హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న వ‌ల‌స‌కార్మికులకు ఉప‌శ‌మ‌నం, సాధిక‌రాత క‌ల్పించేందుకు 50,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్‌ను ప్రారంభించినందుకు , ప్ర‌ధాన‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ప్ర‌జ‌లు ఉపాధికోసం న‌గ‌రాల‌కు వ‌ల‌స‌పోయేవారు, కానీ ప్ర‌స్తుతం గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద వారికి వారి ఇళ్ల‌కు ద‌గ్గ‌ర‌లోనే ,వారి నైపుణ్యాల‌కు త‌గిన‌ట్టుగా ఉపాధి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది-- శ్రీ‌అమిత్ షా

‘గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్ర‌జ‌ల ప్ర‌తిభ‌ను ఉప‌యోగించుకోవ‌డం జ‌రుగుతుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసి మ‌రింత ముందుకు తీసుకుపోతుంది’

మ‌న గ్రామాల అభివృద్ధికి, ప్ర‌జ‌ల జీవ‌నోపాధి కాపాడ‌డానికి , వ‌ల‌స‌కార్మికులు, పేద‌ల ఆత్మ గౌర‌వాన్ని కాపాడ‌డానికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంది.-- కేంద్ర హె్ం మంత్రి అమిత్ షా

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌కత్వంలో దేశం ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ దిశ‌గా ముందుకు పోతున్న‌ది. ఇందులో గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.- శ్రీ అమిత్‌షా

Posted On: 20 JUN 2020 8:44PM by PIB Hyderabad

50,000 కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ యోజ‌న‌ను ప్రారంభించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా , ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా స‌వాలు ఎదుర్కొంటున్న  వ‌ల‌స కార్మికులు, పేద‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్గించ‌డంతోపాటు సాధికార‌త క‌ల్పిస్తుంది. ఆరు రాష్ట్రాల‌లోని 116 జిల్లాల‌లోని గ్రామాలు ఈ గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అబియాన్ కిందికి వ‌స్తాయ‌ని శ్రీ అమిత్ షా తెలిపారు.
 గ్రామీణ ప్రాంతాల‌లో ప్ర‌జ‌ల‌కు  ఉపాధి క‌ల్పించేందుకు, గ్రామీణాభివృద్ధికి భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న 25 వివిధ ప‌నులు, కార్య‌క‌లాపాల‌ను అన్నింటినీ ఒక‌టిగా క‌లిపి ఈ ప‌థ‌కం కిందికి తెస్తారు.
ఇంత‌కు ముందు ప్ర‌జ‌లు ఉపాధి కోసం న‌గ‌రాల‌కు వ‌ల‌స‌పోయే వారు. కానీ ప్ర‌స్తుతం గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద వారికి వారి ఇళ్ళ‌కు ద‌గ్గ‌ర‌లోనే వారి నైపుణ్యాల‌కు అనుగుణంగా ఉపాధి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. వీరి ప్ర‌తిభ‌ను గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించుకోనున్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డమే కాకుండా మ‌రింత ముందుకు తీసుకుపోతుంది.
‘శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌బుత్వం మ‌న గ్రామాల అభివృద్ధికి, ప్ర‌జ‌ల జీవ‌నోపాధి ర‌క్ష‌ణ‌కు పేద‌లు , వ‌ల‌స కార్మికుల ఆత్మ‌గౌర‌వ ప‌రిర‌క్ష‌ణ‌కు  పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంది. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో దేశం‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ దిశ‌గా దేశం ముందుకు పోతోంది. ఇందులో ‘గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ’ కీల‌క పాత్ర పోషించ‌నుంది’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

   

 

 

Amit Shah@AmitShah

कोरोना महामारी के कारण प्रवासी मजदूरों व गरीबों के समक्ष उत्पन्न होने वाली चुनौतियों से उन्हें राहत देने एवं सशक्त बनाने के लिए मोदी सरकार द्वारा आज ₹50000 करोड़ के की शुरुआत हुई।

इस दूरदर्शी अभियान के लिए PM @narendramodi जी का आभार व्यक्त करता हूँ।

11.6K

5:11 PM - Jun 20, 2020

Twitter Ads info and privacy

1,981 people are talking about this

Amit Shah@AmitShah

में 6 राज्यों के 116 जिलों के गांव हिस्सा बनेंगे।

ग्रामीण भारत में रोजगार व समावेशी विकास के अवसर प्रदान करने के लिए सरकार द्वारा जो जन कल्याणकारी योजनाएं एवं विकास कार्य चल रहे है, ऐसे 25 कार्यों अथवा योजनाओं को इस अभियान के अंतर्गत जोड़ा जायेगा।

7,311

5:11 PM - Jun 20, 2020

Twitter Ads info and privacy

1,333 people are talking about this

Amit Shah@AmitShah

पहले लोग रोजगार की तलाश में शहर की ओर जाते थे लेकिन अब ‘गरीब कल्याण रोजगार अभियान’ के माध्यम से उन्हें अपने कौशल के आधार पर अपने घरों के पास रोजगार उपलब्ध कराया जाएगा।

उनकी प्रतिभा का उपयोग ग्रामीण क्षेत्र के विकास में किया जाएगा, जिससे ग्रामीण अर्थव्यवस्था को और अधिक बल मिलेगा।

19.8K

5:12 PM - Jun 20, 2020

Twitter Ads info and privacy

3,473 people are talking about this

Amit Shah@AmitShah

मोदी सरकार हमारे गांवों के विकास, प्रवासी श्रमिकों व गरीबों की आजीविका और आत्मसम्मान की रक्षा करने के लिए पूरी तरह से कटिबद्ध है।

प्रधानमंत्री @NarendraModi जी के नेतृत्व में 'आत्मनिर्भर भारत' की ओर अग्रसर हो रहे देश में गरीब कल्याण रोजगार अभियान एक महत्वपूर्ण भूमिका निभाएगा।

21.7K

5:12 PM - Jun 20, 2020

Twitter Ads info and privacy

3,424 people are talking about this

*****



(Release ID: 1633075) Visitor Counter : 135