రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

సిపెట్ కార్య‌క‌లాపాల‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స‌మీక్షించిన మంత్రి శ్రీ‌గౌడ

- ఎంఎస్‌ఎంఈల‌ వృద్ధికి తోడ్పడటానికి సిపెట్ తన విస్తారమైన నెట్‌వర్క్‌ను మ‌రింత ప్రభావితంగా ఉప‌యోగించాలి: శ్రీ సదానంద గౌడ

Posted On: 19 JUN 2020 5:31PM by PIB Hyderabad

'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ' (సిపెట్) కార్యకలాపాలను కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి. వి. సదానంద గౌడ శుక్ర‌వారం (ఈ రోజు) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్షించారు. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో నైపుణ్యం, సాంకేతిక సహాయ సేవలు, పరిశోధనలకు సంబంధించి సిపెట్ చేపట్టిన వివిధ  కార్యకలాపాలను ఆ సంస్థ డీజీ మంత్రికి వివ‌రించారు. “ఆత్మ నిర్భర్ భారత్” ప్రభుత్వ మిషన్‌కు అనుగుణంగా దేశీయ పెట్రోకెమికల్ రంగంలో ఎంఎస్‌ఎంఈల వృద్ధికి తోడ్పడేలా వివరణాత్మక ప్రణాళికతో.. సిపెట్ తన విస్తారమైన ఖాతాదారుల నెట్‌వర్క్‌ను త‌గిన విధంగా ఉపయోగించుకోవాలని ఈ సమావేశంలో శ్రీ గౌడ సూచించారు.
ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ కోవిడ్‌తో పోరాడుతున్న వైద్య నిపుణులకు త‌గిన ఉప‌శ‌మం ఇచ్చే విధంగా పీపీఈ కిట్‌ల‌ను అభివృద్ధి చేయాలని సిపెట్ సంస్థ డీజీని ఆయన కోరారు.
సిపెట్ సేవ‌ల‌కు ప్ర‌శంస‌నీయం..

 

 


కోవిడ్‌-19 కు వ్యతిరేకంగా దేశం సంసిద్ధతను బలోపేతం చేసే ప్రయత్నాలను సిపెట్ ఇక‌పై కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ర‌సాయ‌నాలు & పెట్రో కెమికల్స్ కార్యదర్శి శ్రీ ఆర్ కె చతుర్వేది ముఖ్యంగా సిపెట్ చేత చేపట్టబడిన అధునాతన పరిశోధన కార్యకలాపాల గురించి ప్ర‌శంసించారు; ఈ కోవిడ్ -19 మహమ్మారి విస్త‌ర‌ణ సమయంలో పీపీఈ‌ కిట్లను యాన్టిబాక్టీరియల్ / యాంటీమైక్రోబయల్‌తో పాటుగా పునర్వినియోగ మాస్క్‌లు, వెంటిలేటర్ స్ప్లిటర్స్ వంటి అభివృద్ధిని ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌శంసించారు. పెట్రో కెమిక‌ల్స్ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీకాశినాథ్ ఝా మాట్లాడుతూ సిపెట్ మెడికల్ డయాగ్నస్టిక్స్ మ‌రియు మెడికల్ రీసెర్చ్ వంటి ఇతర రంగాలలో పని చేస్తున్నారని తెలిపారు. పాలిమర్‌లు మ‌రియు అనుబంధ రంగాలలో సంస్థ‌కు ఉన్న త‌గిన సాంకేతిక నైపుణ్యం ద్వారా “మెడికల్ డివైస్ పార్కుల అభివృద్ధి” కి గణనీయమైన రీతిలో మద్దతు ఇవ్వగలదని చెప్పారు. జేఎస్‌(సీ) స‌మీర్ కుమార్ బిశ్వాస్‌, పిపెట్ డీజీ ఫ్రొపెస‌ర్ డాక్ట‌ర్ ఎస్‌.కె.నాయ‌క్‌తో పాటు ఆ సంస్థ వివిధ విభాగాధిప‌తులు, వివిధ సిపెట్ కేంద్రాల నుంచి ప‌లువురు డైరెక్ట‌ర్లు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.
కోవిడ్‌పై పోరులో జాతికి స‌హాయ‌కారిగా..
వివిధ సిపెట్ కేంద్రాల అధినేతలు మాట్లాడుతూ  రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వాల డిమాండ్ల మేర‌కు పీపీఈ కిట్ల క్యారెక్టరైజేషన్ మరియు ధ్రువీకరణకు సంబంధించి తాము చేప‌డుతున్న ప‌లు కార్యకలాపాల గురించి  వివ‌రించారు. కోవిడ్ -19 విజృంభిస్తున్న ప్రస్తుత త‌రుణంలో దేశానికి స‌హాయక‌రంగా ఉండేందుకు గాను  అధునాతన మెడికల్ డయాగ్నస్టిక్స్‌, మౌల్డ్‌లు మ‌రియు డైయ్‌లు, శానిటైజర్స్ మొదలైన వాటిపై ప‌రిశోధ‌న‌లు, అభివృద్ధికి గాను సిపెట్ కేంద్రాలు చేస్తున్న కృషిని వివ‌రించారు. 


(Release ID: 1632781) Visitor Counter : 232