యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
గతంలో ఛాంపియన్లుగా ఉన్న వారిని క్రీడల శిక్షణలో నిమగ్నం చేసేందుకు క్రీడామంత్రిత్వశాఖ 1000 జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లు (కెఐసి) ఏర్పాటు చేయనుంది
ఇండియాను క్రీడారంగ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దేందుకు, క్రీడలు యువతకు తగిన ఉపాధి అవకాశంగా ఉండాలి: శ్రీ కిరణ్ రిజ్జు
Posted On:
19 JUN 2020 7:20PM by PIB Hyderabad
క్రీడలలో గతంలో ఛాంపియన్లుగా ఉన్న వారి నైపుణ్యాన్ని క్షేత్రస్థాయిలో క్రీడాకారుల శిక్షణకు ఉపయోగించుకునేందుకు , అలాగే మాజీ ఛాంపియన్లకు నిలకడగా రాబడి వచ్చేలా చేసేందుకు దేశవ్యాప్తంగా జిల్లాస్థాయిలో వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు (కెఐసి) ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాలు మాజీ ఛాంపియన్లు నిర్వహించవచ్చు లేదా వారు అందులో కోచ్‌లు గా ఉండవచ్చు. ఈ నిర్ణయం వల్ల క్షేత్ర స్థాయిలో క్రీడలకు బలం చేకూరుతుంది. అలాగే గతంలో ఛాంపియన్లుగా నిలిచినవారు తాము జీవనోపాథి పొందుతూనే దేశం, క్రీడలలో సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కృషి చేయడానికి ఇది దోహదపడుతుంది.
గతంలో క్రీడలలో ఛాంపియన్లుగా నిలిచినవారికి ఒక వేదిక కల్పిస్తూ, క్రీడా రంగంలో వారి సేవలు ప్రొఫెషనల్‌గా వినియోగించుకునేందుకు తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేస్తూ ,కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, “ మనం భారతదేశాన్ని క్రీడల సూపర్ పవర్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నందున, క్రీడలు యువతకు వృత్తిపరమైన అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి. క్రీడాకారులు తాము పోటీలలో పాల్గొనడం ఆపేసిన తర్వాతకూడా నిలకడగా జీవనొపాధి కల్పించే విధంగా ఉండాలి. అప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలను మనసు పెట్టి ఒక కెరియర్ ఆప్షన్‌గా ఎంచుకునేందుకు ప్రోత్సహిస్తారు. ఇది మాత్రమే దేశంలోని అత్యుత్తమ ప్రతిభను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది. లేకుంటే వీరు ఇతర రంగాలను ఎంచుకుంటారు. ప్రస్తుతం కెఐసిల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, గతంలో ఛాంపియన్లుగా ఉన్న వారి సేవలను ఉపయోగించుకునేందుకు ఉద్దేశించినది. జాతీయస్థాయి క్రీడలలో పాల్గొన్న వారు ఎవరైనా గౌరవప్రదంగా, ఆర్ధికంగా స్థిరత్వం కలిగి ఉండేలా ఉండాలని మేం అనుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా ఇంతకు ముందు క్రీడలలొ ఛాంపియన్లుగా ఉన్న వారిని గుర్తించేందుకు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఛాంపియన్లు స్వంతంగా అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఖేలో ఇండియా కేంద్రాలలో (కెఐసి) కోచ్‌గా పనిచేయవచ్చు. తొలి కేటగిరి కింద పరిశీలనకు వచ్చే క్రీడాకారులు, గుర్తింపు పొందిన ఎన్.ఎస్.ఎఫ్ లేదా అసోసియేషన్ కింద గుర్తింపు పొందిన అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఉండాలి. రెండో కేటగిరీ కింద, క్రీడాకారులు, గుర్తింపు పొందిన ఎన్.ఎస్.ఎఫ్‌లో సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లేదా ఖేలో ఇండియా గేమ్స్ లో మెడల్ గెలుచుకున్న వారు అయి ఉండాలి. మూడో కేటగిరీ కింద గతంలో ఛాంపియన్లుగా ఉన్నవారు నేషనల్ ఆలిండియా యూనివర్సిటీ గేమ్స్ లో మెడల్స్ గెలుచుకున్న వారై ఉండాలి. జమ్ము కాశ్మీర్ , అండమాన్ నికోబార్ దీవులు, లద్దాక్ కు మాత్రం వీటి నుంచి మినహాయింపు నిచ్చారు. ఎన్ఐఎస్ సర్టిఫికేట్‌తో శిక్షణపొందిన కోచ్‌లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సెంటర్లు నిర్మించడానికి, ప్రస్తుత ఎస్.ఎ.ఐ విస్తరణ కేంద్రాలను కె.ఐ.సి లుగా మార్చేందుకు ,అలాగే ఈ పథకం కింద ఫైనాన్షియల్ గ్రాంట్ పొందేందుకు గతంలో ఛాంపియన్లుగా ఉన్న క్రీడాకారులను నియమించుకునేందుకు ఆప్షన్ ఇస్తారు. ఎవరైనా గతంలో క్రీడలలలో ఛాంపియన్‌గా ఉన్నవారు, కొత్తగా కెఐసిని స్వంతంగా లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, క్లబ్‌లు, విద్యా సంస్థల ద్వారా తగిన మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకం కింద గ్రాంటు పొందాలంటే ఈ ఛాంపియన్లు ఆయా కె.ఐ.సి కేంద్రాలలో క్రీడాకారులకు పూర్తి కాలపు శిక్షకులుగా ఉండాలి. 5 సంవత్సరాలుగా క్రీడలను ప్రోత్సహిస్తున్న సంస్జలు కూడా ఈ కె.ఐ.సి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అర్హత కలిగి ఉంటాయి. అయితే ఈ సంస్జలు కోచ్‌లుగా గతంలో ఛాంపియన్లుగా నిలిచిన వారిని నియమించుకోవలసి ఉంటుంది.జమ్ము కాశ్మీర్, లద్దాక్, డామన్ ,డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఈశాన్య రాష్ట్రాలకు ఈ ఐదేళ్ల నిబంధనను మినహాయించడం జరిగింది.
ఈ ఖేలో ఇండియా సెంటర్లలో (కెఐసి) ఒలింపిక్స్‌కు సంబంధించిన 14 గుర్తింపు పొందిన క్రీడలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో అర్చరి, అథ్లెటిక్, బాక్సింగ్, బాడ్మింటన్ , సైక్లింగ్, ఫెన్సింగ్, హాకీ, జుడో, రోవింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉన్నాయి. ఫుట్‌బాల్, సంప్రదాయ క్రీడలను కూడా ఇందులో చేర్చారు.ప్రతి కెఐసికి గ్రాంట్ కింద కోచ్‌గా గత ఛాంపియన్లకు ఇచ్చే రెమ్యునరేషన్, సపోర్ట్ స్టాఫ జీతాలు, పరికరాల కొనుగోలు, స్పోర్ట్స్ కిట్స్, ఇతర ఉపకరణాలు, పోటీలు, ఈవెంట్ల పాల్గొనేందుకు చెల్లిస్తారు. కొత్త కె.ఐ.సిల ను గుర్తించే ప్రక్రియను ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడల విభాగాలు, ఆయా జిల్లా కలెక్టర్ల సమన్వయంతో చేపడతాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తదుపరి పరిశీలననుస్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం చేపడుతుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కెఐసిలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు..
(Release ID: 1633067)
Visitor Counter : 159