మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ సమక్షంలో అన్ని ఎన్.సి.ఈ.ఆర్.టి. టీవీ ఛానళ్లలో 1 నుంచి 12వ తరగతి వరకూ ఈ లెర్నింగ్ కంటెంట్ ప్రసారం కోసం అవగాహన ఒప్పందపై డిజిటల్ సంతకం చేసిన ఎన్.సి.ఈ.ఆర్.టి మరియు రోటరీ ఇండియా

· ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థుల చెంతకు నాణ్యమైన విద్య మరింత సమర్థవంతంగా చేరుతుందని తెలిపిన శ్రీ నిశాంక్.

Posted On: 09 JUN 2020 5:42PM by PIB Hyderabad

ఈ లెర్నింగ్ ను మరింత నిర్మాణాత్మకంగా మార్చేందుకు ఎన్.సి.ఈ.ఆర్.టి. మరియు రోటరీ ఇండియా ఈ రోజు న్యూఢిల్లీలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ సమక్షంలో అన్ని ఎన్.సి.ఈ.ఆర్.టి. టీవీ ఛానళ్ళలో 1 నుంచి 12వ తరగతుల వరకూ ఈ –లెహ్నింగ్ కంటెంట్ టెలికాస్ట్ కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. డిజిటల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీమతి అనిత కార్వాల్ హాజరయ్యారు.

ఎన్.సి.ఈ.ఆర్.టి మరియు రోటరీ క్లబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు ప్రకటించడం సంతోషదాయకమని కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 నేపథ్యంలో రోటరీ ఇండియా హ్యుమానిటీ ఫౌండేషన్ మరియు ఎన్.సి.ఈ.ఆర్.టి. సహాకారంతో ఎం.హెచ్.ఆర్.డి. మార్గదర్శకత్వం మరియు సహకారంతో ఎన్.సి.ఈ.ఆర్.టి. ఆమోదించిన పాఠాలను దేశవ్యాప్తంగా ఈ-లెర్నింగ్ పిల్లలకు చేరేలా చూస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

https://twitter.com/DrRPNishank/status/1270307685645168645?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1270307685645168645&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1630476  

విద్యా దాన్ 2.0 కింద రోటరీ ఇంటర్నేషనల్ 1 నుంచి 12 తరగతుల వరకూ అన్ని పాఠ్యాంశాలను ఎన్.సి.ఈ.ఆర్.టి.కి హిందీ భాషలో ఈ-కంటెంట్ అందిస్తారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీ నిశాంక్ తెలిపారు. అంతే కాకుండా ఈ ప్రయత్నం చాలా ఉన్నతమైనది మరియు నాణ్యమైనదని, ఇది పిల్లలందరికీ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ తో కలిసి ప్రత్యేక అవసరాల ఉన్న పిల్లలకు అవసరమైన సామగ్రిని అందజేయడమే గాక, వయోజన అక్షరాస్యత మిషన్ కు పూర్తి సహకారం అందిస్తామని శ్రీ నిశాంక్ తెలిపారు. వారు ఉపాధ్యాయ శిక్షణ (వృత్తి పరమైన అభివృద్ధితో సహా) కంటెంట్ ను కూడా అందిస్తారని తెలిపారు.

మార్చి 2020 లో కోవిడ్ -19 ను మహమ్మారిగా ప్రకటించిన నాటి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే గాక మొత్తం విద్యా సమాజం తీవ్రంగా ప్రభావితమైందన్న కేంద్ర మంత్రి, ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల సహాయంతో భారతీయ ధర్మంతో పాటు బలమైన పునాదులుగా నిలిచిన ఉత్తమ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని శ్రీ నిశాంక్ తెలిపారు.

ఆపరేషన్ డిజిటల్ బోర్డ్, దీక్షా, ఈ-పాఠశాల, స్వయం, స్వయం ప్రభ వంటి వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ద్వారా విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి, విద్యలో ఆవిష్కరణ మరియు డిజిటలైజేషన్ ను బలోపేతం చేసేందుకు ఎం.హెచ్.ఆర్.డి. కృషి చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందరికీ ఈ –లెర్నింగ్, కచ్చితమైన మరియు నవీనీకరించిన పాఠ్య సామగ్రిని రూపొందించడం మరియు అభ్యాస విధానాన్ని మెరుగు పరచటం మీద దృష్టి సారించిందని, తద్వారా విద్యార్థులు ఇంట్లో ఉంటూనే నాణ్యమైన విద్యను పొందగలరని తెలిపారు. ఈ-లెర్నింగ్ ద్వారా ఒకే దేశం – ఒకే డిజిటల్ ప్లాట్ ఫామ్ అనే ప్రధాని క్రాంతదర్శనం దిశగా ముందు వెళ్ళాలని కోరుతున్నట్లు మంత్రి తెలిపారు.

