రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
'నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్' సీఎండీగా వి.ఎన్.దత్ బాధ్యతలు స్వీకరణ
ఎరువుల రంగంతోపాటు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 ఏళ్ల అనుభవం
प्रविष्टि तिथि:
03 JUN 2020 2:05PM by PIB Hyderabad
'నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్' (ఎన్‌ఎఫ్‌ఎల్) మార్కెటింగ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న శ్రీ వీరేంద్రనాథ్ దత్... ఆ సంస్థ ఛైర్మన్ &మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఆయన 2018 అక్టోబర్ నుంచి సంస్థలో

కొనసాగుతున్నారు. ఎరువుల రంగంతోపాటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వి.ఎన్.దత్ కు 35 ఏళ్ల గొప్ప అనుభవం ఉంది.
ఎన్‌ఎఫ్‌ఎల్‌కు రాకముందు గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ వి.ఎన్.దత్ పనిచేశారు. ఆ సంస్థ దేశవ్యాప్త మార్కెటింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించారు. పారిశ్రామిక వ్యూహాలు, ప్రణాళికలు, న్యాయ సలహాలనూ అందించారు. ముంబయికి చెందిన మహానగర్ గ్యాస్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్‌గానూ వి.ఎన్.దత్ సేవలు అందించారు. గెయిల్‌లో చేరకముందు, ఓఎన్‌జీసీలోనూ పదేళ్లపాటు పనిచేశారు.
ఎన్‌ఎఫ్‌ఎల్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా వి.ఎన్.దత్ ఘనతలు సాధించారు. 2017-18లో 43 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న సంస్థ ఎరువుల అమ్మకాలను 2019-20 నాటికి 57 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. రెండేళ్లలోనే 32 శాతం వృద్ధిని చూపించారు. ఈ కాలంలో ఎరువుల రంగంలో, 'నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్' దేశవ్యాప్తంగా తనదైన ముద్రను వేసింది.
***
(रिलीज़ आईडी: 1628977)
आगंतुक पटल : 251