గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అన్ని యుఎల్‌బిలు, స్మార్ట్ సిటీలలో తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలను అందించడానికి అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్- తులిప్ ప్రారంభం

అమలు చేయడానికి ఎంఓహెచ్యుఏ-ఏఐసిటిఈ మధ్య అవహగానా ఒప్పందం

Posted On: 04 JUN 2020 1:47PM by PIB Hyderabad
అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (తులిప్) - దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ లోకల్ బాడీస్ (యుఎల్‌బి), స్మార్ట్ సిటీలలో తాజా గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించే కార్యక్రమం. తులిప్ పోర్టల్ ను  మానవ వనరుల అభివృద్ధి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ `నిశాంక్ ', సహాయ మంత్రి (ఇంచార్జి)  శ్రీ హర్దీప్ ఎస్.పురి ఆన్ లైన్ లో ప్రారంభించారు.  హెచ్ఆర్డి కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, ఎంఓహెచ్యుఏ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా, ఛైర్మన్, ఎఐసిటిఇ మరియు రెండు మంత్రిత్వ శాఖల అధికారులు మరియు ఎఐసిటిఇ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 
తులిప్ కార్యక్రమం యువత శక్తి ని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ సానుకూల మార్పును తీసుకురాగల వారి సామర్థ్యాన్ని గట్టిగా విశ్వసించే మన ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వ ఫలితం ఇది. భవిష్యత్తులో భారత యువత పోషించాల్సిన ముఖ్యమైన పాత్రను ప్రధాని నొక్కి చెప్పారు. పట్టణ భారత్ భవిష్యత్తుకు పునాది వేయడంలో స్మార్ట్ సిటీస్ మిషన్ గత మూడేళ్లుగా గణనీయమైన పురోగతి సాధించింది. ఇప్పటి వరకు, రూ.1,65,000 కోట్ల టెండర్లు జారీ కాగా, వీటిలో సుమారు రూ.1,24,000 కోట్లు అమలు దశలో ఉన్నాయి. రూ. 26,700 కోట్లు ఇప్పటికే పూర్తయి పౌరులకు ప్రయోజనాలను అందిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభాన్ని నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంలో స్మార్ట్ సిటీలు ముందంజలో ఉన్నాయి, వాటిలో 47 స్మార్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను సంక్షోభ నిర్వహణ వార్ రూమ్స్ గా ఉపయోగిస్తున్నాయి.

'ఆకాంక్షల భారతదేశం’ అనే స్ఫూర్తితో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా తులిప్‌ను రూపొందించారు. "దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు తాజా ఇంజనీర్లకు ఒక సంవత్సరం వరకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది."  భారతదేశంలో గణనీయమైన సాంకేతిక గ్రాడ్యుయేట్లు ఉన్నారు, వీరి కోసం  వృత్తిపరమైన అభివృద్ధికి  వాస్తవ ప్రపంచ ప్రాజెక్టు అమలు మరియు ప్రణాళిక అవసరం. 

 ఈ ప్రయోగం 2025 నాటికి ఎంహెచ్ఆర్డి, ఏఐసిటిఐ ఒక కోటి విజయవంతమైన ఇంటర్న్‌షిప్‌ల లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక ముఖ్యమైన మెట్టు.    

ఎంఓహెచ్యుఏ-ఏఐసిటిఈ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందం 5 సంవత్సరాల వ్యవధిలో  ఎంఓహెచ్యుఏ, ఏఐసిటిఈ పాత్ర, బాధ్యతలను నిర్దేశిస్తుంది.

    నగరాల్లో ఇంటర్న్‌షిప్‌లను పెంచడంలో ఎంఓహెచ్యుఏ రాష్ట్ర ప్రభుత్వాల సహాయం తీసుకుంటుంది. తులిప్ కింద యుఎల్‌బిలు, స్మార్ట్ సిటీలు పాల్గొనడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలను ఇది చేపట్టనుంది. రాష్ట్రాలు మరియు యుటిలు పట్టణ స్థాయిలో ప్రాంతీయ సవాళ్లు, అవకాశాలపై లోతైన అవగాహన కలిగి ఉన్నందున, అలాంటి ఇంటర్న్‌షిప్‌లలో అభివృద్ధి చేసిన నైపుణ్యాలతో వారి అవసరాలను సరిపోల్చడం ద్వారా తులిప్‌ను సమర్థవంతంగా అమలు చేయవచ్చు.

 

 

****

 


(Release ID: 1629455) Visitor Counter : 287