పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ సీరిస్ కింద మధ్యప్రదేశ్ వన అద్భుతాలను 29వ వెబినార్ వర్చ్యువల్ సఫారీలో ఆవిష్కరించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 08 JUN 2020 5:58PM by PIB Hyderabad

మయమరిపించే మధ్యప్రదేశ్ ప్రకృతి అందాలు, పర్యావరణాన్ని కేంద్ర పర్యాటక శాఖ వెబినార్ ద్వారా ప్రజలకు కనుల విందు చేసింది. దేఖో అప్నా దేశ్ వెబినార్ సీరిస్ ద్వారా కేంద్ర పర్యాటక శాఖ అత్యంత జీవవైవిధ్య సంపత్తి కలిగిన ప్రదేశాల వర్చ్యువల్ సఫారీ అనుభవాన్ని కల్పించింది. అపురూప భారత దర్శనం లో భాగంగా  మధ్యప్రదేశ్ లో అందాలను వీక్షించే అవకాశం కల్పించారు. 

2020 జూన్ 06 న దేఖో అప్నా దేశ్ వెబ్‌నార్ సీరిస్ 29 వ సెషన్‌ను పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి రూపీందర్ బ్రార్ సమన్వయం చేశారు  యువ వన్యప్రాణి చిత్రనిర్మాత శ్రీ సుయాష్ కేసరి సమర్పించారు. మధ్యప్రదేశ్, దాని వన్యప్రాణులపై విస్తృతంగా ఆయన పనిచేశారు. దేఖో అప్నా దేశ్ వెబినార్ సీరిస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద భారతదేశం  గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఇది. 

మధ్యప్రదేశ్ సహజ వన్యప్రాణులు, చరిత్ర, పురాణాల సమ్మేళనం. శ్రీ సుయాష్ ఈ మంత్రముగ్ధమైన ప్రయాణాన్ని బాంధవ్ఘర్ నేషనల్ పార్కుతో ప్రారంభించారు, దీనిని పులుల స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈ జాతీయ ఉద్యానవనం సుమారు 32 కొండల ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంది. బాంధవ్ అంటే సోదరుడు మరియు గర్హ్ అంటే కోట అని అర్ధం, ఇది తన సోదరుడు లక్ష్మణ్ కు కోటను (ఇది జాతీయ ఉద్యానవనం పైభాగంలో ఉంది) బహుమతిగా ఇచ్చిన భగవాన్ శ్రీరాముడి పౌరాణిక కథ చుట్టూ తిరుగుతుంది అందుకే ఈ జాతీయ ఉద్యానవనానికి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అని పేరు వచ్చింది .

పులులతో పాటు, ఈ జాతీయ ఉద్యానవనం బొటనవేలి గోరు కంటే చిన్నదైన సీతాకోకచిలుకలు, ప్రపంచంలోని అతిపెద్ద దున్న జాతులలో ఒకటి అయిన ఇండియన్ బైసన్ వంటి అనేక అద్భుతమైన జాతుల ప్రాణులకూ నిలయం. బాంధవ్గఢ్  నేషనల్ పార్క్ సహజ ఆవాసాల ప్రభావంతో, ఏనుగుల బృందం ఒడిశా నుండి ఈ జాతీయ ఉద్యానవనానికి వలస వచ్చి, 2018 అక్టోబర్,నుండి ఇక్కడ నివసిస్తోంది.

మన దేశంలోని జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఇతర ప్రదేశాలు సంజయ్ దుబ్రీ నేషనల్ పార్క్, పంచమరి బయోస్పియర్ రిజర్వ్, ప్రకృతి దృశ్యాలు, జలపాతాలకు ప్రసిద్ధి చెందాయి. నడక సఫారీలకు అనుమతి ఉన్న భారతదేశంలోని ఏకైక జాతీయ ఉద్యానవనం సత్పురా నేషనల్ పార్క్.

మధ్యప్రదేశ్‌లోని జాతీయ ఉద్యానవనాలు   చుట్టూ జీవారుణ్యాల చుట్టు నివసించే ప్రజల జీవనశైలి అందరికీ గొప్ప అభ్యాసంగా ఉంటుంది, ఎందుకంటే వారు వన్యప్రాణులను మరియు జంతువుల స్థలాన్ని గౌరవిస్తారు, ఇవి ఈ సహజ అద్భుతాల స్థిరమైన మార్పు, పరిరక్షణకు దారితీస్తాయి మరియు మానవత్వం. సామజిక భాగస్వామ్యం స్థానిక ప్రజల సంస్కృతి, సాంప్రదాయం, స్థానిక పరిజ్ఞానాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది, 

శ్రీమతి రూపీందర్ బ్రార్ తన ముగింపు ప్రసంగంలో పర్యాటక మంత్రిత్వ శాఖ అద్భుత భారత్  టూరిస్ట్ ఫెసిలిటేటర్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం గురించి మాట్లాడారు, ఇది ఒక ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం లేని స్థానిక పౌరులకు ఆదాయాన్ని సమకూర్చే ఒక సహాయకుడిగా కూడా ఉంటుంది. దీనికి రిజిస్టర్ కావడానికి లాగ్ ఆన్ అవ్వండి:  https://iitf.gov.in/login/signup.php

కోవిడ్-19 ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ఒక ప్రత్యేక పర్యాటకుల నివాస వాహనాన్ని సిద్ధం చేసింది. హోటళ్ల సౌకర్యం లేకపోవడం వల్ల ఈ వాహనాన్ని అద్దెకు తీసుకుని దీనిలోనే బస చేయవచ్చు. దీనిలో పడక, ఫ్రిడ్జ్, ఇతర అత్యవసర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 

తర్వాతి వెబినార్ లో ఛత్తీస్గఢ్ లోని తెగల పై జూన్ 9వ తేదీన ప్రసారం ఉంటుంది. https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured 

వెబినార్ లో రిజిస్టర్ కావడానికి  https://bit.ly/ChhattisgarhDAD

*******



(Release ID: 1630327) Visitor Counter : 251