రక్షణ మంత్రిత్వ శాఖ
ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో, కోర్సు పరిపూర్తి ఉత్సవం
Posted On:
13 JUN 2020 6:47PM by PIB Hyderabad
ఎజిమల లోని ఇండియన్ నావల్ అకాడమీలో 2020 జూన్ 13న జరిగిన కోర్సు పరిపూర్తి ఉత్పవానికి, ఈ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న 259 మంది హాజరయ్యారు. మామూలుగా నిర్వహించే పాసింగ్ అవుట్ పెరేడ్‌కు బదులుగా దీనిని నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
కోర్సు పూర్తి చేసుకున్న అనంతరం నిర్వహించే పాసింగ్ అవుట్ పెరేడ్ (పిఒపి)ని, ఏ సాయుధ బలగాల అకాడమీలో అయినా ఎంతో గొప్పగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, అతిథులు, ప్రముఖుల హాజరౌతారు. అయితే కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో కోర్సు పూర్తి చేసిన వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ పాటించడానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఎక్కువమంది ఒక చోట గుమికూడకుండా చూసేందుకు ఈ కార్యక్రమానికి ప్రజలు, తల్లిదండ్రులు, అతిథులను ఆహ్వానించలేదు.
ఈ ఉత్సవంలో మిడ్‌షిప్‌మెన్, ఇండియన్ నేవీ కేడెట్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, 98వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్సు బిటెక్, 98 వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు -ఎంఎస్సీ, 29 వ నావల్ ఓరియంటేషన్ కోర్సు (ఎక్స్ టెండెడ్), 30 వ నావల్ ఓరియంటేషన్ కోర్సు (రెగ్యులర్) కు చెందిన కోర్సు పూర్తయినవారు పాల్గొన్నారు. స్నేహపూర్వక దేశాల నుంచి ఏడుగురు ఈ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో శ్రీలంక మయన్మార్ల నుంచి ఇద్దరు వంతున, మాల్దీవులు, టాంజానియా,సియాచెల్లిస్‌నుంచి ఒకరి వంతున శిక్షణ పూర్తి చేసుకున్నారు.
వైస్ అడ్మిరల్ అనిల్ కుమార్ చావ్లా, పివిఎస్ఎం, ఎవిఎస్ఎం, ఎన్ఎం, విఎస్ఎం, ఎడిసి, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీప్, సదరన్ నావల్ కమాండ్, ఈ ఉత్సవానికి రివ్యూఇంగ్ అధికారి , శిక్షణలో ప్రతిభకనబరచిన తొమ్మిదిమందికి పతకాలు బహుకరించారు. వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎవిఎస్ఎం, ఎన్.ఎం, కమాండంట్, ఇండియన్ నావల్ అకాడమీ ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. రివ్యూయింగ్ అధికారి తమ ప్రసంగంలో ఆయా కోర్సులను పూర్తి చేసుకున్న వారిని అభినందించారు. భారతీయ నౌకాదళ కీలక విలువలైన విధినిర్వహణ, గౌరవం, ధైర్యసాహసాలను అందిపుచ్చుకోవలసిందిగా ఆయన వారికి సూచించారు. తమ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పోరాట పటిమను మాత్రం కోల్పోవద్దని ఆయన వారికి సూచించారు.
ఇండియన్ నావల్ అకాడమీ బిటెక్ కోర్సుకు సంబంధించిన ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ ను మిడ్‌షిప్‌మెన్ సుశీల్ సింగ్‌కు ప్రదానం చేశారు. నావల్ ఓరియంటేషన్ కోర్సు (ఎక్స్‌టెండెడ్)కు సంబంధించిన ఛీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ గోల్డ్ మెడల్‌ను కేడెట్ భవ్య గుజ్రాల్‌కు ప్రదానం చేశారు. నావల్ ఓరియంటేషన్ (రెగ్యులర్ ) కోర్సుకు ఛీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ గోల్డ్ మెడల్‌ను కేడెట్ విపుల్ భరద్వాజ్ కు కేటాయించారు. ఉత్తమ మహిళా కేడెట్‌కు ప్రదానం చేసే జమోరిన్ ట్రోఫీని, కేడెట్ రాజ్యశర్మకు ప్రదానం చేశారు.
ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్ఎ) ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ లకు, అలాగే స్నేహపూర్వక దేశాలవారికి నౌకాదళ శిక్షణనిచ్చి వారిని అత్యుత్తమంగా తీర్చదిద్దడంలో 50 సంవత్సరాల అద్బుత కృషి చేసినందుకు 2019లో ఈ సంస్థకు ప్రెసిడెంట్స్‌కలర్స్‌ను బహుకరించారు. 2009లో ఎజిమలలో నావల్ అకాడమీని ఏర్పాటు చేసినప్పటి నుంచి సంప్రదాయ మార్చ్‌ఫాస్ట్ లేకుండా ఒక బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకుంటుండడం ఇదే మొదటి సారి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దేశంలో లాక్‌డౌన్ విధించడం, దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత వంటి పరిస్థితులలో ఐఎన్ఎ శిక్షణ వ్యవస్థలోనూ 2020 మార్చి 24 నుంచి తగిన మార్పులు తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, కేరళ ప్రభుత్వ ఆదేశాలు, నౌకాదళ కేంద్ర కార్యాలయ ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్పుల చేశారు. తొలుత శిక్షణను ఆన్‌లైన్ అసైన్‌మెంట్ ద్వారా ఇచ్చారు. ఆ తర్వాత శిక్షణ పొందుతున్న వారి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా తరగతి గదిలోనూ , పరీక్షా కేంద్రంలోనూ ఏర్పాట్లు చేశారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గట్టి ముందస్తు జాగ్రత్త చర్యలను అకాడమీ చేపట్టింది. ఫలితంగా కోవిడ్ సవాలును ఎదుర్కొంటూ 900 మంది కేడెట్లు శిక్షణ పొందగలుగుతున్నారు. ఐఎన్ఎలో ఎలాంటి కోవిడ్ -19 కేసులు లేకుండా ప్రస్తుత బ్యాచ్ విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకుంది..
***
(Release ID: 1631451)
Visitor Counter : 272