రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మారుమూల ప్రాంతాల్లోని అంటురోగులను ఆకాశమార్గంలో తరలించే స్వదేశీ వ్యవస్థ సిద్ధం
అర్పిత్‌ పేరుతో ప్రత్యేక పెట్టెను తయారు చేసిన భారత వాయుసేన
ఏడు అర్పిత్‌ వ్యవస్థలను ప్రవేశపెడుతున్న భారత వాయుసేన
రోగికి ప్రాణాపాయం, తరలించే సిబ్బందికి వ్యాధి భయం లేకుండా రక్షణ వ్యవస్థ
విదేశీ వ్యవస్థలతో పోలిస్తే అతి స్వల్ప ఖర్చుతో దేశీయంగా తయారు చేసిన ఐఏఎఫ్‌

Posted On: 08 JUN 2020 6:48PM by PIB Hyderabad

"ఎయిర్‌బోర్న్‌ రెస్క్యూ పాడ్‌ ఫర్‌ ఐసోలేటెడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌" (అర్పిత్‌) ను భారత వాయుసేన దేశీయం వృద్ధి చేసి, రోగుల సేవకు ఉపయోగిస్తోంది. బాగా ఎత్తైన ప్రాంతాలు, ద్వీపాలు, మూరుమూల ప్రాంతాల్లో దీనిని ఉపయోగించనున్నారు. కొవిడ్‌ వంటి అంటువ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులను ఆకాశమార్గంలో తరలించడానికి వీలుగా తయారు చేశారు.  
    ఈ పెట్టె మొదటి నమూనాను వాయుసేన మూడో బ్రిగేడ్‌లో తయారు చేశారు. తర్వాత అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. ప్రధాని ఇచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ పిలుపునకు మద్దతుగా, దేశీయ ముడిపదార్థాలనే ఈ పెట్టె తయారీకి ఉపయోగించారు. దీనిని కేవలం రూ.60 వేల ఖర్చుతో తయారు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇదే తరహా పెట్టెల ధర రూ.60 లక్షల వరకు ఉంటోంది.

    ధృవీకృత సామగ్రితో, తేలికగా ఉండేలా ఈ ఐసోలేషన్‌ వ్యవస్థను తయారు చేశారు. ఇది పారదర్శకంగా, మన్నికగా ఉంటుంది. ఈ పెట్టెను ప్రస్తుతం ఉన్నవాటి కంటే పొడవుగా, ఎత్తుగా రూపొందించారు. దీనిని ఎన్ని సార్లయినా వాయుమార్గంలో మార్చుకోవచ్చు. వెంటిలేషన్‌తోపాటు, రోగులకు అనేక వైద్య పర్యవేక్షణ వ్యవస్థలను ఇది అందిస్తుంది. విమానం లేదా హెలికాఫ్టర్‌లో రోగిని తరలించే సమయంలో.., ఆరోగ్య, క్షేత్రస్థాయి, వాయుసేన సిబ్బందికి వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. హై ఎఫీషియెన్సీ పర్టిక్యులేట్‌ ఎయిర్‌ (హెపా) హెచ్‌-13 తరహా వడపోతలను అర్పిత్‌ వాడుకుంటుంది. జీవనమద్దతు, వైద్య పరికరాల పర్యవేక్షణ (మల్టీపారా మానిటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌, ఇన్‌ఫ్యూజన్‌ పంప్స్‌) వైద్య సిబ్బంది ఉపయోగించడానికి పొడవాటి గ్లోవ్స్‌, అధిక సామర్థ్యం ఉన్న విద్యుత్‌ సదుపాయాలను అర్పిత్‌ అనుసంధానిస్తుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ పెట్టెలను తయారు చేశారు. ప్రస్తుతం 7 అర్పిత్‌లను భారత వాయుసేన ప్రవేశపెడుతోంది.(Release ID: 1630345) Visitor Counter : 169