రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

మోటారు వాహనాల నిబంధనల సవరణకు సూచనలకోసం ఆహ్వానం

Posted On: 20 JUN 2020 4:35PM by PIB Hyderabad

వివిధ రాష్ట్రాలనుంచి పొరుగుదేశాలకు ప్రయాణీకుల, సరకు రవాణాకు సవరణలతో కూడిన ముసాయిదా విడుదలైంది. రోడ్డు రవాణా, హైవేఖ  మంత్రిత్వశాఖ ప్రజలతో సహా ఈ రంగానికి సంబంధిమ్చినవారు సలహాలు, అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కొరుతూ ముసాయిదా నిబంధనలను విడుదలచేసింది. సవరణల అనంతరం పొరుగు దేసాలతో ఒప్పందం కుదుర్చుకొవటానికి ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయి. 18న జారీ అయిన ఈ నోటిఫికేషన్ ను www.morth.gov.in అనే వెబ్ సైట్ లో చూడవచ్చు.

అమృత్ సర్ - లాహోర్ (2006), న్యూ ఢిల్లీ- లాహోర్ (2000), కోల్ కతా- ఢాకా (2000), అమృత్ సర్ - నాన్ కనా సాహిబ్ (2006) మధ్య బస్సు సర్వీసులకోసం నిబంధనలు జారీచేసింది. వాటికోసం జారీచేసిన ఆ నిబంధనలకు అనుగుణంగా భారత్ తన పొరుగు దేశాలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. అదే విధంగా త్రిపుర లోని బిషాల్ గడ్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ కు  బంగ్లాదేశ్ నుంచి భారత భూభాగంలోకి బంగ్లాదేశ్ లో రిజిస్టర్ అయిన ఎల్పీజీ ట్రక్కులు రావటానికి వీలు కల్పిస్తూ 17.10.2018 న మంత్రిత్వశాఖ నిబంధనలు రూపొందించింది.

పైన పైర్కొన్న కేసులన్నిటినీ లెక్కలోకి తీసుకుంటూ, భారత్ నుంచి ఇరుగుపొరుగు దేశాలకు ప్రయాణీకుల వాహనాలు, రవాణా వాహనాల రాకపోకలకు వీలు కలిగించేలా అవగాహనాఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రామాణికమైన మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు.

వెబ్ సైట్ లో ముసాయిదా చూసిన మీదట ఈ అంశానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వదలచుకున్నవారు జాయింట్ సెక్రెటరీ ( ఎం వి ఎల్), రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, ట్రాన్స్ పోర్ట్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూ ఢిల్లీ-110001 అనే చిరునామాకు లేఖద్వారా గాని, లేదా jspb-morth[at]gov[dot]in అనే ఈ మెయిల్ ఐడి కి గాని 2020 జులై 17 లోగా పంపాలి



***



(Release ID: 1632956) Visitor Counter : 201