రక్షణ మంత్రిత్వ శాఖ
కర్టన్ రైజర్ః రష్యా విక్టరీడే పరేడ్-2020లో పాల్గొననున్న భారత సాయుధ దళాలు
Posted On:
19 JUN 2020 12:13PM by PIB Hyderabad
1941-1945 మధ్య జరిగిన గొప్ప దేశభక్తి యుద్ధంలో సోవియట్ ప్రజలు విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 24న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో నిర్వహించనున్న విక్టరీడే మిలిటరీ పరేడ్‌లో భారత్ కూడా పాల్గొననుంది. ఈ 75 ఏండ్ల వార్షికోత్సవంలో కల్నల్ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో త్రివిధ దళాలలోని అన్ని ర్యాంకుల సిబ్బందితో కూడిన భారతీయ సాయుధ దళాల వారు పాల్గొననున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనచివేత శక్తులకు వ్యతిరేకంగా నార్త్ ఆఫ్రికన్ క్యాంపయిన్, ఈస్ట్ ఆఫ్రికన్ క్యాంపయిన్‌తో పాటు వెస్ట్రన్ డిసర్ట్ క్యాంపయిన్, యూరోపియన్ థియేటర్‌లలో పోరుసల్పిన అతిపెద్ద మిత్రరాజ్యాల దళాలలో బ్రిటీష్ ఇండియన్ సాయుధ దళాలు ఒకటి. ఆయా క్యాంపయిన్‌లో దాదాపు 34,354 మందికి పైగా గాయపడడంతో పాటుగా దాదాపు 87 వేల మంది భారతీయ సైనికుల త్యాగాలు దాగి ఉన్నాయి.
నాలుగు వేలకు పైగా పురస్కారాలు..
ఇండియన్ మిలిటరీ అన్ని రంగాల్లోనూ ముందుండి పోరాడటమే కాకుండా దక్షిణ, ట్రాన్స్ - ఇరానియన్ లెండ్-లీజ్ మార్గంలో రవాణా ఇతర సౌకర్యాలను నిలిపి ఉంచే విషయమై భారత దళం చర్యలు చేపట్టింది. దీని ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, యుద్ధ పరికరాల మద్దతుతో పాటు ఆహారం సోవియట్ యూనియన్, ఇరాన్ మరియు ఇరాక్ దేశాలకు వెళ్లేందుకు తగిన తోడ్పాటును అందించారు. ఈ యుద్ధంలో భారత సైనికుల శౌర్యం నాలుగు వేలకు పైగా పురస్కారంతో గుర్తించబడింది. ఇందులో 18 విక్టోరియా మరియు జార్జ్ క్రాస్ అవార్డులు కూడా ఉన్నాయి. దీనికి తోడుగా అప్పటి సోవియట్ యూనియన్ భారత సాయుధ దళాల శౌర్యాన్ని మెచ్చుకుంది. 23 మే 1944 డిక్రీ ద్వారా, యుఎస్ఎస్ఆర్ యొక్క సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం మిఖాయిల్ కాలినిన్ మరియు అలెగ్జాండర్ గోర్కిన్ సంతకం చేసిన ప్రతిష్టాత్మక ఆర్డర్స్
ఆఫ్ ది రెడ్ స్టార్‌ను ఇండియన్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ యొక్క సుబేదార్ నారాయణన్ రావు నిక్కం, హవాల్దార్ గజేంద్ర సింగ్ చాంద్‌లకు ప్రదానం చేశారు. విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనే కవాతు బృందానికి సిక్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ యొక్క ప్రధాన ర్యాంక్ అధికారి నాయకత్వం వహిస్తారు. రెజిమెంట్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతో శౌర్యంతో పోరాడింది మరియు ఇతర శౌర్య పురస్కారాలలో దాదాపు నాలుగు బాటిల్ హానర్స్, రెండు మిలిటరీ క్రాస్లను సంపాదించడం గర్వ కారణం.
***
(Release ID: 1632745)
Visitor Counter : 225