ఇంటర్నెట్ లేదా మొబైల్ అనుసంధానం అందుబాటులో లేని విద్యార్థులను రేడియో మరియు టీవీ ద్వారా చేరుకోవాలని సంకల్పించినట్లు తెలిపిన ఆయన, ఈ మార్గంలో ప్రస్తుతం జరిగిన అవగాహన ఒప్పందం ఓ కీలక ఘట్టం అని శ్రీ నిశాంక్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా నాణ్యమైన విద్య విద్యార్థులకు మరింత సమర్థవంతంగా చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

1 నుంచి 12 తరగతుల వరకూ నాణ్యమైన ఈ –లెర్నింగ్ బోధన సామగ్రిని వివిధ భాషల్లో అందించడంలో చేసిన కృషికి గాను రోటరీ ఇండియా హ్యమానిటీ ఫౌండేషన్ కు ఎస్.ఈ అండ్ ఎల్ కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్ ధన్యవాదాలు తెలిపారు.

ఎన్.సి.ఈ.ఆర్.టి, రోటరీ ఇండియా హ్యమానిటీ ఫౌండేషన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం మీద ఎన్.సి.ఈ.ఆర్.టి. డైరక్టర్ ప్రొఫెసర్ హృషి కేశ్ సేనాపతి, ఎన్.సి.ఈ.ఆర్.టి. జాయింట్ డైరక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర బెహరా లతో పాటు రోటరీ ఇండియా తరుఫున రోటరీ ఇండియా వాటర్ మిషన్ డైరక్టర్ శ్రీ రంజన్ ధింగ్రా సంతకాలు చేశారు.

2019-21 రోటరీ ఇంటర్నేషనల్ డెరక్టర్ శ్రీ కమల్ సంఘ్వీ ఈ ఒప్పంద వివరాలను తెలియజేశారు.

ఇందులోని అంశాల విషయానికి వస్తే......

·        ఎన్.సి.ఈ.ఆర్.టి. టీవీ ఒప్పందం : జులై 2020 నుంచి అందుబాటులో ఉండటానికి ఎన్.సి.ఈ.ఆర్.టి. పన్నెండు జాతీయ టెలివిజన్ ఛానెళ్ళ ద్వారా 1 నుంచి 12 తరగతలు పాఠ్యప్రణాళికి మాడ్యుల్స్ ప్రసారం చేయడం జరుగుతుంది. (వారి పాఠ్యాంశాల ప్రకారం ఎన్.సి.ఈ.ఆర్.టి. దీన్ని పరిశీలించాల్సి ఉంది)

·        దీక్షా యాప్ ఒప్పందం : ఈ – లెర్నింగ్ మాడ్యూల్స్ అదే సమయంలో భారత ప్రభుత్వ జాతీయ అనువర్తనం దీక్షా ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ కంటెంట్ ప్రస్తుతం హిందీ (మరియు పంజాబీ)లో అందుబాటులు ది. అదే విధంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాఠశాలల్లోని 10 కోట్ల మంది విద్యార్థుల కోసం వెంటనే అమలు చేయబడుతుంది. కంటెంట్ మేధోహక్కులను రోటరీ కలిగి ఉండడమే గాక, ఎన్.సి.ఈ.ఆర్.టి.కి అందించటం జరుగుతుంది. తద్వారా ఈ కంటెంట్ ను అన్ని ప్రాంతీయ భాషలకు ఎన్.సి.ఈ.ఆర్.టి. మరియు సంబంధిత రాష్ట్ర ఎస్.సి.ఈ.ఆర్.టి. లు రాబోయే కొద్ది నెలల్లో అనువదించవచ్చు.

రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2021-22 శ్రీ శేఖర్ మెహతా మాట్లాడుతూ, రోటరీ 1 నుంచి 12 తరగతులు ఈ –లెర్నింగ్ కంటెంట్ ను వివిధ భాగస్వాముల ద్వారా సేకరించిందని, వారి పాఠశాల పాఠ్యాంశాలకు సంబంధించిన గృహ ఆధారిత బోధ పరిష్కారంగా దేశానికి ఉచితంగా అందించేందుకు వారు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ – లెర్నింగ్ లో రోటరీకి విస్తారమైన అనుభవం ఉందని, ఈ లెర్నింగ్ సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేరు గత 5 సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 30 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలకు అందించినట్లు వివరించారు. 

 

***



(Release ID: 1630546) Visitor Counter : 239