రక్షణ మంత్రిత్వ శాఖ
ఓ.ఎఫ్.బి. ని కార్పొరేట్ గా మార్చడానికి సంబంధించి, ఓ.ఎఫ్.బి. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్న - ఎమ్.ఓ.డి.
Posted On:
05 JUN 2020 7:30PM by PIB Hyderabad
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓ.ఎఫ్.బి.) ను కార్పొరేట్ గా మార్చడానికి సంబంధించి, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగుల సమాఖ్యలు / యూనియన్లతో చర్చలు ప్రారంభించడానికి, రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.డి.) కి చెందిన, రక్షణ ఉత్పత్తుల శాఖ (డి.డి.పి.) యొక్క ఉన్నత స్థాయి అధికారిక కమిటీ (హెచ్.ఎల్.ఓ.సి.) చర్యలు తీసుకుంది.
అదనపు కార్యదర్శి (డి.డి.పి) శ్రీ వి.ఎల్. కాంతారావు నేతృత్వంలో, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సైన్యానికి చెందిన సీనియర్ అధికారులతో కూడిన కమిటీ, ఉద్యోగులకు చెందిన మూడు సంఘాలు - రక్షణ శాఖ గుర్తింపు పొందిన సంఘాల సమాఖ్య (సి.డి.ఆర్.ఏ.); భారత ఆర్డినెన్సు ఫ్యాక్టరీల గెజిటెడ్ అధికారుల సంఘం (ఐ.ఓ.ఎఫ్.జి.ఓ.ఏ.) మరియు జాతీయ రక్షణ శాఖ గ్రూప్-బి గెజిటెడ్ అధికారుల సంఘం (ఎన్.డి.జి.బి.జి.ఓ.ఏ.) లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. వాటాదారులందరి ప్రమేయంతో ముందు చెప్పిన నిర్ణయాన్ని అమలు చేయాలనే ఉద్దేశ్యాన్ని తెలియజేయడం జరిగింది. ఓ.ఎఫ్.బి. ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వంద సాకేతం ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేట్ సంస్థలుగా మార్చే సమయంలో, వేతనాలు, జీతం, పదవీ విరమణ ప్రయోజనాలు, ఆరోగ్య సౌకర్యాలు మరియు ఇతర సర్వీసు విషయాలు మొదలైన వాటి పరంగా ఉద్యోగుల సౌకర్యాలు / ప్రయోజనాలను పరిరక్షించడానికి అనుసరించవలసిన విధి, విధానాలపై సంఘాల సభ్యుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించారు.
భవిష్యత్ ఆర్డర్లు మరియు కొత్త కార్పొరేట్ సంస్థ / సంస్థలకు ప్రభుత్వం నుండి అవసరమయ్యే బడ్జెట్ మద్దతు గురించి వారి ఆందోళనలపై కూడా సలహాలు, సూచనలు కోరారు.
ఈ సమావేశంలో చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. ఓ.ఎఫ్.బి. కి చెందిన అన్ని ఉద్యోగ సంఘాల సమాఖ్యలు / యూనియన్లతో కలిసి మరిన్ని సమావేశాలు నిర్వహించాలన్న అసోసియేషన్ల అభ్యర్థనను కమిటీ పరిగణించింది, సమాఖ్యలు / సంఘాలతో సమావేశాలు కొనసాగుతాయని హామీ ఇచ్చింది.
ఓ.ఎఫ్.బి. ని కార్పొరేట్ చేయడం ద్వారా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తుల సరఫరాలో స్వయంప్రతిపత్తి, జవాబుదారీతనం, సామర్థ్యాలను మెరుగుపరచనున్నట్లు, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం 2020 మే 16వ తేదీన ప్రకటించింది.
ఉద్యోగుల సంఘాల ప్రతినిధులుగా - సి.డి.ఆర్.ఏ. తరఫున అధ్యక్షుడు శ్రీ బి.కే. సింగ్, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ బి.బి. మొహంతి; ఐ.ఓ.ఎఫ్.ఎస్.జి.ఓ.ఏ. తరఫున ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.బి.చౌబే, మరియు ప్రధాన కోశాధికారి శ్రీ ఎమ్.ఏ. సిద్దిఖీ; ఎన్.జి.డి.బి.జి.ఓ.ఏ. తరఫున అధ్యక్షుడు శ్రీ ఎమ్.బారక్, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ జైగోపాల్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
*****
(Release ID: 1629779)
Visitor Counter : 272