సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎం.ఎస్.ఎం.ఇల వర్గీకరణకు సంబంధించిన కొత్త నిబంధనలు అమలు చేయడానికి సిద్దమౌతోన్నఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ .
ఇంతకుముందు ప్రకటించినట్టుగా ఎం.ఎస్.ఎం.ఇల వర్గీకరణకు సంబంధించి ఉన్నతస్థాయి సీలింగ్ ను పెంచడం జరిగింది.
నూతన నిర్వచనం, నూతన ప్రాతిపదికను నోటిఫైడ్ చేయడం జరిగింది. ఇవి 2020 జూలై 1 వతేదీ నుంచి అమలులోకి వస్తాయి.
కొత్త నిర్వచనం ప్రకారం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ ప్రైజెస్ ఏవైనాసరే వాటి టర్నోవర్‌లో ఎగుమతులను లెక్కించరు.
సవివరమైన మార్గదర్శకాలు, ఇతర వివరణలు, రెగ్యులేషన్లు వేరుగా విడుదల చేయడం జరుగుతుంది.
ఎం.ఎస్.ఎం.ఇల కు సహాయం చేయడానికి ఛాంపియన్స్ పేరుతో సహాయ యంత్రాంగం ఏర్పాటు
Posted On:
03 JUN 2020 12:37PM by PIB Hyderabad
దేశంలో ఎం.ఎస్.ఎం.ఇలకు సంబంధించి నిర్వచనం,ప్రాతిపదిక విషయంలో ప్రస్తుతం ఉన్ననిబంధనలను ఎగువకు సవరించి అమలు చేయడానికి వీలు కల్పిస్తూ ,సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎం.ఎస్.ఎం.ఎఇ) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొత్త నిర్వచనం, దానికి సంబంధించిన ప్రాతిపదిక 2020 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది.
ఎం.ఎస్.ఎం.ఇ డవలప్‌మెంట్ యాక్ట్ 2006లో అమలులోకి వచ్చిన 14 సంవత్సరాల తర్వాత ఎం.ఎస్.ఎం.ఇ నిర్వచనంలో సవరణలను 2020 మే 13న ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్‌లో ప్రకటించారు.ఈ ప్రకటన ప్రకారం,సూక్ష్మ తయారీ, సేవల యూనిట్ల నిర్వచనాన్ని కోటి రూపాయల పెట్టుబడికి, 5 కోట్లరూపాయల టర్నోవర్‌కు పెంచారు. చిన్న యూనిట్ల పరిమితిని 10 కోట్ల రూపాయల పెట్టుబడి, 50 కోట్ల రూపాయల టర్నోవర్‌కు పెంచారు. అలాగే, మీడియం యూనిట్ల పరిమితిని 20 కోట్ల రూపాయల పెట్టుబడికి, 100 కోట్ల రూపాయల టర్నోవర్‌కు పెంచారు. భారత ప్రభుత్వం 01-06-2020న ఎం.ఎస్.ఎం.ఇ నిర్వచనాన్ని ఎగువకు సవరించాలని నిర్ణయించింది. మధ్యతరహా ఎంటర్ ప్రైజెస్‌లకు ప్రస్తుత పెట్టుబడి పరిమితిని రూ 50 కోట్లరూపాయలకు, టర్నోవర్‌ను 250 కోట్ల రూపాయలకు ప్రభుత్వం సవరించింది.
ప్రస్తుత ఎం.ఎస్.ఎం.ఇల నిర్వచనానికి ప్రాతిపదిక 2006 నాటి ఎం.ఎస్.ఎం.ఇ.డి చట్టం ఆధారంగా రూపొందినది. ఇది తయారీ యూనిట్లకు, సేవల యూనిట్లకు వేరు వేరుగా ఉంది. ఇందులో ఆర్థిక పరిమితులకు సంబంధించి తక్కువ పరిమితులు నిర్దేశించి ఉన్నాయి. అప్పటినుంచి ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయి. 2020 మే 13న ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించిన తరువాత, ప్రకటించిన సవరణలు మార్కెట్, ధరవరలకు అనుగుణంగా లేవని ప్రభుత్వానికి పలు విజ్ఞాపనలు అందాయి. అందువల్ల దీనిని తిరిగి ఎగువకు సవరించాలని పలువురు కోరారు. ఈ విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి తిరిగి మీడియం యూనిట్నకుగల పరిమితిని పెంచాలని నిర్ణయించారు. మారిన కాలానికి, వాస్తవస్థితికి అనుగుణంగా దీనిని మార్చాలని నిర్ణయించారు. వాస్తవిక వర్గీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు , సులభతర వాణిజ్యాన్ని కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
అలాగే , తయారీ, సేవల యూనిట్లకు సంబంధించి కొత్త ఉమ్మడి వర్గీకరణ ఫార్ములాను నొటిఫై చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు తయారీ, సేవల రంగానికి సంబంధించి ఎలాంటి మార్పు లేదు. టర్నోవర్ కు సంబంధించి కొత్త ప్రాతిపదికను చేర్చారు.
నూతన నిర్వచనం ఎం.ఎస్.ఎం.ఇల ప్రగతికి, బలోపేతానికి మార్గం సుగమం చేస్తుందని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేకించి, ఎగుమతులను టర్నోవర్ లెక్కింపునుంచి మినహాయించే నిబంధన ఎం.ఎస్.ఎం.ఇలకు ప్రోత్సాహకరంగా ఉండడంతోపాటు , ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్ ప్రయోజనాలు పోతాయన్న భయాలు ఏవీ లేకుండానే మరిన్ని ఎగుమతులు చేయడానికి ఇది ప్రోత్సాహం కల్పిస్తుంది.ఇది దేశ ఎగుమతులను మరింత పెంచడానికి, తద్వారా మరింత ప్రగతి, ఆర్థిక కార్యకలాపాలకు, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది.
సవివరమైన మార్గదర్శకాలు, మారిన నిర్వచనానికి అనుగుణంగా వర్గీకరణలో మార్పులకు సంబంధించిన వివరణలను ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ వేరుగా విడుదల చేస్తుంది.
ఎం.ఎస్.ఎం.ఇలకు, నూతన ఎంటర్‌ప్రెన్యుయర్లకు మద్దతుగా ఛాంపియన్స్‌పేరుతో (www.champions.gov.in) గట్టి బలమైన మద్దతునిచ్చే యంత్రాంగాన్నిఏర్పాటు చేసినట్టు ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిని ఇటీవలే ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఆసక్తికల ఎంటర్ ప్రైజ్‌లు, ప్రజలు ఈ ఏర్పాటు ద్వారా ప్రయోజనం పొందవచ్చు, అలాగే తమ సందేహాలు, ఫిర్యాదులను వారికి తెలపవచ్చు. వీరు వాటిని అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరిస్తారు.
(Release ID: 1628993)
Visitor Counter : 430