సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

సందర్శకులను అనుమతించకుండా, జలియన్ వాలా బాగ్ స్మారకాన్ని తిరిగి 2020 జూలై 31 వరకు మూసివేయాలని నిర్ణయించడం జరిగింది

Posted On: 19 JUN 2020 6:58PM by PIB Hyderabad

జలియన్ వాలా బాగ్ ఊచకోత సంఘటన శతాబ్దిని 13.4.2019 నుండి 13.4.2020 తేదీ వరకు దేశం పాటించింది.  ప్రస్తుతం, స్మారక చిహ్నం పునరుద్ధరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మ్యూజియం / గ్యాలరీలు మరియు స్మారక స్థలంలో సౌండ్ & లైట్ షో ను ఏర్పాటు చేస్తున్నారు.  2020 ఏప్రిల్ 13 వ తేదీ నాటికి ప్రజలు నివాళులర్పించడానికి వీలుగా, స్మారక స్థలంలో పునర్నిర్మాణ పనులు 2020 మార్చి నాటికి పూర్తి కావాల్సివుంది.  స్మారక స్థలంలో పని పూర్తి స్థాయిలో జరుగుతోంది.  స్మారక చిహ్నాన్ని ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుండటంతో, స్మారక చిహ్నానికి సందర్శకుల ప్రవేశాన్ని 15.2.2020 నుండి 12.4.2020 వరకు మూసివేయాలని నిర్ణయించారు, తద్వారా కొనసాగుతున్న పనులను నిర్ణీత గడవు లోపు పూర్తి చేయవచ్చునని కూడా భావించడం జరిగింది.  అయితే, కోవిడ్-19 సంక్షోభం కారణంగా, అనుకున్న పని సకాలంలో పూర్తికాలేదు. దీంతో, ఇప్పుడు, తిరిగి, 31.7.2020 వరకు సందర్శకులను అనుమతించకుండా స్మారకాన్ని 31.07.2020 తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించారు.

 

 *****



(Release ID: 1632805) Visitor Counter : 119