శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎస్టిఐపి 2020 సచివాలయ బృందంతో భేటీ అయిన డిఎస్టి కార్యదర్శి

"విధానంలో జ్ఞాన ఉత్పత్తి మరియు జ్ఞాన వినియోగ వ్యవస్థల మధ్య చాలా పరస్పర సంబంధం ఉంది. వీటిని విధానంలో ఏకీకృతం చేయాలి ”: ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

Posted On: 10 JUN 2020 7:32PM by PIB Hyderabad

సైన్స్ & టెక్నాలజీ విభాగం (డిఎస్టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, ఎస్టిఐపి 2020 సెక్రటేరియట్ తో  పాలసీ ఫెలోస్, డిఎస్టి అధికారులు, పిఎస్ఎ అధికారులతో సంభాషించారు.  ఎస్టిఐపి 2020 సూత్రీకరణ ప్రక్రియలో పాల్గొన్న వారి సిఫారసుల కోసం మేధావులను ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. . విధాన రూపకల్పన ప్రక్రియలో జ్ఞాన ఉత్పత్తి మరియు జ్ఞాన వినియోగ వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానం మరియు వివిధ రంగాలకు, కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల మధ్య అనుసంధానంపై దృష్టి పెట్టాలని అన్నారు. 

"టిఫాక్, పాలసీ రీసెర్చ్ సెంటర్లు, సిఐఐ, ఫిక్కీ వంటి పరిశ్రమ సంస్థలు ఇప్పటికే సైన్స్ పాలసీకి సంబంధించిన అనేక సమస్యల గురించి అధ్యయనం చేసి ఆలోచించాయి, మేము వారి నుండి బాగా పరిగణలోకి తీసుకోగలిగే సిఫార్సులను ఆహ్వానించగలము. అంతేకాకుండా, 21 నేపథ్య సమూహాలలో సైన్స్ అనేక రంగాలను కలిగి ఉంది, వివిధ రంగాల మధ్య సంబంధాలు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్, సాంప్రదాయ రంగాల వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న సైన్స్ రంగాలున్నాయి. అలాగే, పాలసీలో జ్ఞాన ఉత్పత్తి మరియు జ్ఞాన వినియోగ వ్యవస్థల మధ్య చాలా పరస్పర సంబంధం ఉంది. వీటిని విధానంలో ఏకీకృతం చేయాలి ” అని ప్రొఫెసర్ శర్మ ఇంటరాక్టివ్ సెషన్లలో అన్నారు.

విధాన రూపకల్పన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న యువ సభ్యులను ఆయన ప్రోత్సహించారు. వారి శక్తి, ఉత్సాహం సీనియర్ల తెలివితో కలిపి ఈ ప్రక్రియను విజయవంతమైన వికేంద్రీకృత, సమగ్రమైనదిగా మారుస్తుందని ఆయన అన్నారు.

ఎస్టిఐపి 2020 సూత్రీకరణ ప్రక్రియ 4 అత్యంత అనుసంధానించబడిన ట్రాక్‌లుగా నిర్వహిస్తున్నారు: ట్రాక్ I సైన్స్ పాలసీ ఫోరం ద్వారా విస్తృతమైన ప్రజా మరియు నిపుణుల సంప్రదింపుల ప్రక్రియను కలిగి ఉంటుంది. ట్రాక్ II విధాన ముసాయిదా ప్రక్రియలో అధరాలు గల -సమాచారం సిఫారసులను అందించడానికి నిపుణులచే నడిచే నేపథ్య సంప్రదింపులను కలిగి ఉంటుంది. ఇందుకోసం ఇరవై ఒకటి (21) ఫోకస్ చేసిన నేపథ్య సమూహాలను ఏర్పాటు చేశారు. ట్రాక్ III లో మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలతో సంప్రదింపులు ఉంటాయి, ట్రాక్ IV అత్యున్నత స్థాయి బహుళ-భాగస్వామ్యుల సంప్రదింపులను కలిగి ఉంటుంది.

నాలుగు ట్రాక్‌ల మధ్య పూర్తి ప్రక్రియను సమన్వయం చేయడానికి డిఎస్‌టి-ఎస్‌టిఐ పాలసీ ఫెలోస్ క్యాడర్‌తో నిర్మించిన అంతర్గత పాలసీ పరిజ్ఞానం, డేటా సపోర్ట్ యూనిట్‌తో కూడిన సెక్రటేరియట్ డిఎస్‌టి (టెక్నాలజీ భవన్) వద్ద ఏర్పాటయింది.

సమాలోచనలు జరిగిన ఈ సెషన్లో, డిఎస్టి - ఎస్టిఐ  పాలసీ సభ్యులు, డిఎస్టి అధికారులు, పిఎస్ఐ కార్యాలయం నుండి అధికారులు, పాలసీ కోఆర్డినేషన్,  ప్రోగ్రామ్ మానిటరింగ్ విభాగం అధిపతి డాక్టర్ అఖిలేష్ గుప్తా, విధాన రూపకల్పన ప్రక్రియను చర్చించారు. విభాగాలు, మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, సామాజిక-ఆర్థిక మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు /యుటిలు దీనిలో ఉన్నాయి. ఎస్టిఐపి 2020 సూత్రీకరణ ప్రక్రియ విభిన్న ట్రాక్‌ల ప్రారంభానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి పరస్పర చర్య సహాయపడుతుంది.

*****



(Release ID: 1630805) Visitor Counter : 173