సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పోఖ్రాన్ కుమ్మరి పరిశ్రమకు మళ్లీ ప్రాచీనవైభవం ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ కృషి
Posted On:
21 JUN 2020 6:06PM by PIB Hyderabad
ప్రాభవం కోల్పోయిన పోఖ్రాన్ కుమ్మరి పరిశ్రమ పూర్వవైభవాన్ని పునరుద్థరించేందుకుఖాదీ, గ్రామీణ పరిశ్రమలకమిషన్ (కె.వి.ఐ.సి.) నడుంబిగించింది. మొట్టమొదటిసారిగా భారత్ అణుపాటవ పరీక్షలు నిర్వహించిన ఫోఖ్రాన్ అనే చిన్నపట్టణం ఒకప్పడు కుమ్మరి పరిశ్రమకు ఎంతో ఖ్యాతిగడించింది.
టెర్రకోట ఉత్పత్తుల తయారీలో కూడా ఈ పట్టణానికి సుసంపన్నమైన వారసత్వం ఉంది. రాజస్థాన్రాష్ట్రం, జైసల్మేర్ జిల్లాలో ఉన్నపోఖ్రాన్ పట్టణంలో కుమ్మరి పరిశ్రమను తిరిగి పునరుద్ధరిస్తూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ 80 విద్యుత్ కుమ్మరిసారెలను 80కుటుంబాలకు పంపిణీ చేసింది. ఉన్నపోఖ్రాన్ పట్టణంలో 300కు పైగా కుమ్మరుల కుటుంబాలు ఉన్నాయి. దశాబ్దాలుగా వారు కుమ్మరి పనుల్లోనే ఉంటున్నారు. అయితే,వృత్తిని కొనసాగించడం కష్టతరం కావడం, తాము తయారు చేసిన ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్ మద్దతూ లేకపోవడంతో వారు ఇటవలే ఇతర ఉపాధి మార్గాల పై దృష్టిపెట్టడం మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోకుమ్మరి పరిశ్రమ పునరుద్ధరణకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ముందుకువచ్చింది.
విద్యుత్తో పనిచేసే కుమ్మరిసారెలతోపాటు, కుమ్మరి పనిలో ముడిసరుకుగా వినియోగించే బంకమట్టిని కలపడానికి 8 బ్లంగర్యంత్రాలను కూడా పదిమంది కుమ్మరుల గ్రూపునకు కె.వి.ఐ.సి. పంపిణీ చేసింది. ఎనిమిది గంటల వ్యవధిలో 800 కిలోగ్రాముల బంక మట్టిని ఇది సిద్ధం చేయగలదు. మానవ ప్రయత్నంతో 800 కేజీల బంకమట్టిని సిద్ధం చేయాలంటే ఏకంగా 5 రోజులు పడుతుంది. ఈ చర్యల ద్వారా కె.వి.ఐ.సి. గ్రామంలో 350 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించింది. విద్యుత్ కుమ్మరిసారెలను అందుకున్న 80 కుటుంబాలకూ, కళాత్మకమైన మృణ్మయ ఉత్పాదనల తయారీలో కె.వి.ఐ.సి. 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మట్టి కప్పుల తయారీ నుంచి, ఫ్లవర్వాజులు, శిల్పాకృతులు వంటి అలంకృత వస్తువులు, లోటాలు, మట్టిబాటిళ్లు, గోళాకార వంట పాత్రలుత యారీలోశిక్షణ ఇప్పించారు.
శిక్షణసందర్భంగా “స్వచ్ఛభారత్అభియాన్”, “అంతర్జాతీయయోగాదినోత్సవం” కార్యక్రమాలను ప్రతి ఫలించేలా, వారు కళాత్మక ఉత్పాదనలను తయారుచేశారు. ఆదివారం అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సందర్భోచితంగా ఉంది.
