ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రత్యక్ష పన్ను మరియు బినామి చట్టాల ప్రకారం వివిధ సమయ పరిమితుల పొడిగింపు

Posted On: 24 JUN 2020 8:48PM by PIB Hyderabad

నావెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి కారణంగా వివిధ రంగాలలోని చట్టబద్ధమైన మరియు నియంత్రణ సమ్మతి అవసరాలను తీర్చడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకుని, వివిధ గడువు తేదీలను పొడిగిస్తూ, 2020 మార్చి, 31వ తేదీన, ప్రభుత్వం పన్ను మరియు ఇతర చట్టాల (కొన్ని నిబంధనల సడలింపు) ఆర్డినెన్స్, 2020 (ఆర్డినెన్సు) ను తీసుకువచ్చింది.   వివిధ సమ్మతి కోసం పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వం 2020 జూన్ 24వ తేదీన ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ముఖ్యమైన లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి:

I.          2018-19 ఆర్థిక సంవత్సరానికి (ఏ.వై. 2019-20) అసలు మరియు సవరించిన ఆదాయ-పన్ను రిటర్నులను దాఖలు చేసే గడువును 2020 జూలై 31వ తేదీ వరకు పొడిగించబడింది.

II.           2019-20 ఆర్థిక సంవత్సరానికి (ఏ.వై. 2020-21) ఆదాయపు పన్ను రిటర్న్ గడువు తేదీని 2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.  అందువల్ల, 2020 జూలై 31వ తేదీ లోపు మరియు 2020 అక్టోబర్ 31వ తేదీ లోపు దాఖలు చేయాల్సిన ఆదాయ రిటర్నులను 2020 నవంబర్ 30వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు.  తదనుగుణంగా,  టాక్స్ ఆడిట్ నివేదికను సమర్పించే గడువును 2020 అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించారు.

III.          చిన్న మరియు మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి, స్వీయ-అంచనా పన్ను బాధ్యత 1 లక్ష రూపాయల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారుడి విషయంలో  స్వీయ-అంచనా పన్ను చెల్లించవలసిన గడువును 2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.  అయితే, స్వీయ-అంచనా పన్ను బాధ్యత 1 లక్ష రూపాయలు దాటిన పన్ను చెల్లింపుదారులకు స్వీయ-అంచనా పన్ను చెల్లించడానికి గడువు తేదీ పొడిగింపు ఉండదని స్పష్టం చేయబడింది.  ఈ కేసులో, ఆదాయ-పన్ను చట్టం, 1961 (ఐ.టి. చట్టం) లో పేర్కొన్న గడువు తేదీ నాటికి స్వీయ-అంచనా పన్ను మొత్తం చెల్లించవలసి ఉంటుంది.  ఆలస్యంగా చెల్లించినట్లైతే ఐ.టి. చట్టంలోని సెక్షన్ 234(ఎ) కింద వడ్డీ చెల్లించవలసి వస్తుంది.

IV.          సెక్షన్ 80 సి (ఎల్.ఐ.సి., పి.పి.ఎఫ్., ఎన్.ఎస్.సి. మొదలైనవి), 80 డి (మెడిక్లైమ్), 80 జి (విరాళాలు) మొదలైన ఐ.టి.  చట్టం యొక్క చాప్టర్-VIఎ-బి కింద మినహాయింపులు క్లెయిమ్ చేయడానికి వివిధ పెట్టుబడులు / చెల్లింపులు చేసే గడువును కూడా 2020 జూలై 31వ తేదీ వరకు పొడిగించబడింది.  అందువల్ల 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ సెక్షన్ల కింద తగ్గింపును క్లెయిమ్ చేయడానికి 2020 జూలై 31వ తేదీ వరకు పెట్టుబడి / చెల్లింపులు చేయవచ్చు.

V.           ఐ.టి. చట్టంలోని 54 నుండి 54జిబి సెక్షన్ల కింద మూలధన లాభాలకు సంబంధించి రోల్ ఓవర్ బెనిఫిట్ / మినహాయింపు కోసం పెట్టుబడి / నిర్మాణం / కొనుగోలు చేసే గడువును 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. అందువల్ల, 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు చేసిన పెట్టుబడి / నిర్మాణం / కొనుగోలు మూలధన లాభాల నుండి తగ్గింపును పొందటానికి అర్హులు.

