భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

మే 29 నుంచి జూన్ 1 వ‌ర‌కు అరేబియా సముద్ర ప్రాంతంలో ఏర్ప‌డిన వాయుగుండంపై వాతావ‌ర‌ణ విభాగం నివేదిక

ఈ వాయుగుండాన్ని ఇన్‌శాట్ 3 డి, 3 డిఆర్‌, పోలార్ ఆర్బటింగ్ ఉప‌గ్ర‌హాలు, ఎస్‌సిఎటి శాట్‌, ఎఎస్‌సిఎటి, అందుబాటులొని నౌక‌లు, స‌ముద్ర‌నీటిపై తేలే ఉప‌క‌ర‌ణాల సాయంతో గ‌మ‌నించ‌డం జ‌రిగింది

Posted On: 20 JUN 2020 11:33AM by PIB Hyderabad

భార‌త వాతావ‌ర‌ణ విభాగానికి(ఐఎండి)  చెందిన జాతీయ వాతావ‌ర‌ణ సూచ‌న‌ల కేంద్రం, న్యూఢిల్లీ ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం  మే 29 నుంచి జూన్ 1 వ‌ర‌కు అరేబియా స‌ముద్ర ప్రాంతంలో ఏర్ప‌డిన వాయుగుండంపై ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ నివేదిక‌లోని ముఖ్యాంశాల‌ను ఇక్క‌డ చ‌ర్చించ‌డం జ‌రుగుతోంది.
సంక్షిప్త చ‌రిత్ర‌:
-  అరేబియా స‌ముద్ర ప‌శ్చిమ మ‌ధ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న‌నైరుతి ప్రాంతంలో ఒక ద్రోణి మే 27న ఏర్ప‌డింది.
-ఇది  మే 29న అల్ప పీడ‌నంగా ద‌క్షిణ ఓమ‌న్ - తూర్పు యెమెన్ తీర ప్రాంతం మ‌ధ్య , ప‌శ్చిమ మ‌ద్య అరేబియా స‌ముద్ర ప్రాంతంలో కేంద్రీకృత‌మై ఉంది.
-  సానుకూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ మ‌ధ్య ఇది ద‌క్షిణ కోస్తా ఒమ‌న్, ప‌క్క‌నే ఉన్న యెమ‌న్ ప్రాంతంలో  మే 29 మ‌ధ్యాహ్నం (0900 యుటిసి)  వాయుగుండంగా బ‌ల‌ప‌డింది
--     ఆ త‌ర్వాత ఇది ద‌క్షిణ కోస్తా ఒమ‌న్‌, ప‌క్క‌నే ఉన్న యెమెన్ ప్రాంతంలో మే 30 వ‌తేదీ ఉద‌యం (0300యుటిసి) నాటికి  స్వ‌ల్పంగా ప‌శ్చిమ దిశ‌కు తిరిగింది.
 -- ఆ త‌ర్వాత అది నైరుతివైపు తిరిగి బ‌ల‌హీన‌ప‌డి డ‌బ్ల్యు.ఎం.ఎల్ గా 2020 జూన్ 1 నాటి వేకువ‌జాముకు ద‌క్షిణ కోస్తా ఒమ‌న్‌, పొరుగున ఉన్న యెమెన్ ప్రాంతంపై ఉంది.
- ఐఎండి ఇందుకు సంబంధించి ఉత్త‌ర హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతాన్ని నిరంత‌రం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూవ‌చ్చింది. అలాగే దీనిని  మే 27 వ‌తేదీన  అరెబియా సముద్ర ప‌శ్చిమ కేంద్ర ప్రాంతం,  ప‌క్క‌నే ఉన్న అరేబియాస‌ముద్ర నైరుతి ప్రాంతంలో ద్రోణి ఏర్ప‌డిన‌ప్ప‌టినుంచి దీనిని ప‌రిశీలిస్తూ రావ‌డం జ‌రిగింది.
వాయుగుండాన్ని ఇన్‌శాట్ 3డి, 3డిఆర్‌,  ఎస్‌సిఎటి శాట్‌,  ఎ ఎస్ సి ఎటి తోపాటు   పోలార్ ఆర్బిటింగ్ ఉప‌గ్ర‌హాలు, అందుబాటులో ఉన్న నౌకలు, స‌ముద్ర జ‌లాల‌లో తేలే ఉప‌క‌ర‌ణాలు వంటి వాటి ద్వారా స‌మాచారం సేక‌రించారు. భూ విజ్ఞాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప‌లు సంస్థ‌లు వాతావ‌ర‌ణ ప‌రిశీల‌న‌కు సంబంధించి వివిధ న్యూమ‌రిక‌ల్ వెద‌ర్ మోడ‌ల్స్‌ను అనుస‌రిస్తాయి. అలాగే