గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్ ప‌‌థ‌కానికి రూ.1,01,500 కోట్ల నిధుల కేటాయింపు

- 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'కు గాను 2020-21 ఏడాదిలో ఇప్పటికే రూ.31,493 కోట్ల మేర నిధుల‌ విడుద‌ల
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6.69 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఉపాధి పనులు
- మే నెల‌లో రోజుకు స‌గ‌టున ఉపాధి ప‌నులు క‌ల్పించ‌బ‌డిన వ్య‌క్తుల సంఖ్య 2.51 కోట్లు
- గ‌తేడాది మే నెల‌లో క‌ల్పించ‌బ‌డిన స‌గ‌టు ఉపాధి ప‌నుల సంఖ్య కంటే ఇది 73 శాతం మేర అధికం
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల పనులు పూర్తయ్యాయి
- నీటి సంరక్షణ మరియు నీటిపారుదల, మొక్క‌ల‌ పెంపకం, ఉద్యానవనం మరియు జీవనోపాధి ప్రోత్సాహం కోసం వ్యక్తిగత లబ్ధిదారుల పనులపై దృష్టి సారిస్తూ ఉపాధి ప‌నులు

Posted On: 08 JUN 2020 9:28PM by PIB Hyderabad

ప్రస్తుత 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ప్ర‌భుత్వం 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' (ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్) ప‌థ‌కానికి గాను రూ.1,01,500 కోట్ల నిధుల‌ను
కేటాయించింది. ఈ కార్య‌క్ర‌మం కింద ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిపిన అత్య‌ధిక నిధుల కేటాయింపు ఇదే.
2020-2021లో ఇప్పటి వ‌ర‌కు రూ.31,493 కోట్ల మేర నిధుల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు.
ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలో 50 శాతం కంటే ఎక్కువ. ఇప్పటి వరకు మొత్తం 60.80 కోట్ల వ్యక్తి ప‌ని దినాలు సృష్టించబడ్డాయి. దీని ద్వారా 6.69 కోట్ల మందికి ఉపాధి పనులు క‌ల్పించ‌బ‌డ్డాయి. ఈ ఏడాది మే నెల‌లో రోజుకు స‌గ‌టున ప‌ని క‌ల్పించ‌బ‌డిన వ్య‌క్తుల సంఖ్య 2.51 కోట్లుగా నిలిచింది. ఇది గత ఏడాది మే నెల‌లో రోజుకు స‌గ‌టున ప‌ని క‌ల్పించ‌బ‌డిన వ్య‌క్తుల సంఖ్య కంటే దాదాపు ఇది 73 శాతం మేర అధికం. గ‌త ఏడాది ఇదే కాలంలో రోజుకు స‌గ‌టున ప‌ని క‌ల్పించ‌బ‌డిన వ్య‌క్తుల సంఖ్య 1.45 కోట్టుగా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-2021) ఈ ప‌థ‌కం కింద ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల పనులు పూర్తయ్యాయి. నీటి సంరక్షణ మరియు నీటిపారుదల, మొక్క‌ల పెంపకం, ఉద్యానవనం మరియు జీవనోపాధి ప్రోత్సాహం కోసం వ్యక్తిగత లబ్ధిదారుల ఉపాధికి సంబంధించిన పనులను చేపట్టడంపై నిరంతర దృష్టితో ఈ ప‌థ‌కంలో ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింది. 

 



(Release ID: 1630371) Visitor Counter : 425