ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారతదేశ నూతన వ్యాపార గమ్యస్థానంగా ఈశాన్యభారతం – డాక్టర్ జితేంద్ర సింగ్

షిల్లాంగ్ ఐ.ఐ.ఎమ్ మరియు డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ మరియు అనాలసిస్ నిర్వహించిన ఈ-సింపోజియం 2020ని ప్రారంభించిన డాక్టర్ సింగ్

Posted On: 05 JUN 2020 5:53PM by PIB Hyderabad

ఈశాన్యభారతం వ్యాపార రంగంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ, భారతదేశానికి నూతన గమ్యస్థానంగా నిలుస్తోందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి కేంద్ర సహాయ మంత్రి (ఇంఛార్జ్) మరు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ తర్వాత నూతన పరిణామాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, శాస్త్రీయ పరిశోధనలు సహా అనేక విభిన్న రంగాల్లో పురోగతికి అవకాశం ఉందని, ఈశాన్య భారతం దేశ ఆర్థిక కేంద్రంగా, అంకురాలకు అనువైన గమ్యస్థానంగా ఉందని అభిప్రాయపడ్డారు.

షిల్లాంగ్ ఐ.ఐ.ఎమ్ మరియు డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ మరియు అనాలసిస్ నిర్వహించిన ఈ-సింపోజియం 2020ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఆయన, గత ఆరు సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈశాన్యభారత అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు చేపట్టిందని, తొలి సారిగా దేశంలో ఇతర ప్రాంతాలతో సమానంగా ఈ ప్రదేశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని తెలిపారు. మోడీ ప్రభుత్వ నిర్ణయాలు ఈశాన్యభారత ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించడమే గాక, దేశంలో ఇతర ప్రాంతాలతో పాటు, బయటి దేశాల్లో తమ నైపుణ్యాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని కూడా పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల సంఘటిత అభివృద్ధి పట్ల నాటి ప్రభుత్వాలకు ఆసక్తి లేకపోవడం దురదృష్టకరమన్న డాక్టర్ సింగ్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానంగా వివరించారు. దేశంతో అనుసంధాన సమస్యలను అధిగమించడం, ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ప్రొత్సహించడం లాంటి వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సాధ్యమైన అన్నిరకాల సహకారాలను అందించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.

 ఒక్కసారి గమనిస్తే, గత ఆరు సంవత్సరాల్లో రహదారి, రైలు మరియు విమానయానం పరంగా గణనీయమైన అభివృద్ధి జరిగిందని, దీని వల్ల ఈ ప్రాంతంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈశాన్య భారత రవాణాను ఇది సానుకూల మార్గంలో ప్రభావితం చేసిందన్న ఆయన, నిన్న మొన్నటి వరకూ రైల్వే అంటే ఎరుగని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలు ఇప్పుడు రైలు మార్గంతో అనుసంధానం అయ్యాయని తెలిపారు. అదే విధంగా సిక్కిం లాంటి రాష్ట్రాలు తొలి సారి విమానాశ్రయాలను చూశాయని, ఇతర రాష్ట్రాలు కూడా నూతన ఓడరేవుల నిర్మాణం, పాత ఓడ రేవులు తెరవడం, ప్రస్తుతం ఉన్న వాటి సౌకర్యాలు, సామర్థ్యాన్ని పెంచే దిశగా సాగుతున్నాయని తెలిపారు. స్వదేశీ మార్పిడి కోసం ఇండో – బంగ్లాదేశ్ ఒప్పందం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేరవేరిందని, వ్యాపార సౌలభ్యం మరియు రాకపోకల సౌలభ్యం కోసం డెక్ లను క్లియర్ చేసిందని, ఇది గతంలో ఎంతో శ్రమతో కూడుకున్న అంశమని అయన తెలిపారు. అతి త్వరలో త్రిపుర నుంచి బంగ్లాదేశ్ కు ఒక కొత్త అధ్యాయాన్ని తెలియజేయబోతున్నామన్న ఆయన, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ప్రాంతాలకు ఓడ రేవులు అందించడం ద్వారా ఓ నూతన మార్గం దిశగా సాగుతున్నట్లు, ఇది సరిహద్దు వాణిజ్యాన్ని ముఖ్యంగా పొరుగు దేశాలతో ఏ మేరకు పెంచుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ ప్రాంతంలోని అంతర్ రాష్ట్ర రహదారులు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం ప్రభుత్వం నార్త్ ఈస్ట్ రోడ్ సెక్టార్ డెవలప్ మెంట్ స్కీమ్స్ (ఎన్.ఈ.ఆర్.డి.ఎస్) అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ చొరవ రెండు రాష్ట్రాలు పట్టించుకోకుండా వదిలేసిన అనాథ రహదారి మీద దృష్టి పెట్టిందని, ఇలా చెప్పుకుంటూ పోతే ఈశాన్య భారత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ చొరవ అంతం లేకుండా ముందుకు సాగుతోందని తెలిపారు. అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే దిశగా ప్రభుత్వ సంకల్పం, నిబద్ధత, ధైర్యాన్ని ఇది నొక్కి చెబుతుందని వివరించారు.

