జల శక్తి మంత్రిత్వ శాఖ

గ్రామీణ ఇళ్లన్నిటికీ 2022 డిసెంబరుకల్లా కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి మేఘాలయ ప్రణాళికలు

Posted On: 01 JUN 2020 5:51PM by PIB Hyderabad

గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ (జెజెఎం) 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహాలకు పూర్తి వినియోగంలో ఉండే కుళాయి కనెక్షన (ఎఫ్‌హెచ్‌టిసి) ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ మిషన్, ప్రతి గ్రామీణ గృహాలకు తాగడానికి యోగ్యమైన నీటి లభ్యతకు హామీ ఇచ్చింది. రెగ్యులర్ మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన రోజుకు 55 లీటర్ల తలసరి (ఎల్పిసిడి)  త్రాగునీరు అందించడం మిషన్ లక్ష్యం. మిషన్ లక్ష్యాన్ని మరింత పెంచుతూ, అన్ని రాష్ట్రాలు తమ అమలు ప్రణాళికలను ప్రభుత్వానికి, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలోని నేషనల్ మిషన్‌ ఆమోదం కోసం సమర్పిస్తారు. 

దీనిలో భాగంగా మేఘాలయ 2022 డిసెంబర్ కల్లా 100% గృహాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు వార్షిక కార్యాచరణ ప్రణాళికను జల శక్తి మంత్రిత్వ శాఖ కింద ఉన్న జాతీయ జల్ జీవన్ మిషన్ కి సమర్పించింది. మొత్తం రాష్ట్రంలో 5.89 లక్షల గ్రామీణ గృహాలు ఉండగా 1.80 లక్షల కుళాయి కనెక్షన్లను 2020-21 లో ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించింది. అంటే 2020-21 సంవత్సరానికల్లా 1096 గ్రామాలకు 100% కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని మేఘాలయ సంకల్పించడం ప్రశంసనీయం.  పనితీరు ఆధారంగా అంటే ఎక్కువ కుళాయి కనెక్షన్లు ఇచ్చే రాష్ట్రాలకు జెజెఎం కింద కేంద్రం అదనపు నిధులను సమకూరుస్తుంది. 2020-21లో ఈ మిషన్ అమలుకు కేంద్రం రూ.175 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. 

సగటు కన్నా ఎక్కువ వర్షపాతం, పుష్కలమైన సహజ జల వనరులు మేఘాలయకు వరం లాంటిది.  అయినప్పటికీ, హాని కలిగించే మానవ తప్పిదాల కారణంగా, నీటి మట్టాలు క్షీణిస్తున్నాయి. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వానికి బహుముఖ దిద్దుబాటు విధానం అవసరం. అందువల్ల జల్ జీవన్ మిషన్ కచ్చితమైన మార్గదర్శనంతో శుభ్రమైన, తాగడానికి వినియోగంలో ఉండే నీరుని అందించడానికి రాష్ట్రానికి సహకరిస్తుంది. దీని ద్వారా అమ్మాయిలు, మహిళలు స్వచ్ఛమైన నీటి కోసం కష్టాలు పడకుండా చేయడమే లక్ష్యం.ఇది సాధించాలంటే గ్రామ స్థాయిలోనే ఒక వ్యూహం అమలు కావాలి, ఆ పనికి రాష్ట్రం తగు ఏర్పాట్లు చేస్తోంది. బలహీన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ఈ పథకం విజయవంతంగా అందడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తగు నీటి కోసం ప్రజలు ఒకే దగ్గర గుమికూడకుండా వారి వారి ఇళ్ల వద్దకే నీటి సరఫరా అయ్యేలా చేయడం రాష్ట్రం  ప్రాధాన్యత అంశంగా తీసుకుంది.ఈ ప్రాజెక్ట్ అమలులో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, తద్వారా గ్రామీణ ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. 

జల్ జీవన్ మిషన్ లో భాగంగా నీటి నాణ్యత పరీక్ష లాబొరేటరీలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. కోవిడ్-19 తో దేశమంతా తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వలస కార్మికులకు జీవనోపాధి కల్పించడం చాల ముఖ్యం. అందువల్ల ఈ మిషన్ సందర్బంగా నీటి సరఫరాకు సంబంధించిన పనులను వారికి కల్పించడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ దిశగా మేఘాలయ తగు చర్యలు తీసుకుంటుంది. 



(Release ID: 1628464) Visitor Counter : 154