జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్‌జీవన్ మిషన్ ను మిజొరంలో వేగంగా అమలు చేయాల్సిందిగా మిజోరం ముఖ్యమంత్రికి లేఖ రాసిన కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
Posted On:
23 JUN 2020 3:31PM by PIB Hyderabad
మిజోరంలో జల్ జీవన్ మిషన్ అమలులో పురోగతి మందకొడిగా ఉండడంపట్ల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి 20204 నాటికి కుళాయి ద్వారా తాగునీటిని సరఫరాచేసేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఈ పథకం గ్రామీణ మహిళలు ప్రత్యేకించి బాలికలకు భద్రత, గౌరవాన్ని కల్పిస్తుంది.
జల్ జీవన్ మిషన్ (జెజెఎం) లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా సాధించేందుకు తగిన ప్రణాళిక అవసరమని కేంద్ర మంత్రి అన్నారు. రెట్రోఫిట్టింగ్, మిగిలిన ఇళ్ళకు ట్యాప్‌కనక్షన్ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత నీటి సరపరా వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పనులను సత్వరం క్యాంపెయిన్ మోడ్ లో చేపట్టాలని, ప్రస్తుతం పైప్ ల ద్వారా నీటి సరఫరా పథకాలు అమలు జరుగుతున్న రాష్ట్రంలోని 655 గ్రామాలలో ఈ పనులు చేపట్టడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆకాంక్షిత జిల్లాలలో, ఎస్.సి. ఎస్.టి లు ఎక్కవగా ఉన్న గ్రామాలు, ఆవాసాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద గల గ్రామాలన్నింటిలో దీనిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత నివ్వాలని మంత్రి సూచించారు.
భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులను అందజేస్తుంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఇళ్లకు అమర్చిన ట్యాప్‌లు,నిధుల వినియోగం తీరును దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు కేంద్ర మంత్రి శ్రీషెకావత్ తెలిపారు. 2019-20 సంవత్సరంలో 23,525 ట్యాప్‌కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకోగా 15,878 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. మిజోరం రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలొ 39.87 కోట్లరూపాయలు కేటాయించారని, పెర్ఫార్మెన్స్ గ్రాంటును కూడా కలుపుకుని మొత్తం 68.05 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఇందులో మిజొరం ఇప్పటివరకు కేవలం 37.41 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చుపెట్టిందని, ఇంకా 30.78 కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా ఉన్నాయని అన్నారు. 2020-21 లొ మిజోరం రాష్ట్రానికి కేటాయింపులు రూ79.30 కోట్ల కు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాటికి ప్రారంభ నిల్వ 30.78 కోట్ల రూపాయలతో కలుపుకుంటే మిజోరం వద్ద ప్రస్తుతం 100.08 కోట్ల రూపాయల కేంద్ర నిధి అందుబాటులో ఉంది. దీనికితోడు జెఎంఎం అమలుకు రాష్ట్ర మ్యాచింగ్ వాటా రూ 122.30 కోట్ల రూపాయలు ఉంటుంది. గ్రామాలలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం జాతీయ ప్రాధాన్యతా అంశమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని నిర్ణీత వ్యవధిలో సాధించేందుకు రాష్ట్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
దీర్ఘకాలిక నీటి సరఫరా వ్యవస్థల నిరంతర అందుబాటుకు జలవనరుల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ మంత్రి ,ప్రస్తుత తాగునీటి వనరులను దీర్ఘ కాలిక నీటి సరఫరా అవసరాల దృష్ట్యా బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. గ్రామస్థాయిలో ఇందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామ కార్యాచరణ ప్రణాళిక (విఎపి)ని రూపొందించాలని ఇందుకు వివిధ పథకాల కింద నిధులను సమ్మిళతం చేసుకుంటూ అంటే ఎంజిఎన్ఆర్ ఇజిఎస్,ఎస్‌బిఎం, పంచాయతిరాజ్ సంస్థలకు 15 వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు , స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు, సిఎంఎంపిఎ నిదులు, జిల్లా మినరల్ డవలప్మెంట్ ఫండ్ నిధులు, తదితరాలను వాడుకోవచ్చని అన్నారు. అలాగే ఈ పథకం అమలులో స్థానిక ప్రజలు.గ్రామపంచాయితీలు, కుళాయి నీటిని వాడుకునే వినియొగ దారుల బృందాలను ఈ పథకం ప్రణాళిక,అమలు, నిర్వహణ, యాజమాన్యంలో భాగస్వాములను చేయాలి. దీర్ఘకాలికంగా గ్రామాలలో తాగునీటి భద్రతను సాధించేందుకు ఇది ఎంతైనా అవసరమని మంత్రి తెలిపారు. గ్రామాలలో ఐసిసి ప్రచారం తోపాటు కమ్యూనిటీ మోబిలైజేషన్‌ను కూడా చేపట్టి జల్ జీవన్ మిషన్ నిజంగా ఒక ప్రజా ఉద్యమంగా చేయాలని ఆయన సూచించారు.
2020-21 లో మీజోరం పంచాయతీరాజ్ సంస్థలకు 15 వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద 93 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో 50 శాతం నిధులను తప్పనిసరిగా నీటిసరఫరా, పారిశుధ్యానికి వినియోగించాలి. స్వచ్ఛ భారత్ మిషన్ 9జి0 కింద అందుబాటులో ఉంచిన నిధులను గ్రే వాటర్ ట్రీట్‌మెంట్, పునర్ వినియోగ పనులకు వినియోగించాలి.
కోవిడ్ -19 మహమ్మారి నేపత్యంలో, ప్రజలు నీటి కొసం పబ్లిక్ కుళాయిల వద్ద లేదా బహిరంగ జల వనరుల వద్ద గుమికూడే పరిస్థితి ఉండరాదన్ని ముఖ్యమైన విషయం. మిజోరంలోని అన్ని గ్రామాలలో మంచినీటి సరఫరా పనులను చేపట్టి, ఇంటింటికీ ట్యాప్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని మిజోరం ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది సామాజిక దూరం పాటించడానికి, గ్రామీణ ప్రజలు అదనపు ఉపాధి అవకాశాలు పొందడానికి, గ్రామీణ ఆర్థిక వ్యస్థ వృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మిజోరం రాష్ట్రాన్ని నూరు శాతం ఇంటింటికీ మంచినీటి ట్యాప్‌లు గల రాష్ట్రంగా 2022 డిసెంబర్ నాటికి తీర్చిదిద్దేందుకు తన పూర్తి మద్దతు నివ్వనున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి మిజోరం ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. జె.ఎం.ఎం. ప్రణాళిక, అమలుకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు మిజోరం ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ,త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
*****
(Release ID: 1633868)
Visitor Counter : 122