జల శక్తి మంత్రిత్వ శాఖ
'జల్ జీవన్ మిషన్' అమలు నిమిత్తం మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన కేంద్ర మంత్రి
2020-21 సంవత్సరానికి రాష్ట్రంలో జేజేఎం అమలు కోసం రూ.1,828.92 కోట్ల నిధులకు కేంద్రం ఆమోదం
Posted On:
20 JUN 2020 4:47PM by PIB Hyderabad
దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక 'జల్ జీవన్ మిషన్'ను (జేజేఎం) వేగంగా అమలు చేసేందుకు గాను కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక మిషన్‌ను వేగంగా అమలు చేయడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రి నిరంతరం సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో మిషన్ అమలును వేగంగా అమలు చేయాలని కోరారు.
2024 నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి నీరిచ్చే విధంగా కుళాయి కనెక్షన్లను (ఎఫ్‌హెచ్‌టీసీ) అందించే లక్ష్యంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 2019 ఆగస్టు 15 న ఎర్రకోట నుండి జల్ జీవన్ మిషన్‌ను ప్రకటించారు. జీవన క్రమాన్ని మార్చే ఈ మిషన్ గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా బాలికల జీవితాలను మెరుగుపరుస్తుంది.
అన్ని విధాలా సాయం అందిస్తాం..
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కింద గ్రామాల్లోని అన్ని గృహాలకు క్రమం తప్పక మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో తాగు నీటి సేవలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తన లేఖలో హామీ ఇచ్చింది. జేజేఎం కింద, అందించిన ఎఫ్‌హెచ్‌టీసీల ఆధారంగా కేంద్రం సరిపోలే వాటాను అందించనుంది. ఇందుకు సరిపోలేలా రాష్ట్రం వాటాను జోడిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది.
5.45 లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్లు..
2019-20లో మహారాష్ట్ర జేజేఎమ్ లో భాగంగా 16.26 లక్షల మేర కుళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యాంగా ఉండగా.. 5.45 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్లను అందించారు. రాష్ట్రం వద్ద రూ.285.35 కోట్ల మేర ఖర్చు చేయని నిధులు ఉన్నాయి. దీనికి తోడు ఈ ఏడాది కేంద్ర కేటాయింపు మరియు రాష్ట్ర వాటాను కూడా కలుపుకుంటే జేజేఎం అమలుకు గాను 2020-21 ఏడాదిలో మహారాష్ట్ర వద్ద రూ.3,908 కోట్ల మేర నిధులు అందుబాటులో ఉండనున్నాయి. దీనికి తోడు 15 వ ఆర్థిక కమిషన్ రాష్ట్రానికి రూ.5,827 కోట్ల టైడ్ గ్రాంట్లను కేటాయించింది. ఈ నిధులను విధిగా (ఎ) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ మరియు నీటి రీసైక్లింగ్ మరియు (బి) పారిశుద్ధ్యం మరియు ఓటీఎఫ్ హోదా నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఉన్న పథకాలను అనుసంధానం చేయాలి..
జేజేఎంలో భాగంగా తాగునీటి భద్రతను సాధించడానికి దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడానికి గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణ మరియు నిర్వహణలో స్థానిక గ్రామ సంఘం / గ్రామ పంచాయితీలు మరియు వినియోగదారు సమూహాలను పాల్గొనేలా చూడాలని కేంద్ర మంత్రి సీఎంను కోరారు. అన్ని గ్రామాల్లో, జల్ జీవన్ మిషన్‌ను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చేందుకు గాను కమ్యూనిటీ సమీకరణతో పాటు ఐఈసీ ప్రచారం చేపట్టాలని ఆయన సీఎం ను కోరారు. ప్రస్తుతం ఉన్న 8,268 పైపుల నీటి సరఫరా పథకాలను రీట్రోఫిటింగ్ మరియు బలోపేతం చేయడాన్ని పెంచాలని మంత్రి కోరారు తద్వారా ఈ సంవత్సరంలో 22.35 లక్షల గృహ కుళాయి కనెక్షన్లు కల్పించవచ్చని అన్నారు. జేజేఎమ్‌లోని ఈ పనులన్నింటినీ 'క్యాంపయిన్ మోడ్'లో చేపట్టాలని రాష్ట్రానికి సూచించారు. తద్వారా ఈ గ్రామాలు వచ్చే 4-6 నెలల్లో సులభంగా' హర్ ఘర్ జల్ గావ్ 'గా మారతాయన్నారు. సమాజంలోని పేద మరియు అట్టడుగు వర్గాలకు చెందిన వారి గృహాలకు కుళాయిలు వెనువెంటనే అందుబాటులోకి వస్తాయని అన్నారు.
కోవిడ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి లేఖ..
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి 100 శాతం నాణ్యమైన ప్రభావిత నివాసాలను ఈ పథకంలో కవర్ చేయడానికి రాష్ట్రం ప్రణాళిక రూపొందించింది. గ్రమాల్లోని అన్ని గృహాల సార్వత్రిక కవరేజ్ కోసం ప్రణాళికలు వేస్తున్నప్పుడు, నీటి కొరత ఉన్న ప్రాంతాలు, నాణ్యత ప్రభావిత ప్రాంతాలు, ఎస్సీ / ఎస్టీ ఆధిపత్య నివాసాలు / గ్రామాలు, ఆశాజనక జిల్లాలు, సంసాద్ ఆదర్శ్ గ్రామీణ యోజన గ్రామాలు, మరీ ముఖ్యంగా పేద గిరిజన సమూహాలుండే ప్రాంతాలకు తగిన విధంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మహారాష్ట్రలో నీటి సంరక్షణ నిమిత్తం కొన్ని అద్భుతమైన పనులు జరిగాయి. ఎంజీఎన్ఆర్‌జీఎస్, జేజేఎం, ఎస్‌బీఎం(జి), పీఆర్‌ఐలకు 15 వ ఎఫ్‌సీ గ్రాంట్లు, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, కాంపా, సీఎస్‌ఆర్ ఫండ్, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ మొదలైన వివిధ కార్యక్రమాల కలయిక ద్వారా ఈ నీటి వనరుల అభివృద్ధికి వివిధ చర్యలు చేపట్టడమైంది.
గ్రామ స్థాయిలో ప్రణాళిక చేయాలి మరియు ఈ వనరులన్నింటినీ డొవెటైల్ చేయడం ద్వారా ప్రతి గ్రామానికి గ్రామ కార్యాచరణ ప్రణాళిక (వీఏపీ) సిద్ధం చేయాలి. ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఈ పనులను వేగవంతం నిమిత్తం.. కేంద్ర మంత్రి సీఎంకు లేఖ రాయడం సరైన సమయంలో సముచిత చర్య. ప్రజారోగ్యం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవటానికి, ఈ ప్రధాన కార్యక్రమం జల్ జీవన్ మిషన్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, గృహలకు కుళాయి కనెక్షన్లను అందించడానికి అన్ని గ్రామాలలో నీటి సరఫరా పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది స్థానికులకు, వలసదారులకు తగిన విధంగా ఉపాధి పొందడంలో సహాయపడుతుంది. ఈ చర్య మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది.
2024 నాటికి రాష్ట్రాన్ని ‘100 శాతం ఎఫ్‌హెచ్‌టీసీ రాష్ట్రంగా’ మార్చడానికి మహారాష్ట్ర సీఎంకు పూర్తి సహకారం అందిస్తానని జల్ శక్తి మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేజేఎం ప్రణాళిక, మరియు అమలును గురించి చర్చించాలని భావిస్తున్నట్టుగా తెలిపారు.
(Release ID: 1633024)
Visitor Counter : 163