జల శక్తి మంత్రిత్వ శాఖ
రాష్ట్రంలో 'జల్ జీవన్ మిషన్' అమలు విషయమై నాగాలాండ్ ముఖ్యమంత్రికి లేఖ రాసిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి
Posted On:
08 JUN 2020 5:43PM by PIB Hyderabad
నాగాలాండ్‌లో 'జల్ జీవన్ మిషన్' పనుల అమలులో జాప్యంపై తన ఆందోళనను వ్యక్తం చేస్తూ కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షేఖావత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. 2024 నాటికి ప్రతి పల్లెలోని ఇంటింటికీ నళ్లా కనెక్షన్లతో (ఎఫ్‌హెచ్‌టీసీ) సురక్షిత తాగు నీరు అందించడం ద్వారా.. గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గత ఏడాది 'జల్ జీవన్ మిషన్' ను ప్రారంభించారు. వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత, సమాజ-నిర్వహణ నీటి సరఫరా పథకాలు తాగునీటి రంగంలో ఈ మిషన్ గొప్ప పరివర్తన కార్యక్రమంగా చేపట్టడమైంది. ఈశాన్య భారతదేశం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చూపిన నిబద్ధత గురించి శ్రీ షేఖావత్ తన లేఖలో పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కోసం నిధులను భారత ప్రభుత్వం అందిస్తుంది. పల్లెలలోని ఇండ్లకు అందుబాటులోకి తెచ్చిన నళ్లా కనెక్షన్‌లు
మరియు అందుబాటులో ఉన్న నిధుల వినియోగం పరంగా భారత ప్రభుత్వం ఈ పథకం కింది రాష్ర్ర్టాలకు నిధులను అందిస్తుంది. 2019-20 సంవత్సరానికి గాను 75,000 ఇండ్లకు నళ్లా కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా నిర్ధారించుకోగా కేవలం 2,000 కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేయడమైనది.
నాగాలాండ్ రూ.147.04 కోట్ల కేటాయింపులు..
2019-20లో నాగాలాండ్‌కు రూ.56.49 కోట్ల మేర నిధులు కేటాయించగా.. ఇందులో రాష్ట్రం కేవలం రూ.23.54 కోట్ల మేర నిధులను మాత్రమే ఖర్చు చేసింది. 2020-21 సంవత్సరం కుగాను కేంద్రం నాగాలాండ్‌కు కేటాయింపులను రూ.56.49 కోట్ల నుంచి రూ. 114.09 కోట్లకు పెంచినట్టుగా మంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిపారు. దీనికి రూ.32.95 కోట్ల ప్రారంభపు నిల్వ కూడా జత కూడి నాగాలాండ్‌లో 'జల్ జీవన్ మిషన్' అమలునకు గాను కేంద్రం కేటాయించిన నిధులు రూ.147.04 కోట్లు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర మ్యాచింగ్ వాటాను కూడా కలుపుకుంటే జేజేఎం అమలు కోసం 2020-21లో రాష్ట్రం రూ.163 కోట్ల నిధులను కలిగి ఉండనుంది. ప్రతి గ్రామీణ గృహాలకు రక్షిత తాగునీరును అందించడం జాతీయ ప్రాధాన్యత అని, సమయానుసారంగా నిర్ధారిత లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రం తగు విధంగా ప్రయత్నం చేయాలని జల్ శక్తి మంత్రి ఉద్ఘాటించారు. మిగిలిన గృహాలకు ఎఫ్‌హెచ్‌టీసీలను అందించడానికి ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థలను రీట్రో ఫిటింగ్ / పెంచడంపై దృష్టి సారించి నిర్ధారిత సమయ వ్యవధిలో జేజేఎం పథక లక్ష్యాన్ని అందుకోవడానికి గాను సరైన ప్రణాళిక చేయాల్సిన అవసరాన్ని మంత్రి లేఖలో నొక్కిచెప్పారు. సకాలంలో జేజేఎం పనులను చేపట్టడానికి తగిన శ్రద్ధ చూపాలని కేంద్ర మంత్రి నాగాలాండ్ ముఖ్యమంత్రిని కోరారు. నాగాలాండ్ దాదాపు 1,334 గ్రామాలలో వివిధ నీటి సరఫరా పైపులైను పథకాలు ఉన్నాయని రాష్ట్రం తమకు నివేదించిందని.. వీటిని జేఎల్ఎల్ పథకంతో అనుసంధానం చేసేలా పనులను చేపట్టడం ద్వారా.. సమాజంలోని పేద మరియు అట్టడుగు వర్గాలకు వీలైనంత త్వరగా నళ్లా కనెక్షన్లు లభిస్తాయని ఆయన అన్నారు. ఔత్సాహిక జిల్లాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి అధిపత్య గ్రామాలు,