పోఖ్రాన్ వాసులకు విద్యుత్ కుమ్మరిసారెలను, ఇతర పరికరాలను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేసిన అనంతరం కె.వి.ఐ.సి. చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, ప్రధాన మంత్రి పిలుపు నిచ్చిన“ఆత్మనిర్భర భారత్ అభియాన్”లో భాగంగా తాము ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. కుమ్మరి పరిశ్రమను బలోపేతం చేయడం, వారికి స్వయం ఉపాధికల్పించడం, కనుమరుగవుతున్న కుమ్మరికళను పునరుద్ధరించడం ఈ కార్యక్రమ లక్ష్యాలని తెలిపారు.
“ఇప్పటి వరకూ అణుపాటవ పరీక్షలు చేసిన స్థలంగా మాత్రమే పోఖ్రాన్ అందరికీ తెలుసు. త్వరలోనే కళాత్మక కుమ్మరి ఉత్పాదనలు, మృణ్మయ కళాకృతులు ఈ పట్టణానికి మరో గుర్తింపును తేనున్నాయి. కుమ్మరులకు పూర్వ వైభవంతెచ్చి, వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడమే-కుమ్హర్సశక్తియోజన ప్రధానలక్ష్యం. అధునాతన పరికర సామగ్రిని, శిక్షణను ఇవ్వడం ద్వారా కుమ్మరులను సమాజంతో తిరిగి అనుసంధానం చేయడానికి, వారి కళను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం” అని సక్సేనా అన్నారు.
పొఖ్రాన్ కుమ్మరులు తాము తయారు చేసిన ఉత్పాదనలకు విక్రయ సదుపాయం, మార్కెటింగ్ మద్దతు లభించేలా బార్మర్, జైసల్మేర్ ర్రైల్వేస్టేషన్లలో ఏర్పాట్లు చేయాలని రాజస్థాన్లోని కె.వి.ఐ.సి. డైరెక్టర్నుసక్సేనా ఆదేశించారు. “నీతి ఆయోగ్ గుర్తించిన ఆశావహ జిల్లాల్లో పోఖ్రాన్ కూడా ఉంది. 400 రైల్వేస్టేషన్లలో మట్టిపాత్రలు, టెర్రకోట పాత్రల్లో మాత్రమే ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. ఇందులో రాజస్థాన్లోని బార్మర్, జైసల్మేర్ ర్రైల్వేస్టేషన్లు పోఖ్రాన్ పట్టణానికి చేరువలో ఉన్నాయి. ఈ రెండు నగరాలు పర్యాటకంగా ఆకర్షణీయమైన నగరాలు కాబట్టి, పోఖ్రాన్ కమ్మరులు తమ ఉత్పాదనలను విక్రయించుకోవడానికి రాజస్థాన్కె.వి.ఐ.సి. విభాగం తగిన ఏర్పాట్లు చేస్తుంది.” అని సక్సేనా అన్నారు.
దేశంలోని పలుమారుమూల ప్రాంతాల్లోకూడా కుమ్హర్సశక్తియోజన పథకాన్ని కె.వి.ఐ.సి. ఇప్పటికే ప్రారంభించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్ముకాశ్మీర్, హర్యానా, పశ్చిమబెంగాల్, అస్సాం, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, బీహార్ వంటిరాష్ట్రాల్లో ఈపథకాన్ని ప్రారంభించారు. రాజస్థాన్లో జైపూర్, కోట, ఝలావర్, శ్రీగంగా నగర్లతో పాటుగా, డజనుకుపైగా జిల్లాలకు ఈ కార్యక్రమం ప్రయోజనం కలిగించింది. కుమ్మరులు బంకమట్టిని కలుపుకునేందుకు వినియోగించే బ్లంగర్యంత్రాలు, పగ్మిల్లులు కె.వి.ఐ.సి. ఈ పథకం కింద అందజేస్తోంది. వృత్తిలో కుమ్మరులకు ఎదురయ్యే ప్రయాసను, కష్టాలను తొలగించేందుకు, కుమ్మరుల ఆదాయాన్ని 7నుంచి 8రెట్లు పెంచేందుకు ఈయంత్రాలను రూపొందించారు.
(Release ID: 1633240)
Visitor Counter : 291