సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఈలకు మద్దతునిచ్చే విధంగా ఎన్‌బీఎఫ్‌సీలను బలోపేతం చేయడానికి ఎఫ్‌డీఐల అన్వేషణః శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
04 JUN 2020 7:03PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఈ సంస్థలపై కోవిడ్-19 ప్రభావం గురించి చర్చించేందుకు గాను కేంద్ర ఎంఎస్ఎంఈ, రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గురువారం (4వ తేదీ) నాడు కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్, ఫిక్కీ-‘ఎన్‌బీఎఫ్‌సీ ప్రోగ్రామ్’ మరియు ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవటానికి ఎంఎస్‌ఎంఈ రంగానికి అవసరమైన ప్రేరణను అందించడానికి గాను ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ను ప్రకటించినట్టుగా ఆయన తెలిపారు. ఈ రంగానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ఎంఎస్‌ఎంఈల నిర్వచనంలో మార్పులతో సహా ఎంఎస్‌ఎంఈల నిమిత్తం ప్రకటించిన వివిధ సహాయక చర్యలను గురించి ఆయన వివరించారు. సంబంధిత భాగస్వామ్య పక్షాల వారి నుండి అందిన సమాచారం మేరకు మీడియం ఎంటర్‌ప్రైజెస్ యొక్క నిర్వచనం మరింత సవరించినట్టుగా మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా ఇన్వెస్ట్‌మెంట్ మరియు టర్నోవర్‌కు పరిమితిని కూడా పెంచినట్టుగా ఆయన వివరించారు. కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్ ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఆగ్రా రింగ్‌రోడ్డుకు సమీపంలో లెదర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సమర్పించవచ్చని సూచించారు. ఈ పారిశ్రామిక క్లస్టర్లు ఆగ్రాలోని లెదర్ రంగంలో పని చేసే ప్రజలకు సహాయ పడటానికి స్మార్ట్ సిటీలు, స్మార్ట్ గ్రామాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధికి దోహదం చేయగలదని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ప్రస్తుత తక్షణావసరమని శ్రీ గడ్కరీ తెలిపారు. కోవిడ్ మహమ్మారి
ని మంత్రి ఆపద సమయంలో కలిసి రానున్నఅవకాశంగా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. వ్యక్తిగత సంరక్షణ కిట్‌లు
(మాస్క్‌లు, శానిటైజర్ మొదలైనవి) వాడకం అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు. సామాజిక దూరపు ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఇతర దేశాల దిగుమతులను తగ్గించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరమని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్ల కాలంలో ఎగుమతి మరియు దిగుమతి వివరాలను తెలియజేయడానికి గాను ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ రెండు బుక్‌లెట్లను తీసుకురావడంపై పనిచేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుత సవాలు సమయంలో ఎంఎస్‌ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి ఎన్‌బీఎఫ్‌సీలు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు, క్రెడిట్ సొసైటీలు మొదలైన వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని
అభిప్రాయపడ్డారు. ఎన్‌బీఎఫ్‌సీలను బలోపేతం చేసేందుకు గాను ఈ రంగంలోకి ఎఫ్‌డీఐలను అన్వేషించాల్సిన అసవరం ఉందని అన్నారు. ఇలాంటి చర్య ఎంఎస్ఎంఈలకు గొప్ప దన్నును అందించగలవని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో లేవనెత్తిన ప్రశ్నలు, ప్రతినిధులు సూచించిన సలహాలు ఇలా ఉన్నాయిః
- ట్రేడర్లను కూడా ఎంఎస్ఎంఈలలో జత చేయడం, - ఎంఎస్ఎంఈల చెల్లింపు నిమిత్తం ఇచ్చిన 45 రోజుల కాలపరిమితికి సంబంధించిన ఎంఎస్ఎంఈ శాఖకు చెందిన 02.11.2018 నాటి ఆర్డర్‌ను మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కూ వర్తింపజేయడం. -ఎన్‌బీఎఫ్‌సీల విషయంలోనూ డిజిటల్ కేవైసీ విధానం తీసుకురావడం - కాంటాక్ట్ జాబితా కేవైసీ వాడకాన్ని ప్రోత్సహించేలా మాస్టర్ కేవైసీ నోటిఫికేషన్ మార్చే విషయంలో ఆర్‌బీఐ నుంచి తగిన తోడ్పాటు అవసరం - వడ్డీ ఉపసంహరణ పథకం యొక్క అర్హత జాబితాలో పత్తి స్పిన్నింగ్‌నూ చేర్చడం - కాన్పూర్‌లో కార్గో విమాన ప్రయాణానికి అనుమతి, దిగుమతులను తగ్గించడం మరియు దేశీయ సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించడం - ఎంఎస్ఎంఈ రంగంలో మార్పు తీసుకురావడానికి తగిన కార్మిక సంస్కరణల అవసరం. ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ గడ్కరీ తగు విధంగా స్పందించారు. ఈ రంగం అభివృద్ధికి అనువైన సలహాలను పంపమని ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
(Release ID: 1629504)
Visitor Counter : 216