తండాలు మరియు సంసద్ ఆదర్శ్ గ్రామ పరిధిలోని గ్రామాల్లో సంతృప్తికరంగా జేఎల్ఎల్ మిషన్ పనులు జరిగేలా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన కోరారు. తాగునీటి సరఫరా వ్యవస్థల దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ప్రస్తుతం ఉన్న తాగునీటి వనరులను బలోపేతం చేయాలని శ్రీ శేఖవత్ కోరారు. జేఎల్ఎల్ నిమిత్తం ప్రణాళిక గ్రామ స్థాయిలో జరగాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామానికి చెందిన విలేజ్ యాక్షన్ ప్లాన్ (వీఏపీ) వివిధ కార్యక్రమాల కలయిక ద్వారా అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను కలుపుతూ ఈ ప్రణాళికను గ్రామాల్లో తయారు చేయాలని ఆయన అన్నారు. ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్, ఎస్‌బీఎం, పీఆర్‌ఐలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, కంపా నిధులు, స్థానిక అభివృద్ధి నిధులు మొదలైన వాటిని మిళితంగా ఈ ప్రణాళికలు ఉండాలని మంత్రి నాగాలాండ్ ముఖ్యమంత్రికి సూచించారు. తాగునీటి భద్రతను సాధించడానికి గాను దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడానికి గ్రామాలలో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, మరియు నిర్వహణలో వివిధ స్థానిక గ్రామ సంఘం / గ్రామ పంచాయితీలు మరియు వినియోగదారు సమూహాలు పాల్గొనవలసిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు. అన్ని గ్రామాల్లో జల్ జీవన్ మిషన్‌ను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చడానికి సమాజిక సమీకరణతో పాటు ఐఈసీ ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. 2020-21 సంవత్సరానికి గాను 15 వ ఆర్థిక కమిషన్ నాగాలాండ్‌లో పీఆర్‌ఐలకు గ్రాంట్‌గా రూ.125 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో 50 శాతం తప్పనిసరిగా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్ (జి) కింద అందించిన నిధులను నీటిశుద్ధి మరియు పునర్వినియోగం సంబంధిత పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రజలు పబ్లిక్ స్టాండ్-పోస్టుల వద్ద ప్రజా నీటి వనరుల వద్ద గుంపులు గుంపులుగా చేరకుండా చూడడం చాలా ముఖ్యం. ఇంటింటికి నళ్లా కనెక్షన్లు అందించడానికి అన్ని గ్రామాల్లో నీటి సరఫరా పనుల్ని చేపట్టాలని నాగాలాండ్ సీఎంను అభ్యర్థించారు. ఇది సామాజిక దూరాన్ని అభ్యసింపజేయడంలో సహాయ పడుతుంది మరియు అదనంగా స్థానికులు / వలసదారులు ఉపాధి పొందడంలో సహాయపడుతుందని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి మెరుగుపరుస్తుందని మంత్రి తెలిపారు. నాగాలాండ్
రాష్ట్రాన్ని ‘100% ఎఫ్‌హెచ్‌టీసీ రాష్ట్రంగా’ మార్చడానికి పూర్తి మద్దతు ఇస్తానని జలశక్తి మంత్రి నాగాలాండ్ సీఎంకు హామీ ఇచ్చారు.
(Release ID: 1630306)
Visitor Counter : 175