భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ప్యుగోట్ ఎస్.ఏ. మరియు ఫియట్ క్రిస్లర్ ఆటోమైబైల్స్ ఎన్.వి. మధ్య ప్రతిపాదిత విలీనాన్ని ఆమోదించిన సి.సి.ఐ.

Posted On: 04 JUN 2020 7:54PM by PIB Hyderabad

ప్యుగోట్ ఎస్.ఎ. మరియ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఎన్.వి.ల మధ్య ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) ఆమోదించింది. ప్రతిపాదిక కలయిక ప్యుగోట్ ఎస్.ఏ. (పి.ఎస్.ఏ) మరియు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఎన్.వి. (ఎఫ్.సి.ఏ) మధ్ విలీనానికి సంబంధించినది.

పి.ఎస్.ఏ. అనేది ఫ్రాన్స్ లో విలీనం చేయబడి బహిరంగంగా జాబితా చేయబడిన పరిమిత బాధ్యత సంస్థ. ఇది ఫ్రెంచ్ ఆధారిత సమూహం యొక్క హోల్డింగ్ కంపెనీ. ఇది ప్రధానంగా ఒరిజినల్ పరికరలా తయారు దారు. అంతే గాక మోటారు వాహనాలు, కార్లు మరియు తేలిక పాటి వాణిజ్య వాహనాలైన ప్యుగోట్, సిట్రోయెన్, ఒపెల్, వోక్స్హాల్ మరియు డి.ఎస్. బ్రాండ్లకు సంబంధించిన డీలర్. ఇది మోటారు వాహనాలు సముపార్జనకు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ మరియు మొబిలిటి సర్వీసులు మరియు ఇతర సొల్యూషన్స్ వంటి సహాయక సేవలను కూడా అందిస్తుంది.

ఎఫ్.సి.ఏ. అనేది పరిమిత బాధ్యత కలిగిన ఒక పబ్లిక్ కంపెనీ. లండన్ లో ప్రధాన కార్యాలయం ఉంది. నెదర్లాడ్స్ చట్టాల ప్రకారం విలీనం చేయడంతో పాటు నిర్వహించబడింది. ప్రపంచ వ్యాప్తంగా వాహనాలు, విడి భాగాలు మరియు ఉత్పత్తి వ్యవస్థల రూపకల్పన, ఇంజనీరింగ్, తయారీ, పంపిణీ మరియు అమ్మకాల్లో నిమగ్నమైన గ్లోబల్ ఆటోమోటివ్ గ్రూప్ ఇది.

 

సి.సి.ఐ. వివరణాత్మక క్రమానికి సంబంధించిన అంశాలను ఇక్కడ చూడవచ్చు.



(Release ID: 1629510) Visitor Counter : 166