భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

ఈస్ట్ సెంట్రల్ అరేబియా సముద్రంపై తీవ్రమైన తుఫానునిసర్గా. ఉత్తర మహారాష్ట్రకు మరియు దక్షిణ గుజరాత్ తీరాలకు తుఫాను హెచ్చరిక – ప్రమాదకర సంకేతాలు

· ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఉత్తర – ఈశాన్య దిశగా వెళ్ళి ఉత్తర మహారాష్ట్ర తీరాన్ని అలీబాగ్ (రాయ్ గడ్ జిల్లా, మహారాష్ట్ర)కి దక్షిణాన దాటేందుకు అవకాశాలు...

· 100 నుంచి 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 120 కిలోమీటర్ల మేర తీవ్రమైన తుఫాను

· ఈ రోజు సాయంత్రం వరకూ దక్షిణ గుజరాత్ తీరం వెంబడి ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా సముద్రంలో పరిస్థితి అత్యంత తీవ్రం

· 1-2 మీటర్ల ఎత్తులో తుఫాను పెరగడం వల్ల ముంబై, థానే మరియు రాయ్ గఢ్ జిల్లాల లోతట్టు ప్రాంతాలను తీవ్రమైన వర్షం ముంచెత్తే అవకాశం.

Posted On: 03 JUN 2020 10:45AM by PIB Hyderabad

భారత వాతావరణ శాఖ వారి జాతీయ వాతావరణ సూచన కేంద్రం / ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ శాస్త్ర కేంద్రం / తుఫాను హెచ్చరికల విభాగం వారి ప్రకారం:

తూర్పు మధ్య అరేబియా సముద్రంపై తీవ్రమైన తుఫాను నిసర్గా గత 6 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదిలి 08-30 గంటలకు కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు అనగా జూన్ 03, 2020న ఈశాన్య అరేబియా సముద్రంపై 17.6 ° N అక్షాంశం మరియు 72.3 ° E రేఖాంశం పై అలీబాగ్ (మహారాష్ట్ర) కి నైరుతి దిశలో 130 కిలోమీటర్లు, ముంబైకి (మహారాష్ట్ర) నైరుతి దిశలో 170 కిలోమీటర్లు మరియు సూరత్ (గుజరాత్) కి 400 కిలోమీటర్ల నైరుతి దిశలో ఉంది.

 ఈ రోజు అనగా జూన్ 3వ తేదీ మధ్యాహ్నం అలీబాగ్ (రాయ్ గడ్ జిల్లా, మహారాష్ట్ర)కి దక్షిణాన ఉత్తర ఈశాన్యదిశగా వెళ్ళి, ఉత్తర మహారాష్ట్ర తీరాన్ని దాటడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది తీవ్రమైన తుఫానుగా మారితి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, అదే వేగంతో పాటు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుఫానుగా మారడానికి ఆస్కారం ఉంది.

ఈ వ్యవస్థను ఇప్పుడు ముంబై (మహారాష్ట్ర) మరియు గోవాలోని డాప్లర్ వెదర్ రాడార్స్ (డి.డబ్ల్యు.ఆర్) నిరంతరం పర్యవేక్షిస్తోంది.

 

 

 

Date/Time(IST)

Position

(Lat. 0N/ long. 0E)

Maximum sustained surface wind speed (Kmph)

Category of cyclonic disturbance

03.06.20/0830

17.6/72.3

100-110 gusting to 120

Severe Cyclonic Storm

03.06.20/1130

18.1/72.7

100-110 gusting to 120

Severe Cyclonic Storm

03.06.20/1730

18.7/73.3

80-90 gusting to 100

Cyclonic Storm

03.06.20/2330

19.4/73.9

50-60 gusting to 70

Deep Depression

04.06.20/0530

20.2/74.6

40-50 gusting to 60

Depression

 

 



(Release ID: 1628954) Visitor Counter : 137