శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉమ్మడి విధానం, మెరుగైన పద్థతులను ప్రోత్సహించేందుకు సంయుక్త సైన్స్ కమ్యూనికేషన్ ఫోరమ్‌ను ఏర్పాటు చేసిన డిఎస్‌టి.
Posted On:
11 JUN 2020 3:56PM by PIB Hyderabad
సైన్స్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన వివిధ సంస్థలు,ఏజెన్సీల మధ్య సమన్వయం, సహకారం, పరస్పర సంబంధాలకు వీలుకల్పించేందుకు డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్.టి)ఒక సంయుక్త సైన్స్ కమ్యూనికేషన్ ఫోరమ్‌ను ఏర్పాటు చేసింది.
వివిధ సంస్థలు సైన్స్ కమ్యూనికేషన్ రంగంలో సాగిస్తున్న కృషిని ఈ ఫోరమ్ ఒక చోటికి చేర్చడమే కాకుండా , విస్తృత ప్రాతిపదికన ఈ రంగంలో ఉమ్మడి విధానాన్ని చేపట్టేందుకు, మెరుగైన పద్దతులను చేపట్టడానికి ఇది సహకరించనుంది. అంతిమంగా ఇది జాతీయ సైన్స్ కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యంగా పనిచేస్తుంది.
వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, రక్షణ, అంతరిక్ష , అణుశక్తి, సమాచార ప్రసార, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలకు చెందిన సీనియర్ అధికారులుఇందులో ఉంటారు.
దేశంలో ఆత్మ నిర్భర భారత్ కు అనువైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ఇది పనిచేస్తుంది. నూతన ఆవిష్కరణలకు దోహదపడే సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పట్ల ఆసక్తిని, చైతన్యాన్ని పెంపొందించేందుకు ఇది కృషి చేస్తుంది. అలాగే దేశంలో స్థూల , సూక్ష్మ స్థాయిలలో సైన్స్ కమ్యూనికేషన్ కార్యక్రమాల ప్రణాళికా రచన, అమలుకు వ్యూహాలను రూపొందించేందుకు ఈ ఫోరం పనిచేస్తుందని సైన్స్, టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలిపారు.
ఈ ఫోరం,డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్‌సిఎస్‌టిసి) సెక్రటేరియట్ ద్వారా పనిచేస్తుంది. దేశంలో సైన్స్ కమ్యూనికేషన్ కుసంబంధించిన వివిధ సంస్థలు, వాటి కార్యక్రమాలు, కార్యకలాపాల సమన్వయానికి దీనికి అధికారం కల్పించడం జరిగింది. అలాగే శాస్త్రీయ దృక్పథం తో సైన్స్ పట్ల ప్రజల అవగాహనను మరింత పెంచే దిశగా కృషి చేయడం దీని విధి.దీనికి తోడు దేశంలో సైన్స్ కమ్యూనికేషన్‌కు సంబంధించి దేశ వ్యాప్త కార్యకలాపాలు, విధానాలు, కార్యక్రమాలను ప్రజలలో విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళడం దీని బాధ్యత.
సైన్స్ కమ్యూనికేషన్ రంగంలో ఇండియాకు అద్భుతమైన వ్యవస్థాపరమైన నిర్మాణం ఉంది. సైన్స్ కమ్యూనికేషన్ పురోభివృద్ధి , ప్రగతికి సంబంధించి కనీసం ఐదు జాతీయ స్థాయి సంస్థలు పనిచేస్తున్నాయి. అవి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్, ఇన్‌ఫర్మేషన్ రిసోర్సెస్ (1951) , హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (1974), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (1978), నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ కమ్యూనికేషన్(1982), విజ్ఞాన్ ప్రసార్ (1989). వీటికి తోడు వివిధ సైంటిఫిక్ సంస్థలకు స్వంతంగా సైన్స్ కమ్యూనికేషన్ విభాగాలు ఉన్నాయి. అందులో కొన్ని, యూనిట్ ఫర్ సైన్స్ డిస్సెమినేషన్ (సిఎస్ఐఆర్), డైరక్టరేట్ ఆఫ్ నాలడ్జ్ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్ (ఐసిఎఆర్), పబ్లికేషన్, ఇన్ఫర్మేషన్ డివిజన్ (ఐసిఎంఆర్), డైరక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్‌ఫేస్ (డిఆర్‌డిఒ), పబ్లిక్ అవేర్‌నెస్ డివిజన్ (డిఎఇ), ఆఫీస్ ఆఫ్ మీడియా , పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్ ఆర్ ఒ),సైన్స్ సెల్స్ (ఎఐఆర్) విభాగాలు . దాదాపు అన్ని జాతీయ స్థాయి ప్రయోగశాలలు, సైంటిఫిక్ సంస్థలకు సైన్స్ కమ్యూనికేషన్‌కు సంబంధించి, ప్రజలకు సమాచారాన్ని అందించడానికి సంబంధించి సంస్థాపరంగా తగిన యంత్రాంగం ఉంది.
ఈ సంస్థలు వివిధ పద్ధతులు, మార్గాలను అనుసరించి సైన్స్ కమ్యూనికేషన్ ను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి, వారికి చేరువ కావడానికి దోహదపడుతున్నాయి. అయితే , ఈ రంగంలో ఉమ్మడి విధానాల రూపకల్పనకు , మరింత విస్తృత స్థాయిలో మెరుగైన విధానాలను అనుసరించడానికి అవసరమైన సంప్రదింపులు, సమన్వయానికి మరింత అవకాశం ఉందని గుర్తించడం జరిగింది. దేశ వ్యాప్తంగా సమష్టిగా , ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించి , వాటిని సంయుక్తంగా అమలు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకు అనుగుణంగా ఒక జాతీయ సైన్స్ కమ్యూనికేషన్ ఫ్రేమ్ వర్క్ రూపుదిద్దుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పబ్లిక్ కమ్యూనికేషన్, ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన చైతన్యాన్ని కల్పించేందుకు వివిధ భాగస్వామ్య సంస్థల మధ్య పరస్పర సహకారం, సంప్రదింపులు ,సమన్వయం అవసరం. ఇది మెరుగైన ప్రణాళిక, విధాన రూపకల్పన , దేశంలో పెద్ద ఎత్తున సైన్స్ కమ్యూనికేషన్ అమలుకు దోహదపడుతుంది.
(మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి, డాక్టర్ మనోజ్ కుమార్ పటాయిరియా, అడ్వయిజర్, హెడ్, ఎన్‌సిఎస్‌టిసి, mkp[at]nic[dot]in, మెబైల్ నెం:9868114548)
(Release ID: 1630935)
Visitor Counter : 236