రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
యువతకు వివిధ వాణిజ్యాంశాలలో శిక్షణ ఇవ్వడానికి ఐటీఐలతో ఎన్ఎఫ్ఎల్ జట్టు
Posted On:
10 JUN 2020 11:53AM by PIB Hyderabad
భారత ప్రభుత్వపు "స్కిల్ ఇండియా" చొరవకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో కేంద్ర ఎరువుల శాఖ ఆధ్వర్యంలో పని చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' (ఎన్ఎఫ్ఎల్) వివిధ అంశాలపై యువతకు శిక్షణను ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్లాంట్లకు సమీపంలో ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థలతో (ఐటీఐ) ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యువతకు భారీ మరియు ప్రాసెస్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటుగా వివిధ వర్తకపు అంశాలపై వారికి శిక్షణను ఇవ్వనున్నారు. కంపెనీకి చెందిన నంగల్ ప్లాంట్ 12 రకాల 12 ట్రేడ్స్‌లో యువతకు శిక్షణ ఇవ్వడానికి నంగల్‌లోని ఐటీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 'డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ స్కీమ్' కింద వీరికి నైపుణ్యతను పెంపొందించనున్నారు. దీని కింద యువత్ ఇన్‌స్టిట్యూట్‌లో సైద్ధాంతిక నైపుణ్యాలు మరియు ఎన్ఎఫ్ఎల్ నంగల్ ప్లాంట్‌లో ఉద్యోగ శిక్షణను పొందగలుగుతారు. ఈ శిక్షణకు సంబంధించి ఎన్‌ఎఫ్‌ఎల్ నంగల్ యూనిట్ డీపీఎం (హెచ్ఆర్) ఐ/సీ మిస్ రేణు ఆర్ పీ సింగ్ మరియు నంగల్‌లోని ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీ లలిత్ మోహన్ మధ్య ఈ అవగాహన ఒప్పందం జరిగింది. నంగల్‌లోని ఐటీఐ పంజాబ్‌లో పురాతన సంస్థ. ఐటీఐతో ఈ అవగాహన ఒప్పందం మూలంగా పంజాబ్ రాష్ట్రంలో ఈ చొరవ తీసుకున్న మొదటి సీపీఎస్ఈ సంస్థగా ఎన్ఎఫ్ఎల్ నిలువనుంది. వివిధ ఇన్‌స్టిట్యూట్స్ నుండి ఎక్కువ మంది యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్కిల్ ఇండియాకు ప్రేరణనిచ్చేందుకు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఎంపికలను అన్వేషించాలని కంపెనీ యోచిస్తోంది. ఎన్ఎఫ్ఎల్ ఐదు గ్యాస్ ఆధారిత అమ్మోనియా-యూరియా ప్లాంటులను
కలిగి ఉంది. పంజాబ్‌లోని నంగల్ & బతిండా ప్లాంట్లు, హర్యానాలోని పానిపట్ ప్లాంట్ మరియు మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా విజయపూర్ వద్ద రెండు ప్లాంట్లను సంస్థ కలిగి ఉంది.
(Release ID: 1630676)
Visitor Counter : 248