పర్యటక మంత్రిత్వ శాఖ

దేశో అప్నా దేశ్ సిరీస్ కింద 27వ వెబ్ నార్ ద్వారా “హర్యానా – సంస్కృతి, వంటకాలు మరియు పర్యాటకం రంగం” అందించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 03 JUN 2020 8:07PM by PIB Hyderabad

2020 జూన్ 2న హర్యానా గొప్పతనాన్ని మరియు వారసత్వాన్ని ప్రదర్శించే విధంగా “హర్యానా – సంస్కృతి, వంటకాలు మరియు పర్యాటకం రంగం”పై కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెబ్ నార్ ను నిర్వహించింది. దేఖో అప్నా దేశ్ సిరీస్ లోని ఈ 27వ సెషన్ ను పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు డైరక్టర్ జనరల్ శ్రీమతి రూపేంద్రర్ బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమలో రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ మరియు ప్రాక్టీస్ అడ్వకేట్ శ్రీ రాజ్ బిర్ దేశ్వాల్, కురుక్షేత్ర విశ్వవిద్యాలయ సాంస్కృతిక మరియు యువజన వ్యవహారాల డైరక్టర్ డాక్టర్. మహాసింగ్ పూనియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్, ఎం.డి. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శ్రీ రోహ్ తక్ తదితరులు పాల్గొన్నారు. దేఖోఅప్నా దేశ్ వెబ్ సిరీస్ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ క్రింద భారతదేశ వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నమే గాక, ఇది వర్చువల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ఉన్నతిని నిరంతరం వ్యాప్తి చేస్తుంది.

హర్యానా చరిత్ర మరియు ప్రాశస్త్యాన్ని గురించి వివరించడం ద్వారా సెషన్ ను ప్రారంభించారు. సర్ చోతు రామ్, రావు తులా రామ్, పండిట్ నేకీ రామ్, తౌ దేవీ లాల్ వంటి నాయకుల గొప్పతనాన్ని వివరించారు. హర్యానాను దేస్వాలి బెల్ట్ మరియు బగారి బెల్ట్ అని రెండు భాగాలుగా విభజించడం గురించి అంటే భూ ప్రాతిపదికన (ఖాదర్, నార్దక్, బాగద్, బంగర్), జనాభా ప్రాతిపదికన (అహిర్వాల్, మేవాట్, బ్రజ్) మరియు పర్యావరణ సాంస్కృతిక మండలాల ఆధారంగా (అహిర్వాల్, మేవాట్, బాగర్, నార్దక్, ఖాదర్) విభజించడం గురించి వివరించారు. హర్యానాకు చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు నటులు కపిల్ దేవ్, సుశీల్ కుమార్, మల్లికా షెరావత్, మేఘనా మాలిక్, రణదీప్ హుడ్డా వంటి వారి గురించి తెలియజేశారు.

ఈ వెబ్ నార్ లో శివుడు, విష్ణువు యొక్క భూమి కావడం వల్ల రాష్ట్రానికి ఎలా పేరు వచ్చిందనే విషయాన్ని కూలంకషంగా తెలిపారు. హర్యానా పేరు చరిత్రలో హరి కా అనా నుంచి వచ్చిందని, ఉన్నతమైన చరిత్ర కారణంగా హర్యానా ఏయే పేర్లతో పిలవబడిందనే అంశాన్ని వివరించారు. హర్యానాలో 1000కి పైగా పురావస్తు ప్రదేశాలు ఉన్నాయి. ఇది హర్యానా సంస్కృతిని తెలువుతుంది. 1526, 1556, 1761లో మూడు యుద్ధాలు పానిపట్ లో జరిగాయి. ఇక్కడ సంస్కృతి వ్యవసాయ ఆధారితమైంది. ఘంగోర్, ఝూమర్, చతి లాంటి జానపద నృత్యాలు హర్యానా సంస్కృతిని కళ్ళకు కడతాయి. ఇక్కడ అద్భుతమైన పురావస్తు ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని ఉత్సవాల రాష్ట్రంగా అభివర్ణిస్తారు. హర్యనీల సాంఘీకరణలో ముఖ్యమైన అంశాలు కమ్యూనిటీ ప్రమేయం, గౌరవప్రదమైన జీవనం, పఖ్డి ధరించడం, చౌపాల్ లో కూర్చుని హుఖ్ఖాలను ఆస్వాదించడం.

హర్యాణా గ్రామీణ వైభవాన్ని, గొప్పతనానాన్ని ఆస్వాదించడంలో భాగంగా ఇక్కడ పచ్చని పొలాలను, భేషజాలు లేని జీవితాల గురించి తెలియజేశారు. పర్యాటక నిర్వహణ కార్యక్రమంలో మాస్టర్స్ డిగ్రీ కోర్సును ప్రారంభించిన మొదటి రాష్ట్రం హర్యానా ఇని ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశంలో 5 హోటల్ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్లను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం కూడా ఇదే.

