శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా వేసవి పరిశోధన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్న సిఎస్ఐఆర్

సిఎస్‌ఐఆర్ ప్రయోగశాలలకు చెందిన 400 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ వినూత్న ప్రయత్నంలో నిమగ్నమయ్యారు

ఈ కార్యక్రమంలో పాల్గొనే 400 పైగా విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తారు

Posted On: 04 JUN 2020 7:24PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలో విద్య సంబంధిత పరిస్థితుల్లో ఏర్పడిన స్తబ్దతను మెరుగుపరిచేందుకు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (నీస్ట్) కృషి చేస్తోంది. జోర్హాట్ ఆధారిత  సిఎస్ఐఆర్-నీస్ట్  దేశవ్యాప్తంగా సిఎస్ఐఆర్-సమ్మర్ రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రాం (సిఎస్ఐఆర్-ఎస్ఆర్టిపి -2020) ను నిర్వహించడానికి, సమన్వయం చేయడానికి డిజి, సిఎస్ఐఆర్ డాక్టర్ శేఖర్ సి. మాండే నుండి తగు ఆదేశాలు వెళ్లాయి.

దేశంవ్యాప్తంగా విస్తరించి ఉన్న 38 సిఎస్‌ఐఆర్ ప్రయోగశాలల నుండి అధ్యాపకులు, సలహాదారుల ద్వారా ఆన్‌లైన్ కార్యక్రమం  (సిఎస్‌ఐఆర్-ఎస్‌ఆర్‌టిపి -2020) విడుదల కానుంది. ఈ విషయాన్ని సిఎస్‌ఐఆర్-నీస్ట్ డైరెక్టర్ డాక్టర్ జి నారాహరి శాస్త్రి ప్రకటించారు.

ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌కు ముందుగా, http://www.neist.res.in/srtp2020/ అనే వెబ్‌సైట్ ప్రారంభించారు, ఇక్కడ ఔత్సాహిక విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, కార్యక్రమానికి సంబంధించిన  వివరణాత్మక బ్రోచర్‌ను పొందటానికి లాగిన్ అవ్వవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 28, 2020 నుండి ప్రారంభమవుతుంది, ఇది 2020 జూన్ 05 న ముగుస్తుంది.

ఆన్‌లైన్ ప్రోగ్రామ్ బిఎస్సి, ఎంఎస్సి, బిటెక్ / బి.ఇ., ఎంసిఎ, ఎం.టెక్, ఎం. ఫార్మా వంటి ప్రోగ్రామ్‌లను అభ్యసించే విద్యార్థుల కోసం, అద్భుతమైన అకాడెమిక్ రికార్డుతో రూపొందించబడింది. ఈ కార్యక్రమం యుజిసి / ఎఐసిటిఇ / రాష్ట్ర / కేంద్ర / ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలల అధ్యాపకులకు కూడా అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియ అభ్యర్థులు సమర్పించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనల యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. ఒక దరఖాస్తుదారుడికి మూడు సిఎస్‌ఐఆర్ ల్యాబ్‌లు / ఇనిస్టిట్యూట్‌లను ప్రాధాన్యతతో ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తారు. ఆన్‌లైన్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత అభ్యర్థులందరికీ ధృవీకరణ పత్రాలు అందిస్తారు.

కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జియోసైన్స్, ఫార్మసీ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడిసిన్ వంటి వివిధ అంశాలపై ఆన్‌లైన్ ఉపన్యాసాలు ఇవ్వడానికి సిఎస్‌ఐఆర్ ప్రయోగశాలలకు చెందిన 400 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ వినూత్న ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే 400పైగా విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా ఇస్తున్నారు. ఈ ప్రయత్నం విద్యార్థుల పునరుజ్జీవింపజేయడం ద్వారా అదనపు విద్యా పరిజ్ఞానం అందిస్తుందని డాక్టర్ శాస్త్రి చెప్పారు. ఈ కార్యక్రమం విద్యార్థులను మనోవేదన నుండి బయటకు రావడానికి సహాయపడాలి. 

(రచయిత: అస్సాంలోని జోర్హాట్,  సిఎస్ఐఆర్-నీస్ట్ లో సీనియర్ శాస్త్రవేత్త బిజిత్ కుమార్ చౌదరి )

 


(Release ID: 1629503) Visitor Counter : 253