 

 మరో వైపు, ప్రభుత్వ మరియు ఈశాన్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా స్వయం సహాక బృందాలను ప్రోత్సహించేందుకు కట్టబడి ఉన్నాయని, జీవనోపాధి ప్రాజెక్టులను ప్రోత్సహించటం ద్వారా పేద ప్రజలకు, ముఖ్యంగా సంప్రదాయం ప్రకారం ఈ ప్రాంతంలో కష్టపడి పని చేసే మహిళలకు స్థిరమైన ఆదాయం అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ అభివృద్ధి మార్గంలో హార్టికల్చర్, టీ, వెదురు, పిగ్గేరీ, సెరికల్చర్, టూరిజం వంటి రంగాల్లోని ప్రాజెక్టులకు కూడా కదలిక మొదలైందని,  ఈశాన్య భారతం నుంచి వెదురు వాణిజ్యం కీలకం కానుందని తెలిపారు.

ఈ అవకాశాన్ని గ్రహించిన ప్రభుత్వం, అటవీ చట్టం పరిధి నుంచి ఇంట్లో పెరిగిన వెదురును తీసుకుని శతాబ్ధాల పాత అటవీ చట్టాన్ని సవరించిందని, దీని వల్ల ఆకర్షించే ప్రకృతి వల్ల ఈ ప్రాంత పర్యాటక రంగం అభివృద్ధి దిశగా సాగబోతోందని, ఇప్పటి వరకూ యూరప్ మీద దృష్టి పెట్టిన పర్యాటకులను ఇది ఆకర్షిస్తుందని తెలిపారు. నూతన పారిశ్రామికవేత్తలకు వెంచర్ ఫండ్స్ అందించటం ద్వారా, దేశీ మరియు స్నేహపూర్వక విదేసీ పెట్టుబడులను సులభతరం చేయటం ద్వారా ప్రభుత్వం స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మరింత అభివృద్ధి కోసం ఐ.ఐ.ఎం. షిల్లాంగ్ లాంటి సంస్థలు విధానాలు రూపొందించి, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాకు సమగ్ర దిశా నిర్దేశం చేయాలని డాక్టర్. జితేంద్ర సింగ్ కోరారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శి డా. ఇంద్రజిత్ సింగ్, ఎన్.ఈ.సి. కార్యదర్శి శ్రీ మోసేస్ కె చెలాయ్, షిల్లాంగ్ ఐఐఎం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ శ్రీ శిశిర్ బాజోరియా, షిల్లాంగ్ ఐఐఎం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ శ్రీఅతుల్ కులకర్ణి, షిల్లాంగ్ ఐ.ఐ.ఎం. సంచాలకు లు ప్రొఫెసర్ డి పి. గోయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక మరియు అభివృద్ధి పరిధి మరియు ఆవశ్యకతను ప్రొ. కియా సేన్ గుప్తా నొక్కి చెప్పారు. 

 

***



(Release ID: 1629811) Visitor Counter : 263