వీటితో పాటు హర్యానా వంటకాల విషయానికి వస్తే ఇక్కడి వంటకాలు రుచికమైనవి, ఆరోగ్యానికి ఉత్తమమైనవి. ఇక్కడ పాలు, పాల పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. పెరుగు, మజ్జిగ, జున్ను వంటి ఉత్పత్తులను హర్యానాలో భాంగా చూడవచ్చు. సీజన్ ప్రకారం చుర్మా, మేథి కా సాగ్, కక్కారి, బైంగన్ భార్తా, రాబ్రీ సత్తు, ఆమ్ తప్కా, నెయ్యి బురా వంటి అనేక రుచికరమైన పదార్థాలను ఆస్వాదించవచ్చు. హర్యానా ఆహారంలో సరళతను ప్రదర్శించే హర్యన్వి తాళీని కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో ఉల్లిపాయలు, కచ్రీ, మిశ్రమ కాయధాన్యాలు, పప్పులు సహా మేథి గజార్ కి సబ్జీ, కాచే ఆమ్ కి సబ్జీ, బజ్రే కి రోటీ, బేసన్ మసాలా రోటీ, హరా ధానియా చోలియా, మిథే చావల్, చుర్మా, ఖీర్, లాస్సి, ఆమ్ కామ్ భూనే ఆలూ, తమటార్ చట్నీ మరియు రైతా, గేవార్, రెవ్రీ, పెడే, గజర్‌పాక్ వంటి స్వీట్స్ కూడా ఉంటాయి. హర్యానాను సందర్శించే ఎవరైనా ఇక్కడి ప్రయాణాల్లో ధాబాల నుంచి మంచి భోజనాన్ని మరచిపోలేరు.

హర్యానా నగరమే కాకుండా, ఇక్కడ సందర్శన కోసం అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఢిల్లీకి సమీపంలో జాట్ ల మనసుకు దగ్గరరైన సోనిపట్ ఖ్వాజా ఖ్రిజ్ర్, మాము భంజా సందర్శించవచ్చు. మూడు యుద్ధాలు జరిగిన పానిపట్ లోని సమాధి, కాబులి బాగ్ మసీదు, పానిపట్ మ్యూజియం మరియు బు అలీ షా సమాధి వంటి ప్రదేశాలు కూడా ఇందులో ఉన్నాయి. నాలుగు ద్వారాలు ఉన్న హిసాలు కొన్ని చారిత్ర వాస్తవాలు, మరియు శిల్పసౌందర్యాన్ని కలిగి ఉంటాయి. బ్లూబర్డ్ లేక్, అసిఘర్ ఫోర్ట్, రాఖీ గార్హి వంటి కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. అదే విధంగా హర్యానాలోని హాన్సీ, కర్నాల్, ఇంద్రీ, సఫిడాన్ వంటి ప్రదేశాలు ఈ భూభాగాన్ని సందర్శించే ప్రజలను అమితంగా ఆకర్షిస్తాయి.

3 నుంచి 4 రోజులు అదే విధంగా 7 రోజుల పర్యటన ద్వారా హర్యానా అవగాహన పెంచే వివరాలు పంచుకున్నారు. హర్యానాలో ప్రయాణించే వారిలో సంస్కృతి, వారసత్వం, వంటకాల ను ఆస్వాదించే మనసు ఉన్న వారికి ఇది మంచి అవకాశం. సోనిపట్, పానిపట్, కర్నాల్, కైతాల్, పెహోవా, కురుక్షేత్ర, అంబాలా, యమునా నగర్, ఫింజ్ లాంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. పింజోర్ – సిర్సా – ఫతేహా బాద్ – రాఖీ గార్హి – హిసార్ – భివాని – రోహ్తక్ – ఝాజ్జర్ – రేవారి – గుర్ గావ్ – ఫిరోజ్ పూర్ – ఝిర్కా లాంది ప్రదేశాలు 3 రోజుల పర్యటనలో భాగంగా ఉన్నాయి.

ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా శ్రీమతి రూపీందర్ బ్రార్ మాట్లాడుతూ, పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ఇన్ క్రెడిబులు ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ గురించి వివరించారు. ఇది ప్రాంతీయ భాషల్లో ప్రావిణ్యం అవసరం లేకుండానే స్థానిక పౌరులకు మంచి జీవనోపాధిని సృష్టిస్తుందని తెలిపారు. ఇది స్థానిక సంస్కృతిని సొంత చేసుకునేందుకు, సందర్శకులకు తెలియజేసేందుకు పౌరులకు మంచి అవకాశమని తెలిపారు.

దేకో అప్నా దేశ్ వెబ్ నార్ సిరీస్ ను నేషనల్ ఈ – గవర్నెన్స్ డిపార్ట్ మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్ శాఖల సాంకేతిక భాగస్వామ్యంతో ప్రదర్శించారు. ఈ వెబ్ నార్ సెషన్ ఇప్పుడు  https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured లింక్ ద్వారా అందుబాటులో ఉంది. అదే విధంగా భారత దేశంలో పర్యాటక శాఖ అన్ని కార్యక్రమాలో సామాజిక మాథ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి.

వెబ్‌నార్ యొక్క తరువాతి ఎపిసోడ్ “ఇండియా – గోల్ఫ్ క్రీడాకారులు స్వర్ఘధామం” పేరిట 2020 జూన్ 4 న ఉదయం 11:00 గంటలకు షెడ్యూల్ చేయబడింది, https://bit.ly/GolfDAD లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సందర్శించవచ్చు. 

***

 


(Release ID: 1629256) Visitor Counter : 37