దేశీయంగా రూపొందించిన‌ ఐఎండిఎ వారి డైన‌మిక‌ల్ స్టాటిస్టిక‌ల్ మోడ‌ల్స్‌ను వాయుగుండం ఆవిర్భావం , క‌ద‌లిక‌, అది తీరం చేర‌డం వంటి వాట‌న్నిటి అంచ‌నాకు రూపొందించడం జ‌రిగింది. ఐఎండి డిజిట‌లైజ్‌డ్ రూపంలో త‌న వాతావ‌ర‌ణ అంచ‌నాల‌ను రూపొందిస్తుంది. ఈస‌మాచారాన్ని  విశ్లేష‌ణ‌కు, ఇత‌ర న్యూమ‌రిక‌ల్ న‌మూనాల‌ను పోల్చ‌డానికి , నిర్ణ‌యం తీసుకునే ప్ర‌క్రియ‌కు ,హెచ్చ‌రిక‌లు జారీచేయ‌డానికి వినియోగిస్తారు.
ద‌క్షిణ కోస్తా ఒమ‌న్, ప‌క్క‌నే ఉన్న యెమ‌న్ ప్రాంతంలో వాయుగుండం హెచ్చ‌రిక‌, వాయుగుండాన్ని అంచ‌నా వేయ‌డం, విజ‌య‌వంతంగా దానిని ప‌రిశీలించ‌డం వంటి వాటి విష‌యంలో , భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండి),ఆర్ ఎస్ ఎం సి న్యూఢి్లీ సంస్థ‌లు డ‌బ్ల్యు ఎం. ఒ  ఇత‌ర సంస్థ‌లు, విప‌త్తు నిర్వ‌హ‌ణ ఏజెన్సీల కృషిని గుర్తించాయి.
భూ విజ్ఞాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప‌లు సంస్థ‌ల సేవ‌ల‌నుకూడా గుర్తించ‌డం జ‌రిగింది.   నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ మీడియం రేంజ్ వెద‌ర్ పోర్‌కాస్టింగ్ సెంట‌ర్ (NCMRWF), ఇండియ‌న్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఓష‌న్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్ (INCOIS), నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌న్ టెక్నాల‌జీ (ఎన్ఐఒటి), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ట్రాపిక‌ల్ మెటీయోరాల‌జీ (ఐఐటిఎం) పూణె, ప‌రిశోధ‌న సంస్థ‌లైన ఐఐటి భువ‌నేశ్వ‌ర్‌, ఐఐటి ఢిల్లీ, స్పేస్ అప్లికేష‌న్ సెంట‌ర్‌,ఇండియ‌న్ స్పేస్ రీస‌ర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్ఎసి - ఇస్రో) సంస్థ‌లు త‌మ విలువైన మ‌ద్ద‌తు ను అందించాయి. ఐఎండి తుపాను హెచ్చ‌రిక కేంద్రానికి చెందిన వివిధ డివిజ‌న్లు, విభాగాలైన  ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంట‌ర్ (ఎసిడ‌బ్ల్యుసి) చెన్నై, ముంబై సైక్లోన్ వార్నింగ్ సెంట‌ర్ (సిడ‌బ్ల్యుసి), తిరువ‌నంత‌పురం, అహ్మ‌దాబాద్ అండ్ మెటీయోరాలాజిక‌ల్ సెంట‌ర్ (ఐఎఎంసి) గోవా లు త‌మ‌ మ‌ద్ద‌తు నందించాయి. న్యూమ‌రిక‌ల్ వెద‌ర్ ప్రిడిక్ష‌న్ డివిజ‌న్, శాటిలైట్‌, రాడార్ డివిజ‌న్‌, భూత‌ల‌, ఎగువ వాతావ‌ర‌ణ ప‌రిక‌రాల విభాగం,న్యూఢిల్లీ, ఐఎండిలోని ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్‌, స‌ర్వీసెస్ డివిజ‌న్ సేవ‌ల‌ను కూడా గుర్తించ‌డం జ‌రిగింది.

 

(స‌వివ‌ర‌మైన నివేదిక కోసం ద‌య‌చేసి క్లిక్‌చేయండి)


(నివేదిక ఐఎండి, ఆర్ ఎస్ ఎం సి వెబ్‌సైట్స్‌లోనూ అందుబాటులో ఉంది) www.imd.gov.in

 

*****



(Release ID: 1632891) Visitor Counter : 125