ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద శిశు రుణాలను 12 నెలల కాలానికి తిరిగి చెల్లించటానికి 2% వడ్డీ ఉపసంహరణకు ఆమోదం
క్రమం తప్పకుండా తిరిగి చెల్లించే రుణాలకు ప్రోత్సాహకం
కోవిడ్-19 వల్ల కలిగే అంతరాయాన్ని పరిష్కరించడానికి చిన్న వ్యాపారాలకు ఈ పథకం సహాయపడుతుంది
Posted On:
24 JUN 2020 3:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద ఉన్న అన్ని శిశు రుణ ఖాతాల అర్హతగల రుణగ్రహీతలకు 12 నెలల కాలానికి 2% వడ్డీని తగ్గించే పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం కింది ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న రుణాలకు విస్తరించబడుతుంది - 2020 మార్చి 31 నాటికి ఉన్న బాకీ కి, నిరర్ధక ఆస్తుల(ఎన్‌పిఎ) విభాగంలో లేని వాటికి ; భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) మార్గదర్శకాల ప్రకారం, మార్చి 31, 2020 న, పథకం ఆపరేషన్ కాలంలో ఇది వర్తిస్తుంది.
తగ్గించిన వడ్డీ సహాయాన్ని ఎన్‌పిఎ మారిన తర్వాత ఖాతాలు ఎన్‌పిఎ కేటగిరీలో లేని నెలలకు చెల్లించబడుతుంది. ఈ పథకం రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించే వ్యక్తులకు ప్రోత్సాహకంగా ఇస్తారు. ఈ పథకం అంచనా వ్యయం సుమారు రూ. 1,542 కోట్లు, వీటిని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఈ పథకం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన ఎంఎస్‌ఎంఇలకు సంబంధించిన చర్యలలో అమలవుతున్నవాటిలో ఒకటి. పిఎంఎంవై కింద, ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాలకు రూ. 50,000 వరకు ఇచ్చే రుణాలను శిశు రుణాలుగా పిలుస్తారు. పిఎంఎంవై రుణాలు సభ్య రుణ సంస్థల ద్వారా మంజూరవుతాయి. ముద్రా లిమిటెడ్‌లో నమోదు చేసుకున్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఈ రుణాలు సమకూరుస్తాయి.
కోవిడ్-19 సంక్షోభం, దాని పర్యవసానంగా లాక్ డౌన్ వల్ల శిషు ముద్ర రుణాల పొందిన సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలిగింది. చిన్న వ్యాపారాలు సాధారణంగా చిన్నపాటి ఆపరేటింగ్ మార్జిన్‌లలో పనిచేస్తాయి, ప్రస్తుత లాక్‌డౌన్ వారి నగదు ప్రవాహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇది వారి రుణాలకు సేవలను అందించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్‌కు దారితీస్తుంది. భవిష్యత్తులో సంస్థాగత క్రెడిట్ ప్రాప్యతపై ఇది ప్రభావం చూపుతుంది. 31 మార్చి 2020 నాటికి, పిఎంఎంవై శిశు కేటగిరీ కింద సుమారు 9.37 కోట్ల రుణ ఖాతాలకు చెందిన రుణ మొత్తం 1.62 లక్షల కోట్ల రూపాయలు బకాయి ఉంది.
ఈ పథకం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) ద్వారా అమలు అవుతోంది. 12 నెలలు అమలులో ఉంటుంది. సంబంధిత రుణదాతలు తాత్కాలిక నిషేధాన్ని అనుమతించిన రుణగ్రహీతలకు, ఆర్‌బిఐ అనుమతి ప్రకారం 'కోవిడ్ 19 రెగ్యులేటరీ ప్యాకేజీ' మారటోరియం 12 నెలల వ్యవధి వరకు పూర్తి చేస్తుంది.
ఈ పథకం అసాధారణమైన పరిస్థితికి ఒక నిర్దిష్ట ప్రతిస్పందనగా రూపొందించారు. రుణగ్రహీతలకు వారి రుణ భారాన్ని తగ్గించడం ద్వారా ‘పిరమిడ్ దిగువన’ రుణగ్రహీతలకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ఈ రంగానికి ఎంతో అవసరమైన ఉపశమనాన్ని ఇస్తుందని, తద్వారా నిధుల కొరత కారణంగా ఉద్యోగులను తొలగించకుండా చిన్న వ్యాపారాలు పనిచేయడం కొనసాగించవచ్చని భావిస్తున్నారు.
*****************
(Release ID: 1634037)
Read this release in:
Odia
,
Gujarati
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam