హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను "మైలు రాళ్లు" గా అభివర్ణించిన - కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా


"ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు - స్వయం ప్రతిపత్తి, పేదల సంక్షేమంతో పాటు సవాలు సమయాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం పట్ల మోడీ ప్రభుత్వం నిబద్ధతకు మరో నిదర్శనం" : శ్రీ అమిత్ షా.


"15,000 కోట్ల విలువైన పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, ఆత్మ నిర్భర్ భారత్ వైపు మరో ముందడుగు; పాడి పరిశ్రమ రంగానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరియు ఉపాధి పెరుగుదలకు దారితీస్తుంది” : కేంద్రం హోంమంత్రి.


"ఇన్-స్పేస్ అనేది చారిత్రాత్మక సంస్కరణ, ఇది భారతదేశం యొక్క నిజమైన అంతరిక్ష సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది" : శ్రీ అమిత్ షా.


"ముద్ర యోజన కింద షిషు రుణగ్రహీతలకు 2 శాతం వడ్డీ రాయితీ చిన్న వ్యాపారాలకు భారీ ఉపశమనం కలిగిస్తుంది" : కేంద్ర హోం మంత్రి.

Posted On: 24 JUN 2020 8:33PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను "మైలురాయి" అని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ప్రశంసించారు. ప్రధానమంత్రి  శ్రీ నరేంద్రమోదీని అభినందిస్తూ, "ఈ నిర్ణయాలు స్వయం ప్రతిపత్తి, పేదల సంక్షేమం మరియు ఈ సవాలు సమయాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం పట్ల మోడీ ప్రభుత్వం నిబద్ధతకు మరో నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు.

15,000 కోట్ల రూపాయల విలువైన పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి ఆమోదం తెలపడం పట్ల, శ్రీ అమిత్ షా మెచ్చుకుంటూ, "ఆత్మ నిర్భర్ భారత్ పట్ల మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇది మరింత బలోపేతం చేస్తుంది" అని అన్నారు.  "పాడి పరిశ్రమ రంగానికి అందిస్తున్న ఈ అపారమైన ప్రోత్సాహం తప్పనిసరిగా ఉపాధిని పెంచుతుంది మరియు పాల ఉత్పాదకత మరియు ఎగుమతులను పెంచుతుంది" అని ఆయన చెప్పారు.

అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ శ్రీ అమిత్ షా మాట్లాడుతూ ఈ చారిత్రక సంస్కరణ భారతదేశం యొక్క నిజమైన అంతరిక్ష సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.  అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్గనిర్దేశం చేయడం ద్వారా అంతరిక్ష రంగ వృద్ధిని ఇన్-స్పేస్ వేగవంతం చేస్తుంది. అని అన్నారు.

"కోవిడ్ చేత ప్రతికూలంగా ప్రభావితమైన చిన్న వ్యాపారాలకు భారీ ఉపశమనం ఇవ్వడానికి మరో పెద్ద నిర్ణయం తీసుకోబడింది".అని కేంద్ర హోంమంత్రి చెప్పారు. "ముద్ర యోజన కింద షిషు రుణగ్రహీతల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి, అర్హత గల రుణగ్రహీతలకు 12 నెలల కాలానికి 2 శాతం వడ్డీ రాయితీ కల్పించడానికి మోడీ మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది" అని ఆయన చెప్పారు.

మోడీ మంత్రి మండలి బ్యాంకింగ్ రంగంలో ఆమోదించిన ఆర్డినెన్స్ గురించి శ్రీ అమిత్ షా వ్యాఖ్యానిస్తూ, "ఇది 1,482 పట్టణ సహకార మరియు 58 బహుళ-రాష్ట్ర సహకార బ్యాంకులను, భారతీయ రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలోకి తీసుకువస్తుంది" అని అన్నారు.  "ఇది బ్యాంక్ డిపాజిటర్లకు ఒక హామీని ఇస్తుంది మరియు వారు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం ద్వారా అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై వారి నమ్మకాన్ని పెంచుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 


 

Amit Shah@AmitShah

I thank and congratulate PM Shri @narendramodi ji, as cabinet today approved several landmark decisions. These decisions are yet another manifestation of Modi government's commitment towards self-reliance, welfare of poor and strengthening the economy in these challenging times.

36.3K

6:40 PM - Jun 24, 2020

Twitter Ads info and privacy

5,301 people are talking about this

Amit Shah@AmitShah

To further strengthen Modi Govt's efforts towards Atmanirbhar Bharat, cabinet has approved Animal Husbandry Infrastructure Development Fund worth ₹ 15000 crore. This enormous boost to the dairy sector will surely surge employment, increase milk productivity and exports.

12.8K

6:42 PM - Jun 24, 2020

Twitter Ads info and privacy

2,197 people are talking about this

Amit Shah@AmitShah

Private sector participation in Space activities has also been approved by the Modi Government, this historic reform will unlock India's true space potential. IN-SPACe will accelerate growth of the space sector by promoting and guiding private industries in space activities.

10.9K

6:43 PM - Jun 24, 2020

Twitter Ads info and privacy

2,036 people are talking about this

Amit Shah@AmitShah

To alleviate financial stress of Shishu loan borrowers under Mudra Yojana, Modi Cabinet has approved 2% interest subsidy for a period of 12 months for eligible borrowers. This will provide a huge relief to small businesses which have been adversely affected by Covid.

7,492

6:44 PM - Jun 24, 2020

Twitter Ads info and privacy

1,457 people are talking about this

Amit Shah@AmitShah

Modi cabinet has also approved an Ordinance to bring 1482 urban cooperative & 58 multi-state cooperative banks under the supervision of RBI. This will give an assurance to the bank depositors & boost their trust in the formal banking system by protecting their hard-earned money.

20K

6:45 PM - Jun 24, 2020

Twitter Ads info and privacy

3,756 people are talking about this

*****



(Release ID: 1634371) Visitor Counter : 192