ఆర్థిక సంఘం

జలశక్తి మంత్రిత్వ శాఖతో ఆర్థిక సంఘం సమావేశం తాగునీరు, పారిశుద్ధ్య సేవలకు సహాయంపై చర్చ

Posted On: 17 JUN 2020 6:04PM by PIB Hyderabad

  గ్రామీణ స్థానిక సంస్థలకు తాగునీరు, పారిశుద్ధ్య సేవల కల్పనకోసం ఇవ్వాల్సిన సహాయంపై 15 ఆర్థిక సంఘం చైర్మన్, ఎన్.కె. సింగ్, ఆర్థిక సంఘం సభ్యులు రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్, తదితర అధికార బృందంతో సమావేశం జరిపారు

పంచాయతీలు, మున్సిపాలిటీలకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు వీలుగా రాష్ట్ర ఏకీకృత నిధిని బలోపేతం చేసే చర్యలు ఆవశ్యకమని, సంబంధిత రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రాతిపదికన ప్రక్రియ జరగాలని కేంద్ర ఆర్థిక సంఘం సూచిస్తోందిస్థానిక సంస్థలకు గ్రాంట్లపై 2020-21 సంవత్సరానికి సమర్పించిన తన నివేదిక, సిఫార్సులనే 2020-21నుంచి 2025-26 సంవత్సరం వరకూ వర్తింపజేయవచ్చా?, లేక  సదరు సిఫార్సులకు సవరణలేమైనా అవసరమవుతాయా? అన్నది తాను తెలుసుకోదలిచినట్టు ఆర్థిక సంఘం సమావేశంలో పేర్కొంది. దాదాపు రెండున్నర లక్షల పంచాయతీ రాజ్ సంస్థల్లో ఒకే విధమైన తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయనివాటి పరిష్కారానికి, పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సహా,..పంచాయతీ రాజ్, జలశక్తి మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని 15 ఆర్థిక సంఘం అభిప్రాయపడింది.

   గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య సేవలను కల్పనకు సంబంధించి 15 ఆర్థికసంఘం గ్రాంట్లను సమర్థంగా వినియోగించుకునే అంశంపై  పంచాయతీ రాజ్, జలశక్తి మంత్రిత్వ శాఖలు ఏడాది మార్చి 17 అన్ని రాష్ట్రాలకు ఉమ్మడి లేఖ రాశాయినీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశంగా 15 ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరపు తన మధ్యంతర నివేదికలో గుర్తించినట్టు లేఖలో రెండు మంత్రిత్వశాఖలు ప్రధానంగా ప్రస్తావించాయి. నివేదికను అనుసరించి,..60,750కోట్ల రూపాయల్లో 50శాతం నిధులు,..అంటే, 30,375 కోట్ల రూపాయలను గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు  గ్రాంటుగా కేటాయించారు. మొదటగా,.. స్థానిక సంస్థల పారిశుద్ధ్య నిర్వహణకు, బహిరంగ మలవిసర్జన రహిత స్థితిని కొనసాగించేందుకురెండవ పథకంగా తాగునీటి సరఫరా, వర్షపునీటి పొదుపు, నీటి రీసైక్లింగ్ వంటివాటి నిర్వహణకు గ్రాంట్లు కేటాయించారు. మంజూరైన గ్రాంట్లలో సగానికి సమానమైన నిధులచొప్పున రెండింటికీ పంచాయతీ రాజ్ సంస్థలు నిధులు కేటాయించవలసి ఉంటుంది. అయితే,..ఇందులో ఒక కేటగిరీకి చెందిన పనులను  ఏదైనా గ్రామపంచాయతీ సంతృప్త స్థాయిలో నెరవేర్చగలిగితే సదరు గ్రామ పంచాయతీ నిధులను మిగిలిన కేటగిరీ పనులకు వినియోగించుకోవచ్చని లేఖ పేర్కొంది. కాగా, తాగునీరు, పారిశుద్ధ్య సేవలకోసం 15 ఆర్థిక సంఘం గ్రాంట్లను వినియోగించుకునేటపుడు జలజీవన్ మిషన్, గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, విషయాన్ని అన్ని పంచాయతీ రాజ్ సంస్థల దృష్టికి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి లేఖలో కోరారు.

  జలజీవన్ మిష్ పథకం కింద చేపట్టిన పనులను గురించి ఆర్థిక సంఘానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాజా అద్యయన పత్రాన్ని సమర్పించింది. ఇప్పటివరకూ వివిధ పనులకు అందిన ఆర్థిక సంఘం నిధులను గురించి తన పత్రంలో వివరించింది.

        జలజీవన్ మిషన్ కార్యక్రమ లక్ష్యాలను సాధించండంలో కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి అనంతరం నెలకొన్న సవాళ్లను కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రధానంగా ప్రస్తావించింది. తాగునీటి భద్రత కల్పించాలన్న లక్ష్య సాధనకు నీటి ఎద్దడి ప్రాంతాల్లో, నీటి నాణ్యతత సరిగాలేని ప్రాంతాల్లో చేపట్టవలసిన పథకాలను కూడా ప్రస్తావించింది

    తాగునీరు, పారిశుద్ధ్య సేవలకు సంబంధించి పంచాయతీ రాజ్ సంస్థలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, తాగునీటి భద్రతకు సంబంధించి పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలకు, పంచాయతీ రాజ్ సంస్థలకు ఇవ్వాల్సిన గ్రాంట్లపై జలశక్తి మంత్రిత్వశాఖ అనేక సూచనలు చేసింది. తాగనీటి భద్రతా లక్ష్యాన్ని సాధించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం తమకు దాదాపు 82వేల కోట్ల రూపాయలు అవసరమని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

        నేపథ్యంలో,..తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలకు పూర్తిస్థాయిలో కమిషన్ మద్దతు ఇస్తుందని ఆర్థిక సంఘం చైర్మన్ సమావేశంలో హామీ ఇచ్చారు. 20221-22 సంవత్సరంనుంచి 2025-26 సంవత్సరం వరకూ,..అంటే రానున్న ఐదేళ్ల కాలానికి సమర్పించే తమ తుది నివేదికలో కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చైర్మన్ స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి, ఆయన అధికార బృందం చేసిన సూచనలను,. సిఫార్సుల రూపకల్పనలో సాధ్యమైనంతవరకూ పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆర్థిక సంఘం చైర్మన్ హామీ ఇచ్చారు.

         ***



(Release ID: 1632215) Visitor Counter : 204