రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రపంచ పర్యావరణ దినోత్సవం - 2020

భారత నావికాదళం : బ్లూ వాటర్ ఆపరేషన్స్ తో పాటు గ్రీన్ ఫుట్ ప్రింట్

Posted On: 04 JUN 2020 5:51PM by PIB Hyderabad

పర్యావరణ పరిరక్షణ మరియు హరిత చర్యలు భారత నావికాదళానికి ఎప్పుడూ కీలకమైనవే.  బాధ్యతాయుతమైన, బహుముఖ రక్షణ శక్తి , భారత నావికాదళం ఇంధన పరిరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణ, సముద్ర కాలుష్యాన్ని తగ్గించడం మరియు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించడం ప్రారంభించింది.  నావికాదళం తన బ్లూ వాటర్ కార్యకలాపాలకు గ్రీన్ ఫుట్ ప్రింట్ ‌ను జోడించి, తమ లక్ష్యాన్ని క్రమంగా సాధించడానికి,  "భారత నావికా దళ పర్యావరణ పరిరక్షణ రోడ్ మ్యాప్" (ఐ.ఎన్.ఈ.సి.ఆర్.) ను ఒక మార్గదర్శక పత్రంగా ముందుకు నడిపిస్తోంది. 

సముద్ర కాలుష్యం, భూగోళం వేడెక్కడం, మరియు స్థిరమైన వినియోగం వంటి పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఒక  ప్రపంచ వేదికగా మారింది.  అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ, భారత నావికాదళం ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించింది.  సాధారణంగా జరుపుకునే బహిరంగ కార్యకలాపాలకు బదులుగా, ఈ ఏడాది, విద్యా అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు, వెబ్‌నార్లు నావికాదళ స్టేషన్లలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నిర్వహించడం జరిగింది. 

ఇంజిన్ ఎగ్జాస్ట్‌ల నుండి కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో, ఇంధన వివరాలను సవరించడానికి భారత నావికాదళం  ఐ.ఓ.సి.ఎల్. ‌తో కలిసి పనిచేస్తోంది.   కొత్త ప్రత్యేక లక్షణాలు అంతర్జాతీయ నిబంధనలను అధిగమించాయి. అదేవిధంగా తగ్గిన సల్ఫర్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో ఉద్గార స్థాయిలను,  నౌకల్లో నిర్వహణ అవసరాలను తగ్గిస్తోంది.  యాదృచ్ఛికంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం -2020 యొక్క ఇతివృత్తమైన జీవవైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడంలో నావికాదళం లో తగినంత ప్రాధాన్యత ఇవ్వబడింది.  ఓడల నుండి కాలుష్య నివారణకు అంతర్జాతీయ కన్వెన్షన్ యొక్క ఆరు షెడ్యూళ్ళలోని (మార్పోల్) నిబంధనలను భారత నావికాదళం స్వచ్ఛందంగా అమలు చేస్తోంది.  అన్ని నావికాదళ నౌకలను మార్పోల్ కంప్లైంట్ కాలుష్య నియంత్రణ పరికరాలైన ఆయిలీ వాటర్ సెపరేటర్ (ఓ.డబ్ల్యు.ఎస్.) మరియు మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్.టి.పి) తో అమర్చారు.  ఇంకా, నౌకాశ్రయ జలాల సంరక్షణను నిర్ధారించడానికి, ముంబైలోని నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (ఎన్.‌ఎం.ఆర్.‌ఎల్.) ద్వారా వేగవంతమైన బయో రెమిడియేషన్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేశారు.

కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించే ప్రయత్నాలలో, ఈ-సైకిళ్ళు, ఈ-ట్రాలీ మరియు ఈ-స్కూటర్లు వంటి ఈ-వాహనాల వినియోగం స్థిరంగా పెరగడానికి చర్యలు అమలు చేయడం జరుగుతోంది.  దీర్ఘకాలిక వ్యూహంగా, ఈ-వెహికల్ లేదా ఈ-సైకిల్ వాడకం ద్వారా పని సమయంలో శిలాజ-ఇంధన ఆధారిత వాహనాల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని యోచిస్తున్నారు.  దీనిని ప్రోత్సహించడానికి, యూనిట్లు క్రమం తప్పకుండా కొన్ని రోజులు అసలు వాహనాలను నడపకుండా ‘నో వెహికల్ డేస్’ ను  పాటిస్తున్నాయి.  కొన్ని నావికా స్థావరాలలో అసలు ఒక్క వాహనాన్ని కూడా అనుమతించకుండా ‘వెహికల్ ఫ్రీ బేస్’ అనే భావనను కూడా ప్రవేశపెడుతున్నారు.