VI.          ఐ.టి. చట్టం లోని సెక్షన్ 10ఏ.ఏ. కింద తగ్గింపును క్లెయిమ్ చేయడానికి 2020 మార్చి 31వ తేదీ నాటికి అవసరమైన అనుమతి పొందిన సెజ్ యూనిట్లకు ఆపరేషన్ ప్రారంభించే తేదీని 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. 

VII.          పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ రాబడిని 2019-20 ఆర్థిక సంవత్సరానికి సిద్ధం చేయడానికి, టిడిఎస్ / టిసిఎస్ స్టేట్‌మెంట్లు సమకూర్చుకోవాడం మరియు టిడిఎస్ / టిసిఎస్ జారీ చేయడం తప్పనిసరి.  2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టిడిఎస్ / టిసిఎస్ స్టేట్‌మెంట్లు సమకూర్చుకోవడానికీ మరియు టిడిఎస్ / టిసిఎస్ సర్టిఫికెట్లు జారీ చేయడానికీ గడువు తేదీలను వరుసగా 2020 జూలై 31వ తేదీ వరకు  మరియు 2020 ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించబడ్డాయి.  

VIII.          2020 డిసెంబర్ 31వ తేదీ లోగా ఆమోదించాల్సిన / జారీ చేయవలసిన / తయారు చేయవలసిన వివిధ ప్రత్యక్ష పన్నులు & బినామి చట్టం క్రింద అధికారులు మరియు వివిధ సమ్మతితో ఉత్తర్వులు జారీ చేసే తేదీ లేదా నోటీసు జారీ చేసే గడువును 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.  తదనుగుణంగా, ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించే గడువును కూడా 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.  

IX.          ఆర్డినెన్స్‌లో పేర్కొన్న పన్నులు, సుంకాలు మొదలైన ఆలస్య చెల్లింపులకు 9 శాతంగా తగ్గిన వడ్డీ రేటు 2020 జూన్ 30వ తేదీ తర్వాత చేసిన చెల్లింపులకు వర్తించదు. 

"వివాద్ సే విశ్వాస్" పథకం కింద 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు అదనపు మొత్తం లేకుండా చెల్లింపు కోసం తేదీని పొడిగించినట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించారు, అవసరమైన శాసన సవరణలు నిర్ణీత సమయంలో చేపట్టడం జరుగుతుంది. 2020 డిసెంబర్ 30వ తేదీ లోపు ఈ పథకం కింద పూర్తి చేయాల్సిన చర్యలను పూర్తి చేయడానికి లేదా సమ్మతింపజేయడానికి గడువును 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ నోటిఫికేషన్ పొడిగించింది.  అందువల్ల, ఈ పధకం కింద డిక్లరేషన్, ఆర్డర్ పాసింగ్ మొదలైన వాటిని 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. 

ఐటి చట్టం యొక్క సెక్షన్ 10 (23 సి), 12 ఎఎ, 35 మరియు 80 జి కింద ఆమోదం / రిజిస్ట్రేషన్ / నోటిఫికేషన్ కోసం కొత్త విధానం అమలును 2020 జూన్ 1వ తేదీ నుండి 2020 వరకు 1వ తేదీ వరకు వాయిదా వేసినట్లు 2020 మే  8వ తేదీ నాటి పత్రికా ప్రకటన ద్వారా ఇప్పటికే ప్రకటించడం జరిగింది.   పాత విధానం అంటే  సవరించదానికి ముందు ఉన్న విధానం 2020 జూన్ 1వ తేదీ నుండి 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేయబడింది.  ఈ విషయంలో అవసరమైన శాసన సవరణలను నిర్ణీత సమయంలో చేపట్టడం జరుగుతుంది. 

2020 మే 14వ తేదీ నుండి 2021 మార్చి 31వ తేదీ వరకు కాలానికి నివాసితులకు నిర్ధిష్ట జీతాలు కానీ చెల్లింపులకు  టిసిఎస్ రేట్లను 25 శాతం తగ్గించినట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించారు.  ఈ ప్రకటన తరువాత 2020 మే 13వ తేదీన పత్రికా ప్రకటన కూడా వచ్చింది.  ఈ విషయంలో అవసరమైన శాసన సవరణలను  నిర్ణీత సమయంలో చేపట్టడం జరుగుతుంది.

 

*******



(Release ID: 1634185) Visitor Counter : 388