రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అద్దె మోటారు క్యాబ్ / సైకిల్ పథకాల అమలుకు సంబంధించి అడ్వైజరీని జారీ చేసిన రహదారుల మంత్రిత్వ శాఖ
Posted On:
01 JUN 2020 6:03PM by PIB Hyderabad
“రెంట్ -ఎ- మోటార్ క్యాబ్ / సైకిల్ పథకాలు” అమలుకు సంబంధించి కొంత మంది వాటాదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆధారంగా చేసుకొని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఆర్‌టీ-11036/09/2020-ఎంవీఎల్ (పీటీ-1)గా మంత్రిత్వ శాఖ దీనిని జారీ చేసింది. ఈ అడ్వైజరీలో అంశాలు ఈ కింది విధంగా పేర్కొనబడ్డాయి.
(ఎ) వాహనదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ / ఐడీపీ మరియు మోటారు క్యాబ్ (ఫారం 3/4) అద్దెకు సంబంధించిన లైసెన్స్ కాపీ లేదా ఆయా పథకాలకు సంబంధించిన మోటారు సైకిల్ (ఫారం 2) కలిగి ఉన్నట్లయితే.. వారిని ఏదైనా ఇతర బ్యాడ్జ్ కోసం పట్టుబట్టకూడదు.
(బి) “రెంట్-ఎ-మోటార్ సైకిల్ పథకం” అమలు చేయబడుతుంది మరియు ఆపరేటర్లకు లైసెన్సులు అధికారికంగా పరిగణించబడతాయి.
(సి) దీనికితోడు, ‘రెంట్-ఎ-మోటార్‌సైకిల్ స్కీమ్’ కింద లైసెన్స్ ఉన్న ద్విచక్ర వాహనం వారు సంబంధిత పన్నుల చెల్లింపులతో ఆయా రాష్ట్రాల గుండా ప్రయాణాలు సాగించేందుకు అనుమతించబడుతారు.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జూన్ 06వ తేదీ, 1989లో జారీ చేసిన ఎస్ఓ 437 (ఈ) పత్రంలో రెంట్-ఎ-క్యాబ్ పథకంకు సంబంధించిన విధివిధానాల్ని నోటిఫై చేసింది. మంత్రిత్వ శాఖ మే 05వ తేదీ 1997లో జారీ చేసిన ఎస్ఓ 375 (ఈ) పత్రంలో రెంట్- ఎ -మోటార్ సైకిల్ పథకంకు
సంబంధించి పలు విధివిధానాల్ని నోటిఫై చేసింది. పర్యటకులు, కార్పొరేట్ అధికారుల వాహనాలు, వ్యాపార ప్రయాణికులు మరియు కుటుంబాలు సెలవు దినాల్లో వినియోగించే టాక్సీ మాదిరిగా ఆయా వాహనాలను పరిగణిస్తారు.
(Release ID: 1628458)
Visitor Counter : 279