గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన వాణిజ్యాన్ని డిజిటలీకరించే దిశగా 'ట్రైఫెడ్‌' భారీ అడుగు


Posted On: 25 JUN 2020 6:16PM by PIB Hyderabad

 

            దాదాపు 50 లక్షల అటవీ నివాస గిరిజనుల ప్రయోజనాల కోసం, గిరిజన వాణిజ్య వృద్ధికి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 'ట్రైఫెడ్‌' పనిచేస్తోంది. గిరిజనులు తయారు చేసే చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు, చిన్నపాటి అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధర దక్కేలా కృషి చేస్తోంది. ఎన్‌ఐటీఐ లెక్కల ప్రకారం ఏడాదికి ఈ వ్యాపారం విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లు. ఈ వ్యాపారం స్థాయిని పెంచడానికి డిజిటలైజేషన్‌ నిర్ణయాన్ని ట్రైఫెడ్‌ తీసుకుంది. గ్రామాల్లో నివశించే గిరిజన ఉత్పత్తిదారులను గుర్తించి ఈ-ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ఈ ఏర్పాట్లు ఉంటాయి.

        https://trifed.tribal.gov.in/ ద్వారా డిజిటలీకరణ అమలు చేస్తారు. దీనిద్వారా గిరిజన చేతివృత్తులవారు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌ చేసుకునేందుకు అవకాశం దక్కుతుంది. వన్‌ధన్‌ యోజన వంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన గిరిజనుల వివరాల వంటి అన్ని అంశాలను డిజిటలీకరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం ద్వారా సేకరిస్తున్న చిన్నపాటి అటవీ ఉత్పత్తుల వివరాలను, వారికి దక్కుతున్న ధరను డిజిటల్‌ రూపంలోకి మార్చే ప్రయత్నాలను కూడా ట్రైఫెడ్‌ ప్రారంభించింది. ఆగస్టు చివరి నాటికి ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

        "ఈ-కామర్స్‌ వల్లే చిల్లర వాణిజ్యానికి భవిష్యత్తు ఉంటుందని అందరూ అంగీకరిస్తున్నారు. భారతదేశంలో భారీ సంఖ్యలో ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా షాపింగ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితికి తగ్గట్లుగా ట్రైఫెడ్‌ వ్యవహరించాలి. అందుకే డిజటలీకరణను తీసుకొచ్చాం" అని ట్రైఫెడ్‌ ఎండీ ప్రవీర్‌ కృష్ణ చెప్పారు.

        ట్రైఫెడ్‌ వెబ్‌సైట్‌ https://trifed.tribal.gov.in/లో గిరిజన సంక్షేమానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు, పథకాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల సాధికారత కోసం పనిచేసే వేదిక ఇది.      

        ట్రైఫెడ్‌ వ్యాపార విభాగమైన 'ట్రైబ్స్‌ ఇండియా', https://www.tribesindia.com/ను ప్రారంభించింది. ఇందులో భారీ సంఖ్యలో గిరిజన ఉత్పత్తులు ఉంటాయి. సృజనాత్మక కళాఖండాల నుంచి డోక్రా లోహ బొమ్మలు, అందమైన కుండలు, వివిధ రకాల చిత్రాలు, దుస్తులు, విలక్షణమైన ఆభరణాలు, సేంద్రియ, సహజ ఆహారాలు, పానీయాల వరకు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి.

        దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన చేతివృత్తులవారికి మార్కెట్‌ కల్పించడానికి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, పేటీఎం వంటి ఈ-కామర్స్‌ పోర్టళ్లతోనూ ట్రైఫెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) ద్వారా కూడా గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. జీఈఎం ద్వారా, నిబంధనలకు అనుసరించి, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వీటిని కొనవచ్చు.

        కనీస మద్దతు ధర, వన్‌ ధన్ యోజన కార్యక్రమాల్లో పాల్గొంటున్న గిరిజనులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ట్రైఫెడ్‌కు చెందిన వన్‌ ధన్‌ సమీకృత సమాచార వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పథకాల అమలును పర్యవేక్షించడానికి, నిరాటంకంగా అమలయ్యేలా చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. 22 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది గిరిజనులను కలుపుతూ ఈ పథకం అమలవుతోంది. దేశవ్యాప్తంగా గుర్తించిన గిరిజన క్లస్టర్లను ఆత్మనిర్భర్‌ అభియాన్‌ కింద అర్హత గల లబ్ధిదారులుగా గుర్తిస్తారు. ఆత్మనిర్భర్‌ అభియాన్ కింద గిరిజనులకు సలాహాలు ఇవ్వడానికి, అండగా నిలబడడానికి ట్రైఫెడ్‌ అన్ని హంగులు సమకూర్చుకుంది.

        ఆటోమేషన్‌లో భాగంగా ఈ క్రింది వ్యవస్థలకు మారడం ద్వారా, గతేడాది ట్రైఫెడ్‌ గణనీయమైన ప్రగతిని సాధించింది. కేంద్ర న్యాయ శాఖ ద్వారా "లీగల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ సిస్టమ్‌" (ఎల్‌ఐఎంబీఎస్) సెంట్రలైజ్డ్‌ ఫైన్సాన్స్‌ సిస్టం (టాలీ) కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ద్వారా "హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌"

******



(Release ID: 1634374) Visitor Counter : 258