నావికాదళంలో, శక్తి సామర్థ్య పరికరాల ప్రగతిశీల ప్రేరణ ద్వారా మొత్తం విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంపై ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించారు. సాంప్రదాయికమైన  లైటింగ్ విధానం  నుండి మరింత శక్తి సామర్థ్యం గల ఘన-స్థితి లైటింగ్‌కు మారడానికి అవసరమైన గణనీయమైన ప్రయత్నాలు సత్పలితాలనిచ్చాయి.  భారతీయ నావికాదళ సంస్థలలో అములుచేస్తున్న ఇతర ముఖ్యమైన ఇంధన ఆదా చర్యలు ఈ విధంగా ఉన్నాయి.  అధిక విద్యుత్ ను నిర్వహించడానికి కెపాసిటర్ బ్యాంకుల ఉపయోగం,  సహజ కాంతిని ఉపయోగించుకోవడానికి వీలుగా పైకప్పులు పారదర్శకమైన యాక్రిలిక్ షీట్ల వాడకం,  సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ఎస్.సి.ఏ.డి.ఏ.  (పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సముపార్జన) ఆధారిత విద్యుత్ మీటరింగ్ వ్యవస్థ వినియోగం,  వర్క్ షాపుల్లో ఆక్యుపెన్సీ సెన్సార్లు,  స్కై పైపులు, టర్బో-వెంటిలేటర్లు వంటి వాడడం మొదలైన చర్యలు చేపట్టడం జరిగింది. 

అభివృద్ధి చెందుతున్న పోకడలు మరియు భారత ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, పునరుత్పాదక ఇంధన వాటాను పెంచడానికి నేవీలో కూడా ప్రయత్నాలు జరిగాయి.  నేవీ తీర కార్యాలయాలలో,  24 మెగావాట్ల సౌర కాంతి ఫోటో వోల్టాయిక్  ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో అమలులో ఉన్నాయి.  అదనంగా, వ్యక్తిగత యూనిట్లు కూడా సౌరశక్తితో పనిచేసే పరికరాలను ఏర్పాటు చేశాయి.  సాంప్రదాయక పరికరాలను ఇవి క్రమంగా భర్తీ  చేశాయి.

అన్ని నావికాదళ యూనిట్లు, వ్యర్ధ పదార్ధాల సేకరణ, వేరుచేయడం, తదుపరి నిర్వహణ ప్రక్రియలను,  భారత ప్రభుత్వ హరిత నిబంధనల ప్రకారం అనుసరిస్తున్నాయి.   కార్వార్ లోని నావికాదళ కేంద్రంలో ఒక సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ విధానాన్ని (ఐ.ఎస్.డబ్ల్యూ.ఎం.ఎఫ్.) ను ఏర్పాటు చేశారు.  ఇందులో కేంద్రీకృత వ్యర్థాల విభజన ప్లాంటు, తడి వ్యర్థాల కోసం సేంద్రీయ వ్యర్ధాల కన్వర్టర్ (ఓ.డబ్ల్యూ.సి.) తో పాటు పొడి వ్యర్ధాలను, వేరు చేయని ఇతర గృహ వర్థాలను నిర్వహించే సౌకర్యాలు ఉన్నాయి. నావికా దళం చేపట్టిన హరిత చర్యల కారణంగా అడవుల పెంపకం,  తోటల పెంపకం కూడా వృద్ధి చెందాయి.   గత ఒక సంవత్సర కాలంలో, 16,500 మొక్కలను నాటడం జరిగింది. ఫలితంగా, వాతావరణంలో 330 టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గదానికి ఇది దోహదపడింది.  

ఈ కార్యక్రమాల అమలులో సమాజ భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషించింది.  పర్యావరణ నివారణ మరియు ఇంధన పరిరక్షణ యొక్క ఆవశ్యకత గురించి బాగా అవగాహన కలిగిన సంస్థ, స్వీయ-చేతన నావికా సమాజం ద్వారా  నావికాదళంలో చేపట్టిన హరిత చర్యల విజయవంతమయ్యాయి.  పర్యావరణం పట్ల బాధ్యత యొక్క భావాన్ని పెంపొందించడానికి, భారీగా ‘శ్రామ్‌దాన్’, తీరప్రాంత ప్రక్షాళన వంటి వివిధ సామూహిక భాగస్వామ్య కార్యక్రమాలను  క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతోంది.   దీనితో పాటు, ప్రతీ ఏటా, ఉత్తమమైన హరిత పద్ధతులను అవలంబించే యూనిట్‌ను గుర్తించడానికి ప్రవేశపెట్టిన ట్రోఫీ, హరిత కార్యక్రమాలను చేపట్టడానికి యూనిట్లను ప్రోత్సహించడంలో ఉపయోగకరంగా ఉంది.

మొత్తంమీద, భారత నావికాదళం దాని కార్యాచరణ మరియు వ్యూహాత్మక పాత్రలలో ఇంధన సామర్థ్యం మరియు పర్యావరణ పరిరక్షణను ఏకీకృతం చేస్తూ స్థిరమైన భవిష్యత్తు వైపు స్థిరమైన దృష్టిని కేంద్రీకరించింది.

 

*****



(Release ID: 1629481) Visitor Counter : 353