ల‌క్ష‌ల కిట్ల తయారీ కోవిడ్ సంక్షోభం వ‌ల్ల పీపీఈల యొక్క పెరిగిన అవసరాన్ని తీర్చడానికి నవరాక్షక్ యొక్క లైసెన్స్ ఉపయోగించి ఒక మిలియన్ పీపీఈ కిట్ల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సంస్థ నిర్ధారించుకుంది. ఈ అత్యాధునిక‌మైన నవరాక్షక్ పీపీఈని ప్రధానంగా డాక్టర్ అర్నాబ్ ఘోష్ అభివృద్ధి చేశారు. వృత్తిరీత్యా డాక్ట‌ర్ అయిన ఘోష్ వైద్యుల సౌలభ్యం, రక్షణ కోసం పీపీఈని ఉపయోగించడంలో తన వ్యక్తిగత అనుభవాలను పొందుపరిచి నవరాక్షక్ పీపీఈని అభివృద్ధిప‌రిచారు.

 

ఇది అత్యున్న‌త‌మైన నాణ్యమైన శ్వాసక్రియ ఫాబ్రిక్ క‌లిగి ఉంటుంది. అయితే దీని రూపకల్పన ఆవిష్కరణ సీమ్ యొక్క ఖరీదైన ట్యాపింగ్ మరియు సీలింగ్ యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. ఇది మార్కెట్లో లభించే ఇతర పీపీఈలలో అవసరంగా ఉంటూ వ‌స్తోంది. ఇందులో వాడిన ఫాబ్రిక్, సూట్ మరియు సీమ్ సింథటిక్ రక్త వ్యాప్తి నిరోధక ప్రమాణాలను హాయిగా తీర్చేందుకు వీలుగా సౌక‌ర్యంగా ఉంటుంది.

 

వివిధ ద‌శ‌ల్లో ప‌రీక్ష‌లు ఈ పీపీఈ కిట్ ప్రోటోటైప్ అభివృద్ధి తొల‌త ముంబ‌యిలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగింది.  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఏఎస్‌) , డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో నవరాక్షక్ పీపీఈలు ప‌రీక్షించి ధ్రువీకరించబడింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు జౌళి మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఐఎస్ఓ ప్రమాణాలు, మార్గదర్శకాల ప్రకారం పీపీఈ ప్రోటోటైప్ నమూనాను పరీక్షించ‌డ‌మైన‌ది.

 

 

******


(Release ID: 1634846) Visitor Counter : 247